భార్య సెక్స్ కాదనడానికి అసలు కారణాలు ఇవే..ప్రతీ మగాడు తప్పకుండా తెలుసుకోవాలి..

304

పత్రికల్లో అత్యాచారాలకు సంబందించిన వార్తలను చూడగానే సహోద్యోగులు తీవ్రంగా స్పందిస్తుంటారు..అలాంటి వెధవలను ఉరి తీయాలి..కాదు కాదు చౌరాస్తాలో నిలబెట్టి ముక్కలు ముక్కలుగా నరకాలి అంటూ ఆవేశంగా ఊగిపోతుంటారు..ఆమె మాత్రం స్పందించదు..మహా అయితే నిర్లిప్తంగా ఒక నవ్వు నవ్వుతుంది..ముక్కు మొహం తెలియని వాడు ఒక్కసారి జరిపే అత్యాచారం కంటే కట్టుకున్నవాడు రోజూ చేసే అత్యాచారం మహా భయంకరమైనది అంటూ మనసులోనే మధన పడుతూ ఉంటుంది..నిజమే ఇష్టం లేని కలయిక మానభంగం లాంటిదే..ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది గృహిణులు ఆ పడక గది నరకాన్ని అనుభవిస్తున్నారో తేల్చి చెప్పడానికి ఎలాంటి గణాంకాలు లేవు..

Image result for girls

ఓ అధ్యయనం లో 900 మందిని సర్వే చేయగా అందులో దాదాపు 47 శాతం మంది నిజమే..మా భర్తలు మమ్మల్ని బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు అని అంగీకరించారు..జీవిత భాగస్వామి సెక్స్ ను తిరస్కరించడానికి చాలా కారణాలు ఉండొచ్చు..బాల్యంలో ఆమె ఏ బందువుల కారణంగానో లైంగిక దోపిడీకి గురయి ఉండవచ్చు..లేదంటే కన్నతల్లో తోబుట్టువో సంసార జీవితంలో తీవ్ర హింసను అనుభవించి ఉండవచ్చు..ఇలాంటి ఙాపకాలు జీవిత భాగస్వామి పట్ల భయాన్ని పెంచుతాయి..సెక్స్ అంటే విముఖత కలిగిస్తాయి..అతడికి లైంగికంగా దగ్గరయ్యే మానసిక సామర్ధ్యం లేకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు..

ఈ క్రింది వీడియో చూడండి

భర్త లైంగిక ప్రవర్తన జుగుప్స కలిగించినా ఇలాంటి స్పందనలే ఉంటాయి..ఆమె కాదనగానే పురుషుడి అహం దెబ్బ తింటుంది..అతనిలోని మృగం బయతకు వస్తుంది..నయానో భయానో దారికి తెచ్చుకోవాలని చూస్తాడు..ఆ ఆలొచన సరికాదు..ఆటవికం అనైతికం నేరం కూడా..ముందుగా ఆతిరస్కారానికి కారణం తెలుసుకోవాలి..ఆమెలో గూడుకట్టుకున్న భయాల్ని అపోహలను తొలగించాలి..తను సెక్స్ ను మాత్రమే తిరస్కరిస్తోంది..భర్తగా తనను కాదనే అర్దం చేసుకొవాలి..కమ్మగా వండిపెడుతుంది..ఇంటిని అద్దంలా చూసుకుంటుంది..ఉద్యోగిని గాను మంచి పేరు తెచ్చుకుంటోంది..ఆర్ధికగా ఉదేవగపరంగా అండదండలను అందిస్తోంది..కానీ అక్కడ మాత్రమే అప్పుడు మాత్రమే భీతహరిణం అవుతుంది..చేయి వేయగానే తేళ్ళు జెర్రులు పాకినట్టు వణికిపోతోంది..

Image result for girls

ఇలాంటి సందర్భాల్లో వసరమైతే మానసిక నిపుణుల సలహా తీసుకోవచ్చు..సెక్స్ థెరపీ సమర్దంగా పని చేస్తుంది.. ఆమె కూడా బిగుసుకుపోయి కూర్చోకూడదు..తనవైపు నుంచి కొంత చొరవ ఉండాలి..స్వచ్చందంగా ఆ భయాల వలయం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి..నా అయిష్టాలకు కారణమిది.. నా భయాలకు మూలం ఇక్కడుంది అంటూ తన మనసులో ఉన్నదంతా అతడి ముందు కక్కేయాలి..పురుషుడు ఏ వైఫల్యాన్ని అయినా తట్టుకుంటాడు గాని పడక గదిలో తిరస్కారానికి గురయితే మాత్రం భరించలేడు..ఆ కోణాన్ని ఆమే అర్దం చేసుకోవాలి.. అతడిలోని శారీరక లోపాలో మానసిక జాడ్యాలో ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ విషయాన్ని సున్నితంగా వ్యక్తం చేయాలి..

Image result for girls

కొన్నిసార్లు పురుషుడు ఆమెను దూరంగా పెడుతుంటాడు..అదంతా ఆమె పట్ల అయిష్టతని తెలిపే మార్గం అని అనుకుంటాడు..లేదంటే తన లోని లైంగికపరమైన లోపాన్ని దాచుకోవడానికి ఆ ముసుగు వేసుకుంటాడు..ఆలుమగల లైంగిక వాంచలో సమతుల్యం లోపించడం ఈ సంక్షోభానికి కారణం..అతనిలో కొరికలు బుసలు కొడుతూ ఉంటాయి..ఆమెలో మాత్రం మొక్కుబడిగా ఉంటాయి..లేదంటే ఆమెను సంతృప్తి పరిచే లైంగిక సత్తువ ఆమెలో లేకపోవచ్చు..ఇవన్నీ వైద్యశాస్త్రంలో పరిష్కారం ఉన్న సమస్యలే..ఇద్దరూ గ్రహించాలిస్న విషయాలు కొన్ని ఉన్నాయి..అతని మీద ఆమె కవొచ్చు..ఆమె మీద అతను కావొచ్చు..ఆధిపత్య సాదించడానికి సెక్స్ ను ఒక ఆయుధంగా వాడుకోవడం సరికాదు..శృంగారం మనసుతో ముడిపడిన విషయం.. భౌతికమైన అనుభవం కోసం ఆరాటాన్ని పక్కనపెట్టి ముందుగా మానసిక సామర్ధ్యాన్ని పెంచుకొనే సామర్ధ్యాన్ని పెంచుకోవాలి.. ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకోవాలి..ఫోర్ ప్లేకు ప్రాధాన్యం ఇవ్వాలి..పెళ్ళి పుస్తకంలో సెక్స్ అనేది ఒక ముఖ్యమైన అధ్యాయం.. ఆ పేజీలు ఖాలీగా ఉంటే అది ఆలుమగల వైఫల్యమే..ఇద్దరూ ముద్దాయిలే..ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి..