శృంగారం చేసే సమయంలో చెయ్యకూడని 6 తప్పులు

621

శృంగార‌మంటే ఓ జంట మ‌ధ్య శారీర‌క సంబంధం మాత్ర‌మే కాదు. అదొక ప‌విత్ర కార్యం. రెండు మ‌న‌స్సులు ఒక‌ట‌య్యే వేదిక‌. అలాంటి కార్యం జ‌రిగేట‌ప్పుడు జంటల్లో ఆడ‌, మ‌గ ఎవ‌రైనా కొన్ని తప్పులు చేస్తుండ‌డం స‌హ‌జం. అవి ఏ విష‌యానికి చెందిన‌వి అయినా కావ‌చ్చు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది ఆడ‌వారి గురించి. శృంగారం చేసే స‌మ‌యంలో వారు చేసే చిన్న‌పాటి త‌ప్పుల గురించే ఇక్క‌డ తెలుసుకుందాం. కానీ చాలా మంది ఆడ‌వారు నిజానికి వాటిని త‌ప్పులుగా అనుకోరు. అలాంటివేవో ఇప్పుడు చూద్దాం.

Image result for romance

1. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీలు పురుషుల క‌న్నా ఎక్కువ యాక్టివ్‌గా ఉండాల‌ని చూస్తార‌ట‌. త‌మ‌దే పైచేయి కావాల‌ని భావిస్తార‌ట‌. నిజానికి అలా చేయాల్సిన అవ‌స‌రం లేద‌ట‌.

2. ముందే చెప్పాం క‌దా. శృంగార‌మంటే రెండు జంట‌ల క‌ల‌యిక మాత్ర‌మే కాదు, రెండు మ‌న‌స్సులు ఒక్క‌ట‌వ్వ‌డం అని. అలాంట‌ప్పుడు, శృంగారంలో పాల్గొన్న స‌మ‌యంలో కేవ‌లం పురుషుడే స్త్రీని లాల‌న‌గా ఆప్యాయంగా చూడ‌డ‌మే కాదు, స్త్రీ కూడా అలాగే ప్ర‌వ‌ర్తించాలి.

Image result for romance

3. శృంగారం పూర్త‌య్యాక వెంట‌నే మాట్లాడుకోవాల‌ని స్త్రీల‌కు ఉంటుంద‌ట‌. కానీ పురుషులు మాత్రం మాట్లాడ‌డం క‌న్నా రిలాక్సేష‌న్‌కే అధిక ప్రాధాన్య‌తనిస్తార‌ట‌. అలాంటి స‌మ‌యంలో పురుషున్ని స్త్రీ అర్థం చేసుకుని కామ్‌గా ఉండాల‌ట‌.

Image result for romance

4. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీ ప‌ట్ల పురుషుడు అనుకోకుండా త‌ప్పుగా ప్ర‌వ‌ర్తిస్తే అప్పుడు స్త్రీలు అందుకు పురుషుల‌ను త‌ప్పు ప‌ట్ట‌కూడ‌దు. అలా చేస్తే పురుషుల ఈగో దెబ్బ తిని వారి సంబంధంలో స‌మ‌స్య‌లు ఎదుర‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

5. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు పురుషుడు స్త్రీ ప‌ట్ల ఎలా అయితే ప్ర‌వ‌ర్తిస్తాడో, స్త్రీ కూడా త‌న ప‌ట్ల అలాగే ప్ర‌వ‌ర్తించాల‌ని పురుషుడు కోరుకుంటాడ‌ట‌. అలాంటి సంద‌ర్భాల్లో పురుషుడి కోరిక‌ను కాద‌న‌కూడ‌ద‌ట‌.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

6. శృంగారం అన్నాక చుంబ‌నాలు, చూష‌ణ‌లు, కొర‌క‌డాలు కామ‌న్‌. అలాంటి స‌మ‌యంలో నోటినే ఎక్కువ‌గా వాడాలి త‌ప్ప‌, దంతాల‌ను కాదు.