అమ్మాయి మిమ్మల్ని సీక్రెట్ గా లవ్ చేస్తుందని తెలిపే 10 సంకేతాలు ఇవి

642

ఒకరిని ప్రేమించడం ఎంత సులువో వారికి ఆ విషయాన్ని తెలియజేయడం అంతే కష్టం. ఒక అమ్మాయిని ఇష్టపడి.. ఆ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేక నానా ఇబ్బందులు పడుతుంటారు అబ్బాయిలు. ఆ అమ్మాయి ఎక్కడా వీళ్ళని కాదంటుందో లేక ఆ అమ్మాయికి అలాంటి ఉద్దేశం ఉందో లేదో అన్న భయం ఉంటుంది.అసలు ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమా లేదా అనే కన్ఫ్యూషన్ లో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతారు అబ్బాయిలు.అలాంటి కన్ఫ్యూషన్ ని దూరం చేసేందుకే.. కొన్ని అధ్బుతమైన విషయాలు మీ ముందుకు తెచ్చాం. మీరు నచ్చిన అమ్మాయి మిమ్మల్ని సీక్రెట్ గా లవ్ చేస్తుందేమో తెలుసుకునే విషయాలు ఇవి.మరి వాటి గురించి తెలుసుకుందామా.

Image result for lovers

* ఆమె కళ్ళను, నవ్వును గమనించండి. మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తుందని తెలిసినా లేక ఎక్కువ సార్లు మీతో కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడుతున్నా.. ఆమె మీపై ఇంట్రెస్ట్ చూపిస్తుందని అర్ధం. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడితే ఆ విషయాన్ని వారు ఎక్కువ కాలం దాచలేరు.

* పక్కన ఎంత మంది ఉన్నా మీరు చెప్పే మాటలపై ఎక్కువ దృష్టి పెడుతుందంటే మీ లైన్ క్లియర్ అయినట్టే. మీరు మాట్లాడే మాటలు.. మీరు చేసే పనులు.. ఇలా మీరు చేసే ప్రతీది ఆమె గమనిస్తుందంటే ఆమె మీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టే. మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం… మీకు ఎలాంటి డ్రెస్ అంటే ఇష్టం.. అనే విషయాలు అడిగి మరీ తెలుసుకుంటుంది.

Image result for lovers

* ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా మీపై ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుసుకోవచ్చు. మీరు ఎదురైనప్పుడు తనని తాను అందంగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. కురులు సరి చేసుకోవడం.. పదే పదే తన మేకప్ ని చెక్ చేసుకోవడం లాంటివి చేస్తుంది. మీ జోకులకు అందరికన్నా ఎక్కువ తానే నవ్వుతుంది.

* అమ్మాయిలకి కాంప్లిమేంట్స్ అంటే చాలా ఇష్టం. కానీ మీ విషయంలో తానే మీకు తెగ కంప్లిమేంట్స్ ఇస్తుంది. నువ్వు వైట్ షర్ట్ లో చాలా బాగుంటావ్…. అని ఆమె చెప్తే.. మీకు కూడా ఓ తెలియని ఫీల్ వస్తుంది. అవునా? కాదా?? మీ టేస్ట్ ని కూడా ఇష్టపడుతుందని అర్ధం.

 

* వీలైనప్పుడల్లా మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తుంది. కావాలనో లేక అనుకోకుండానో మీ చెయ్యి తనకి తాకినప్పుడు లోలోపల మురిసిపోతుంది. అందుకే గ్రూప్ ఫోటోలు దిగేటప్పుడు, మీ చేతికి ఏదైనా అందించేటప్పుడు, సరదాగా గొడవ పడుతున్నప్పుడు మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తుంది. అలాగని తను మిమ్మల్ని హద్దులు దాటి తాకడానికి ప్రయత్నించట్లేదన్న విషయం మరువకండి.

* మీ గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఇష్టమైనవి ఏంటి? ఇష్టం లేనివి ఏంటి? ఇలా అన్ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మీ లైఫ్ లో ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకుంటుంది. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో ఆ లిస్టులో తను కూడా చేరబోతుందని తన కాన్ఫిడెన్స్.

Image result for lovers

* మీ కోసం ఎప్పుడైనా సరే కలవడానికి రెడీ గా ఉంటుంది. అది పొద్దున్నే ఐదింటికైనా కావచ్చు లేక రాత్రి పదకొండింటికైనా కావచ్చు… నో చెప్పకుండా ఎప్పుడైనా మీతో మాట్లాడడానికి, మీతో కలవడానికి రెడీ గా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మించిన పని ఆమెకు వేరొకటి లేదు కనుక.

* తనకు వీలుకాకపోయినా మిమ్మల్ని హ్యాపీ గా చూడడానికి ఏదైనా చేస్తుంది. తన ఆఫీస్ లో బిజీగా ఉన్నా మీ కాల్ వచ్చిందంటే ఆ పనిని పక్కకు పెట్టి మీతో మాట్లాడుతుంది. అది కుదరకపోతే వీలైనంత త్వరగా ఆ పని ముగించుకొని మీకు తిరిగి కాల్ చేస్తుంది.

* మీతో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ మీ రిలేషన్ విషయంలో టీజ్ చేసినా పెద్దగా పట్టించుకోదు. నిజానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా టీజ్ చేస్తుంటే మీ ఫీలింగ్ ఎలా ఉందని గమనిస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా పరిచయాలు పెంచుకోడానికి ప్రయత్నిస్తుంది. అలాగని తప్పుగా అర్ధం చేసుకోకండి. తనకు మిగిలిన లాస్ట్ ఆప్షన్ ఇదే మరి. మీ ఫ్రెండ్స్ ద్వారా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు తెలియజేయడానికి ఇదో ప్రయత్నం.

* ఇక లాస్ట్ కి మిగిలింది ఒకే ఒక్క విషయం…! ఇది చాల డేంజర్..!! అమ్మాయిలలో తప్పకుండా ఉండే క్వాలిటీ ఇది. మిమ్మల్ని వేరే అమ్మాయితో చూస్తే అస్సలు ఓర్వలేరు. మీతో ఉన్న ఇతర అమ్మాయిలతో పైకి నవ్వుతు మాట్లాడినా లోపల అగ్నిగుండం ఎప్పుడెప్పుడు పెలుతుందా అన్నట్టు ఉంటుంది. ఒక్కసారి సరదాగా మీకు మీ కాలేజీ లో ఒక అమ్మాయితో రిలేషన్ ఉందని చెప్పి చూడండి. కథ మొత్తం మీకే అర్ధమవుతుంది.

ఈ 10 విషయాల ద్వారా మీరంటే ఆ అమ్మాయి ప్రేమ ఉందొ లేదో తెలుస్తుంది.మీకు తెలిసిన అమ్మాయిలో ఈ లక్షణాలు ఉన్నాయా అయితే ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని అర్థం.ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి లవ్ ప్రపోజ్ చెయ్యండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.అమ్మాయిలలో కనిపించే సీక్రెట్ లవ్ సింప్టమ్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.