ఈ 6 వింత పెళ్లిళ్లను మీ జీవితంలో చూసి ఉండరు

503

పెళ్లి అనేది ప్రతి ఒకరి జీవితంలో ముఖ్యం. ఆ క్షణం కోసం ఎదురుచూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే చాలా మంది చాలా అద్భుతంగా పెళ్లి చేసుకున్న వాళ్ళను చూసి ఉంటారు.వాళ్ళ పెళ్లి విషయాల గురించి వింటేనే మనం ఆశ్చర్యపోతాం. అంత అద్భుతంగా పెళ్లి చేసుకున్నారా అని అనుకుంటాం. అయితే అలాంటి అద్భుతమైన పెళ్లిలే కాదు ఇలాంటి పెళ్లిళ్లు ఏంటిరా బాబు అని అనుకునేలా కూడా చాలా మంది పెళ్లి చేసుకున్నారు.వాళ్ళ పెళ్లిళ్ల గురించి విన్నా మనం ఆశ్చర్యపోతాం. మరి అలంటి వింతైన పెళ్లిళ్ల గురించి తెలుసుకుందామా.

Image result for indian marriage

1. సెలెనే మసిలేలే మరియు హెలెన్ శబుంగ్…. శబుంగ్ ను పెళ్లి చేసుకునేందుకు మసిలేలే వాళ్ళ ఫ్యామిలీకి 500 ఫౌండ్స్ ను చెల్లించింది.దక్షిణాఫ్రికాలోని షులెంగ్ లో 100 మంది సాక్షుల సమక్షంలో జరిగింది. ఈ పెళ్ళిలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మసిలేలే వయసు 61 ఏళ్ళు. అంతేకాకుండా అంతకముందే పెళ్ళైన ఐదుమంది పిల్లలు ఉన్నారు. హెలెన్ వయసు జస్ట్ 8 ఏళ్ళు మాత్రమే.అంతేకాకుండా అతనిని ఇంతకముందే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. తరువాత విడిపోయారు. విడిపోయాకా మసిలేలే అతనిని పెళ్లి చేసుకుంది.

Image result for indian marriage
2. లియుఏ…. ఇతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా.. లియుఎ వయసు 30 ఏళ్ళు.2007 లో ఇతని పెళ్లి చైనాలోని కాంగ్ జియాన్ గ్రామంలో జరిగింది.ఈ పెళ్ళిలో వధువు ఎవరికీ కనపడదు. ఎందుకంటే లియుఎ అతనిని అతనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ముందు ఒక లేడి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి ఫోటో దిగి దానిని కటౌట్ లా చేసుకుని ఆ కటౌట్ ను అమ్మాయిలాగా ఊహించుకుని సాంప్రదాయ పద్దతిలో 100 మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

Image result for indian marriage
3.సాల్ 9000 మరియు నేనే అనాగసాకి… జపాన్ టోక్యో నగరానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి తనను తానుగా సాల్ 9000 అనే వ్యక్తిగా ప్రకటించుకున్నాడు. అతను ఆన్ లైన్ లో పరిచయం అయినా అమ్మాయి నేనే అనాగసాకిని కొన్ని వందల మంది సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. ఇందులో వింతేమీ ఉందని అనుకుంటున్నారా.. అనాగసాకి అనేది అమ్మాయి కాదు ఒక వీడియో గేమ్ లో ఉండే యానిమేషన్ బొమ్మ. ఇదేమిటి అని అతనిని అడిగితే నిజమైన అమ్మాయి కంటే ఈమె బెటర్ అని చెబుతారు.

Image result for indian marriage
4.అహ్మద్ మహ్మద్ డోరె మరియు సాఫియా అబ్దుల్లా… వీరిద్దరి పెళ్లి సోమాలియాలో గురిసార్ అనే ప్రాంతంలో జరిగింది. ఈ పెళ్ళిలో విచిత్రం ఏమిటి అంటే వీరిద్దరి మధ్య వయసు తేడా 95 ఏళ్ళు.అతని అహ్మద్ వయసు 112 ఏళ్ళు కాగా సాఫియా వయసు 17 ఏళ్ళు.సాఫియా కంటే ముందే అహ్మద్ ఐదు మందిని పెళ్లి చేసుకున్నాడు. అందులో ముగ్గురు చనిపోయారు. మనువాళ్ళు మనువరాళ్లు మునిమనువళ్లు కూడా ఉన్నారు. ఇందులో మరి చాగస్తం ఏమిటి అంటే ఇతనికి సాఫియాతో కూడా పిల్లల్ని కనాలని ఉందంట.
5.బింబిల్లాదాస్ మరియు కోబ్రా… బింబిల్లాదాస్ అనే అమ్మాయి వయసు 30 ఏళ్ళు. మనదేశానికి చెందిన హిందూ మహిళ.ఉండేది ఒరిసా రాష్టం అటవిల్లా ప్రాంతం. ఈమె తన బంధువుల సమక్షంలో ప్రేమించిన ఒక కోబ్రాను పెళ్లి చేసుకుంది. తనకు జబ్బు వచ్చినప్పుడు పాముకు డైలీ పాలు పోయడం వలన జబ్బు తగ్గిందని అందుకే పామును ప్రేమించిందంట.ఆ కోబ్రా ఇపటివరకు ఆమెకు హాని కలిగించకపోవడం విశేషం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

 

6.మగాలి జస్మి మరియు జోనాథన్ జార్జ్….మగాలి వయసు 30 ఏళ్ళు. వీరు ప్రాన్స్ దేశానికి చెందినవాళ్లు. అయితే ఇంకా కొద్దిరోజులు పెళ్లి ఉందనగా జార్జ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.జార్జ్ మీద ఉన్న ప్రేమ వలన అతనిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంది మగాలి.ఫ్రాన్స్ లో శవాన్ని పెళ్లి చేసుకోవచ్చు అనే ఛట్ఠం ఉండడంతో శవాన్ని పెళ్లి చేసుకుంది మగాలి.

ఇవేనండి వింతైన పెళ్లిళ్లు. వీటి గురించి వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఈ పెళ్లిళ్ల గురించి ఆ పెళ్లిళ్లలో ఆశ్చర్యపోయేలా ఉన్న విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో