ఈ 4 రకాల వారు సొంత కుటుంబాన్నే నాశనం చేసుకుంటారు

555

తన రాజనీతితో మౌర్య సామ్రాజ్య కీర్తిని దిగంతాలకు తీసుకువెళ్లిన ఘనత చాణక్యుడిది. చంద్రగుప్త మౌర్యుని అస్థానంలో యుద్ధ, రాజకీయ వ్యూహాలు రాయబారిగానూ, అంతరింగిక, ముఖ్య సలహాదారుగానూ ఆయన వ్యవహరించారు. కేవలం రాజనీతి విషయాలే కాదు కుటుంబం, భార్యభర్తల మధ్య అనుబంధం లాంటి అంశాల్లో కూడా అపారమైన ఙ్ఞానాన్ని అందించారు. అప్పట్లో చాణక్యుడు తెలిపిన విషయాలు నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.అయితే ఆయన చెప్పిన విషయాలలో కొన్నిటి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for girls

1. గుణో భూషయతి రూపం,శీలం భూషయతే రూపం
సిద్ధిర్ భూషయతే విద్యాన్ ,భోగో భూషయతి ధనం
నిర్గుణస్య హతం దూపం, శీలస్య హతం కులం
అసిదస్య హతా విద్య , అభోగస్య హతం ధనం
సంస్కారం లేని అందం నిరుపయోగమని అలాంటివారికి సమాజంలో గౌరవ మర్యాదలు దక్కవని అర్థం. అందంగా లేనివారు మంచి గుణం కలిగినవారు మానసిక సౌందర్యంతో అందరి మన్ననలను పొందుతాడు. కోకిల నలుపుగా ఉన్నా దానికున్న స్వరం చేత అందరు దానికి ఆకర్షితులవుతారు. అందుకే ఏ వ్యక్తిని అయినా అందంతో కాకుండా గుణంతో సంస్కారంతో గుర్తించాలి.

Image result for girls
2. ఏదైనా శిక్షణ తీసుకుంటున్న వ్యక్తి వద్ద ఎలాంటి నైపుణ్యం లేకుంటే అలంటి శిక్షణ వ్యర్థం అని కేవలం ఉపయోగపడే శిక్షణ అర్థవంతమైనదని అలాంటి వాటి వలనే ఉపయోగమని అతను ఉన్నతంగా ఎదుగుతాడని అర్థం. మీకు ఏ రంగంలో ప్రావీణ్యం ఉందొ దానిలోనే శిక్షణ తీసుకోవడం మంచిది అని చాణిక్యుడు సూచన. దుష్టుల వద్ద శిక్షణ తీసుకోవడం అనేది వినాశనానికి దారితీస్తుంది. జ్ఞానాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలని చెప్పాడు.విద్యా జ్ఞానం అనేది మంచికి ఉపయోగపడనప్పుడు అలాంటి జ్ఞానం కూడా వృధా అని చాణిక్యుడు చెప్పాడు.

Image result for girls

3. సమాజం కోసం ఇతరులకు సహాయం చెయ్యడానికి ఉపయోగపడని ధనం వ్యర్థం. ధనాన్ని ఎవరి కోసం ఉపయోగించక చివరికి తన సుఖానికి కూడా వాడక కూడపెట్టిన ధనం నిరుపయోగంగా ఉంటుంది. అలంటి ధనం వలన ఎవరికీ ఉపయోగం ఉండదు కనుక అలంటి ధనం వ్యర్థం అని చాణిక్యుడు చెబుతున్నాడు.
4.ఉన్నత కులంలో పుట్టిన కూడా వారి కర్మల ఫలంగానే వారి కులోన్నతి ఉంటుందని ఒకవేళ వారు ఎలాంటి నీచపు పనులకు దిగిన వారి కులవంశం భ్రష్టు పట్టిపోతుందని నాల్గవ శ్లోకం అర్థం. గతంలో చేసిన మంచి పనులను మరచిపోయి వర్ధమాన కాలంలో చేసిన చెడ్డ పనులనే గుర్తుకుపెట్టుకుంటారు. పరస్త్రీ వ్యామోహంలో పడిన వ్యక్తి జీవితం నాశనం అవుతుందని ఈ నాల్గవ పాదం చెబుతుంది.

ఇవేనండి చాణిక్యుడు చెప్పిన విషయాలు.వీటిని పాటించి మీ జీవితాన్ని మంచిగా మలుచుకోండి..మరి ఈ విషయం గురించి మీరేమంటారు.పైన చెప్పిన విషయాల గురించి అలాగే చాణిక్యుడి నీతి సూక్తుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.