భర్త ,భార్య నిద్రించే భంగిమను బట్టి వారి మధ్య ఎలాంటి బంధం ఉందొ చెప్పొచ్చు

687

భార్యాభర్తలు నిద్రపోయే విధానాన్ని బట్టి వాళ్ల రిలేషన్ షిప్ స్టేటస్ తెలుసుకోవచ్చని మీకు తెలుసా ? నిజమే..భార్యాభర్తలు పడుకునే విధానం.. ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరు చాలా అన్యోన్యంగా రొమాంటిక్ పడుకుంటారు. మరికొందరు దూరదూరంగా పడుకుంటారు. అయితే ఏ పొజిషన్ లో పడుకుంటే వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉందొ తెలుసుకోవచ్చు.మరి ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for wife and husband sleeping

ఇద్దరు క్లోజ్ గా పడుకుంటే
ఈ పొజిషన్ లో మీ భర్త మీకు దగ్గరగా ఉంటారు. అంటే చాలా సన్నిహితంగా, సెక్యూర్ గా ఉంటారు. ఒకేసారి సాన్నిహిత్యాన్ని, రక్షణను కల్పిస్తూ ఉంటారు. ఈ పొజిషన్ మిమ్మల్ని నమ్ముతున్నానని తెలుపుతుంది. కాళ్లు దూరంగా పెట్టుకుని పడుకుంటే ఒకరి కాళ్లు మరొకరు తాకకుండా దూరంగా పడుకునే వాళ్లు ఇద్దరూ స్వతంత్రంగా ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధారపడకుండా ఉంటారు.

Image result for wife and husband sleeping
ఇద్దరు ఫేస్ టు ఫేస్ పడుకుంటే
ఫేస్ టు ఫేస్ పడుకునే వాళ్లు రిలేషన్ చాలా బావుంటుంది. మీ భాగస్వామి కళ్లు మిమ్మల్ని రాత్రంతా చూడాలని భావిస్తున్నాయని తెలుపుతాయి. ఒకవేళ సడెన్ గా మీవైపు ఫేస్ చేసి పడుకున్నారంటే మీ నుంచి సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారని అర్థం.
హగ్ చేసుకుని పడుకుంటే
ఈ పొజిషన్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తెలుపుతుంది. ఇది ఎక్కువగా రిలేషన్ షిప్ ఏర్పడిన కొత్తలో ఉంటుంది. ఈ పొజిషన్ లో ఎక్కువ ప్రేమను పంచుకుంటారు.కోరుకుంటారు.

Image result for wife and husband sleeping

భుజానికి ఆనుకుని పడుకుంటే
భాగస్వామి భుజాలకు ఆనుకుని నిద్రించడం ద్వారా వాళ్ల మధ్య రిలేషన్ మరింత పెరుగుతుంది. చాలా కేరింగ్ గా, సాన్నిహిత్యంగా, చాలా ఆనందంగా ఉన్న బంధాన్ని వివరిస్తుంది.
చెస్ట్ పై నిద్రిస్తే…
భాగస్వామి చెస్ట్ పై నిద్రించే పొజిషన్ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని వివరిస్తుంది. భాగస్వామికి వెనకవైపు కౌగిలించుకుని పడుకుంటే తనకు రక్షణ కల్పిస్తున్నారని అర్థం. అదే మీ భాగస్వామికి ముఖం చేసి పడుకుంటే అతనిపై ఆధారపడ్డారని అర్థం. అదే భాగస్వామి చెస్ట్ పై నిద్రిస్తుంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారని అర్థం. ఇరువైపులా ఒక్కొక్కరు పడుకుంటే
ఒక్కో వైపు పడుకుంటే ఇద్దరి మధ్య నమ్మకం ఉందని సంబంధాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారని తెలుపుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

లెగ్ హగ్ చేసుకుని పడుకుంటే…
కాలి స్పర్శతో భాగస్వామి మీద ఉన్న ప్రేమను వివరిస్తారు. మరో కోణం ఏంటంటే ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ కి లెగ్ హగ్ సీక్రెట్ కోడ్.
ఒకరినొకరు పట్టిచుకోకుండా పడుకుంటే
భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు పట్టించుకోకుండా ఎవరిపాటికి వాళ్లు నిద్రించడంలో చాలా అర్థాలున్నాయి. రిలేషన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, పొత్తులు కుదరనప్పుడు, ఇద్దరి మధ్య గొడవలు ఉన్నప్పుడు ఈ పొజిషన్ ని ఎంచుకుంటారు.ఇవేనండి భార్యాభర్తలు పడుకునే భంగిమలు ఆ భంగిమల ద్వారా వారి మధ్య ఎలాంటి బంధం ఉందొ తెలియజేసే అంశం.మరి మేము చెప్పిన ఈ విషయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.