అక్కడ పెంపుడు కుక్కకు రేషన్ ఇస్తున్న ప్రభుత్వం..ఎందుకో తెలిస్తే షాకవుతారు

321

కుక్క మనకు పెంపుడు జంతువు. కుక్కలను మన ఇంటి సభ్యులాగా చూసే వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు.వాళ్ళు తినే ఆహారాన్ని పెడుతూ బెడ్ మీద వాళ్ళ పక్కనే పడుకోబెట్టుకుంటారు.అయితే మనకు ప్రభుత్వం కొన్ని పథకాలను పెట్టింది.అందులో ఒకటి రేషన్ సరుకులు ఇవ్వడం.బీదవాళ్ళ కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తోంది.అయితే మనకు ఇవ్వడమే కాకుండా మన ఇంట్లో ఉండే కుక్కకు కూడా రేషన్ సరుకులు ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా.అలా ఎందుకు ఇస్తారు అని అనుకుంటున్నారా..కానీ ఒకచోట ఇస్తున్నారు.ఇదేమిటీ కుక్కకు కూడా రేషన్ సరకులు ఇవ్వడమేంటి? అని అనుకుంటున్నారా?.దాని వెనుక ఒక కథ ఉంది.మరి అదేమిటో చూద్దామా.

ఓ కుక్క పభుత్వ ప్రజాపంపిణీ వ్యవస్థ కింద ఏర్పాటైన చౌక ధరల దుకాణం నుంచి రేషన్ సరకులు పొందిన వింత ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధర్ జిల్లా బోడియా గ్రామపంచాయతీలో వెలుగుచూసింది. గత సంవత్సరం ఓ కుక్కకు 60 కిలోల రేషన్ సరకులను పంపిణీ చేశారని తాజాగా గుర్తించిన అధికారులు నాలిక్కరుచుకున్నారు. బోడియా గ్రామానికి చెందిన నర్సింగ్ బోదార్ (75) తన పెంపుడు కుక్క రాజు పేరును కుమారుడిగా రేషన్ కార్డులో నమోదు చేయించాడు. బోడియా చౌకధరల దుకాణంలో ఆధార్ కార్డులను తనిఖీ చేస్తుండగా నర్సింగ్ బోదార్ తన భార్యతోపాటు రాజు అనే కుమారుడున్నాడని పేర్కొన్నాడు. రాజు ఎక్కడని ప్రశ్నిస్తే తన పెంపుడు కుక్కే తన కుమారుడని నర్సింగ్ సెలవిచ్చాడని ధర్ పౌరసరఫరాలశాఖ అధికారి ఆనంద్ గోలే చెప్పారు.

నర్సింగ్ ప్రతీ వారంలాగే రేషన్ సరకుల కోసం చౌకధరల దుకాణానికి వచ్చాడు. కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలివ్వాలని దుకాణంలోని సేల్స్ మెన్ కైలాష్ కోరాడు. నర్సింగ్ తన భార్య, తన ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు అందించాడు. మీ కుమారుడు రాజు ఆధార్ కార్డు ఎక్కడుందని సేల్స్ మెన్ ప్రశ్నించాడు. ‘‘ఓ…అదా.. రాజు అంటే అది నా పెంపుడు కుక్క’’అంటూ నర్సింగ్ తాపీగా సెలవిచ్చాడు. దీంతో సేల్స్ మెన్ తోపాటు పౌరసరఫరాలశాఖ అధికారులు నివ్వెరపోయారు. నర్సింగ్‌కు రేషన్ కార్డు గ్రామపంచాయతీలో ఇచ్చారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి కుక్క పేరిట రేషన్ సరకులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ అధికారి ఆనంద్ గోలే చెప్పారు.విన్నారుగా కుక్కకు కూడా రేషన్ సరుకులు ఇచ్చిన మహామేధావుల గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.