అర్ధరాత్రి ఈ లేడీ పోలీస్ చేసిన పనికి అందరూ షాక్

384

ఈ సృష్టిలో అమ్మ ప్రేమ ఎవ‌రికి అయినా ఒకేలా ఉంటుంది పసిపాపాయిల‌ను చూస్తే ఎవ‌రికి అయినా చిరున‌వ్వు వ‌స్తుంది. ఇక పోలీసులు అంటే కొంద‌రు వారికి దూరంగా ఉంటారు కాని వారు సొసైటిలో దుర్మార్గాల‌ను అన్యాయాల‌ను ఎదిరించి మంచినిపెంపొందించే కృత నిశ్చ‌యంతో ఉంటారు అందుకే వారికి దూరంగా ఉన్నా సొసైటి చాలా మంది పందాలో వెళుతుంది. ఇకతాజాగా ఓ మ‌హిళా పోలీసు చేసిన ప‌ని అభినందించాల్సిందే మ‌రి ఆమె చేసిన ప‌ని ఏమిటి ఎందుకు ఆమెకు అభినంద‌న‌లు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.సమయం అర్ధరాత్రి ఒంటి గంట. అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఆయన్నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో వెనుక ఎవరో పాప గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరు పాప ఏడుస్తున్నారని అడిగాను. అప్పుడాయన నెలన్నర వయసున్న ఆ పాపను ఎవరో రోడ్డుపై వదిలేశారు.. ఒకతను పోలీసు స్టేషన్‌కి తెచ్చాడు అని చెప్పారు.

Image result for lady polices

పాప అంతలా గుక్కపెట్టి ఏడుస్తోంటే.. ఒక తల్లిగా ఆ బాధ నాకు అర్థమైంది. ఏదో తెలియని బాధ.. ఆ పాపకు ఏమవుతుందో అన్న ఆందోళన. దీంతో మరొకటి ఆలోచించకుండా ఎనిమిది నెలల వయసున్న మా బాబును మా అమ్మకు అప్పజెప్పి.. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని బేగంపేట నుంచి అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాను.అప్పటికీ ఆ పాప గట్టిగా కళ్లు మూసుకుని గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. మరోపక్క మంచి దుస్తులు లేకపోవడంతో చలికి వణుకుతూ ఉంది. ఆ పసికందు పడుతున్న బాధను చూసి నాకే ఏడుపు వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పాపకు చనుబాలు పట్టాను. దాదాపు 40 నిమిషాల పాటు చన్ను వదల్లేదు. కడుపారా పాలు తాగాక నెమ్మదిగా కళ్లు తెరిచింది. అప్పుడు హమ్మయ్య అనిపించి. తర్వాత ఆ పాపను మెటర్నిటీ ఆస్పతికి అప్పగించి నేను ఇంటికి తిరిగెళ్లాను. ఇవీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న పాపకు పాలు పట్టిన పోలీసు కానిస్టేబుల్ ప్రియాంక చెప్పిన మాట‌. నిజంగా ఆమె చేసిన ప‌నికి హ్యాట్సాఫ్ అనాల్సిందే. డిసెంబరు 30న రాత్రి 11.30 గంటల సమయంలో స్టేషన్‌కి ఎవరో యువకుడు నెలన్నర వయసున్న పాపను తీసుకొచ్చాడు.

Image result for lady polices

అత‌ను బుర్ఖా ధరించి మద్యం తాగి ఉన్న ఓ మహిళ అతనికి ఈ పాపను అప్పజెప్పి నీళ్లుతాగి వస్తానని చెప్పి వెళ్లింది అని తిరిగి రాలేదు అని చెప్పాడు. అయితే ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో ఆ పాప ఏడవడం మొదలుపెట్టింది. యాకత్‌పురాకు చెందిన ఆ యువకుడు పాపను ఇంటికి తీసుళ్లి ప్యాకెట్ పాలు తాగించేందుకు ప్రయత్నం చేశారు. కానీ, నెలన్నర వయసున్న పాప కావడంతో తాగలేదు. పైగా ఏడుపూ ఆపలేదు.దీంతో వాళ్లు ఆ పాపను అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా పోలీసులు ఎంత ఓదార్చినా ఆ పాప ఏడుపు ఆపలేదు.ఇంతలో రవీంద్ర ఇంటికి ఫోన్ చేయగా.. ఆయన భార్య పాప ఏడుపు విని.. అర్ధరాత్రి స్టేషన్‌కు వచ్చి పాలిచ్చి వెళ్లారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక్క‌డ మ‌రో విశేషం ఏమిటి అంటే ఆమె బేగంపేట మహిళ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.తర్వాత ఆ పాప తల్లిదండ్రుల గురించి ఆరా తీయగా.. పాప తండ్రి జేబు దొంగతనం కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న ఫిరోజ్ ఖాన్‌గా తేలిందన్నారు. పాపను యువకుడికి ఇచ్చిన తల్లి.. తన భర్త కోసం చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చినపుడు ఈ విషయం తెలిసిందని రవీంద్ర తెలిపారు. చివరకు పాప తల్లిదండ్రులను పిలిచి.. విచారించగా వాళ్లు ఉస్మానియా సమీపంలో ఓ షెడ్డులో ఉంటున్నట్లు తెలిసిందన్నారు.వారిని మందలించి ఇకనుంచి ప్రతి రోజూ ఉదయం.. సాయంత్రం పోలీసు స్టేషన్లో చూపించాలన్న షరతుతో వాళ్లకు ఆ పాపను అప్పజెప్పామని వివరించారు. ఇప్పుడు ఆమె చేసిన ప‌నికి అంద‌రూ ఆమెని ప్ర‌శంసిస్తున్నారు…మరి ఆ చిన్నారి పాపాయికి పాలు ప‌ట్టించిన ఘ‌ట‌న‌పై మీ అభిప్రాయాన్ని ఆమె చేసిన ప‌నిపై మీ అభినంద‌న‌ల‌ను తెలియ‌చేయండి.