కేరళ వరదల్లో ఈ కలెక్టర్ చేసిన పనికి దేశం మొత్తం షాక్

410

కేర‌ళ వ‌ర‌దల్లో చిక్కుకున్న వారికి స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతూనే ఉన్నాయి …దేవ భూమిలో క‌కావిక‌లం అయిన ప్రాంతాన్ని చూస్తే, ఎవ‌రికి అయినా క‌న్నీరు రాక‌మాన‌దు …ప్ర‌కృతి ప్ర‌కోపిస్తే ఎలా ఉంటుంది అనేది మ‌రోసారి ఇక్క‌డ క‌నిపించింది… వరద బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. పెరియార్ నది, పంబా నది ఎన్న‌డూ లేనంత‌గా పొంగి ప్రవహిస్తోంది. 100 ఏళ్ల‌ల్లో ఎన్న‌డూ లేనంత‌గా వ‌ర్ష‌పు నీరు చుట్టుముట్టింది.. ఇక త‌మ‌ను కాపాడేవారు ఎవ‌రైనా ఉన్నారా అని, అక్క‌డ ఇళ్ల‌ల్లో చిక్కుకున్న‌వారు ఆశ‌గా ఎదురుచూశారు…ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డిపారు.

Image result for kerala flood

ఇక ఈ స‌మ‌యంలో ఇద్ద‌రూ ఐఏఎస్ ఆఫీస‌ర్లు కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేశారు.. ఈ స‌మ‌యంలో వారు అత్యున్న‌త స్ధితిలో ఉన్న ఉద్యోగులు అని మ‌ర్చిపోయారు.. సాధార‌ణ ఉద్యోగుల్లా వారూ ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డ్డారు.. అదే సమయంలో నదీ తీరంలో ఒక తండ్రి చేతిలోని పసిబిడ్డతో బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాడు. తమను కాపాడేవారికోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆస‌మ‌యంలో ఆ యువ ఆఫీస‌ర్ ఆ బిడ్డ‌ని కాపాడాడు. అలాగే ఆ ఇద్ద‌రూ (ఎఫ్ సీ ఐ) నుంచి వ‌చ్చిన ఆహారాన్ని అలాగే రిలీఫ్ ఫండ్ కు వ‌చ్చిన ఆహార ప‌దార్ధాలు వాట‌ర్ బాటిల్స్ నేరుగా తీసుకుని వారికి వారు స‌ప్లై చేశారు… పైగా భుజాల‌పై ఆ బ‌స్తాలు మోసి రూమ్ లో పెట్ట‌డం చూస్తే అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లిగింది..

Image result for kerala flood

ఎన్డీ.ఆర్.ఎఫ్ సిబ్బంది ఇక్క‌డ ఉన్న అధికారులు కూడా వీరు చేస్తున్న సాయం చూసి షాక్ అయ్యారు.. వ‌ర‌ద ప్ర‌వాహం ఎంత ఉన్నా రెండు రోజులు వీరు ఇద్ద‌రూ సాధార‌ణ ఉద్యోగుల్లా శ్ర‌మ ప‌డుతూనే ఉన్నార‌ని వీరిని ప్ర‌శంసించారు.. ద‌గ్గ‌ర ఉండి ఈక‌లెక్ట‌ర్ జాయింట్ క‌లెక్ట‌ర్ క‌లిసి సాయం చేస్తూ నిరాశ్ర‌యులు అయిన వారిని ఆదుకున్నారు అని ఇక్క‌డ సిబ్బంది చెబుతున్నారు.. అలాగే వీరి శ్ర‌మ‌ని చూసి ఆ ప్ర‌జ‌లు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు.. ఓ క‌లెక్ట‌ర్ అంటే త‌ను జిల్లాలో ఏప‌నికి ఆర్డ‌ర్ వేసినా ఉద్యోగులు చేయాలి.. అలాంటి క‌లెక్ట‌ర్ సాధార‌ణ వ్య‌క్తిగా బ‌స్తాలు మోస్తు ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేశారు.. వీరు చేసిన ప‌నికి అక్క‌డ వ‌ర‌ద బాధితులు కూడా ప్ర‌శంస‌లు ఇచ్చారు.. ఓ క‌లెక్ట‌ర్ ఓ జాయింట్ క‌లెక్ట‌ర్ నిజ‌మైన ప్రజా ఉద్యోగులు అనిపించుకున్నారు అని అంద‌రూ భావించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలా ప్ర‌శంస‌లు అందుకున్న క‌లెక్ట‌ర్లు తాము ప్ర‌జా సేవ చేయ‌డానికి ఉద్యోగాలు చేరాము అని, ఇలా ప్ర‌జా సేవ చేసే అవ‌కాశం మాకు ఆ దేవుడు, మా చ‌దువు క‌ల్పించింది అని గ‌ర్వంగా చెబుతున్నారు.. నిజంగా ఇలాంటి ఆఫీస‌ర్లు ఉంటే దేశంలో అభివృద్ది ప‌రుగులు పెడుతుంది.. చిన్నా పెద్ద ధ‌నిక బీద అనే భేదాలు లేకుండా ముందుకు వెళితే దేశం సుభిక్షంగా ఉంటుంది అని అంటున్నారు.. ఇక వీరు రెవెన్యూ డిపార్ట్ మెంట్లో అనేక మార్పులు తీసుకువ‌చ్చార‌ట‌. వీరు జిల్లాలో ప‌నిచేస్తే ఆ జిల్లాలో ప‌రిపాల‌న‌కు డోకా ఉండ‌దు అని పేరు తెచ్చుకున్నార‌ట‌.. ఈ క‌లెక్ట‌ర్ల‌కు మ‌నం కూడా సెల్యూట్ చేద్దాం.. వారు చేసిన ఈ సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌పై, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.