కామమా లేక పిచ్చా..కొడుకు స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న తల్లి

352

కామాతురానా న భయం న లజ్జ అని ఒక సామెత. కామంతో మనిషి ఆలోచనలు నిండిపోతే ఎలాంటి తప్పు చేయడానికైనా వెనకాడరని పెద్దలు చెప్పిన మాట అది. ఇప్పుడు చెప్పే ఘటన వింటే అది నిజమేనని అనిపించక మానదు. దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల మాయలో కుటుంబ సభ్యులను, కట్టుకున్నవాళ్లను కడతేర్చడానికి కూడా వెనుకాడట్లేదు. ఇప్పుడు మరొక అక్రమ సంబంధ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు విన్న అక్రమ సంబంధ ఘటనలు ఒక ఎత్తు అయితే ఈ ఘటన మరొక ఎత్తు. ఇప్పటి వరకు భర్తలనే చంపారు. కానీ ఇప్పుడు కన్నకొడుకును చంపింది. తన కొడుకు స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక తల్లి.. తన సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ఆ స్నేహితుడి సహాయంతో కొడుకుని హత్య చేసింది.

హరియాణాలోని జజ్జర్ జిల్లా చమన్ పురాకు చెందిన మీనా దేవి (44) అనే మహిళకు ప్రమోద్ (23) అనే కొడుకు ఉన్నాడు. బౌన్సర్‌గా పని చేసే ప్రమోద్‌ను కలవడానికి అతని స్నేహితుడైన ప్రదీప్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో మీనా, ప్రదీప్‌ మధ్య సాన్నిహిత్యం పెరిగి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే కొన్ని రోజుల తర్వాత తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరాతీశాడు. నిజం తెలిసి మనస్థాపానికి గురైన ప్రమోద్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అంతేకాకుండా తన స్నేహితుడిని ఇంటికి రావద్దని హెచ్చరించాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రమోద్‌ను హత్య చేయాలని మీనా, ప్రదీప్‌లు నిశ్చయించుకున్నారు.

Image result for romance

ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం ప్రమోద్‌ ఇంటి వద్ద ఉన్నప్పుడు మీనా తన ప్రియుడు ప్రదీప్‌తో సహా మరో ఇద్దరినీ ఇంటికి పిలిపించి కొడుకును దారుణంగా హత్య చేయించింది. అనంతరం తన కొడుకును ఎవరో హత్య చేశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా తల్లి మీనాను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఇంటిచుట్టుపక్కల వారిని విచారించగా అసలు బండారం బయటపడింది. తొలుత సౌరభ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా డొంకంతా కదిలింది. దీంతో తల్లి మీనా, స్నేహితుడు ప్రదీప్‌, మరో ఇద్దరిని పోలీసులు ఆరెస్టు చేశారు.చూశారుగా ఈ మహాతల్లి ఎంతటి పని చేసిందో. మరి అక్రమ సంబంధం కోసం కొడుకును చంపిన ఈ తల్లి ఘటన గురించి అలాగే రోజురోజుకు పెరిగిపోతున్న అక్రమ సంబంధాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.