పెళ్ళిలో పెళ్ళికూతురికి నగ్నం గా ఫోటోలు తీసాడు .. చివరికి పెళ్లి కొడుకు ఫోటోగ్రాఫర్ ని ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు

594

ఫోటోలు తీయడం ఫోటోగ్రాఫర్ అలవాటు.మంచి మంచి ఫోటోలు తీసి అతని పేరు ప్రఖ్యాతలు పెంచుకోవాలనుకుంటాడు.అయితే ఇప్పుడు ఒక ఫోటో గ్రాఫర్ అదే చేశాడు.అయితే అందరు తీసేలాకాకుండా, కళాత్మకంగా ఫోటోలు తీయాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఓ మోడల్‌ను సంప్రదించాడు. ఆమెతో తన మెదడులోని ఆలోచనలు పంచుకున్నాడు. ఆ విధంగా ఫోటోలకు ఫోజులిచ్చేందుకు సమ్మతించింది. దీంతో తాను అనుకున్నట్టుగానే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇపుడు ఈ ఫోటోలే అతని ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి.ఒక ఫోటో వలన అతని ప్రాణాలకు ఏమిటి ప్రమాదం అనుకుంటున్నారా..అయితే పూర్తీగా చెబుతా వినండి.

Related image

కోల్‌కతాకు చెందిన ప్రీతమ్‌ మిత్రాకు వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా మంచి పేరుంది.గత ఐదేళ్లుగా ప్రీతమ్‌ ఫ్రొఫెషనల్‌ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.మరింత పాపులారిటీ కోసం సరికొత్తగా ఫొటో‌షూట్ చేద్దామని భావించాడు. ఇటీవల ఓ మోడల్‌తో ఫొటోషూట్‌ నిర్వహించాడు. అయితే అది సాధారణ ఫొటోషూట్‌ అయితే ఏ సమస్య ఉండేది కాదు. కానీ మోడల్‌ను పెళ్లికూతురుగా, బెంగాల్‌ స్టైల్‌లో పెద్ద బొట్టుతో అలంకరించి న్యూడ్‌ ఫొటోలు తీశాడు.ఆ నగ్న చిత్రంలో మోడల్ ముఖం, వక్షోజాలు కనిపించకుండా తమల పాకులు, జుట్టుతో కవర్ చేశాడు.అతను తీసిన ఆ ఫొటోలో సదరు మోడల్ మొఖం మీద తమలపాకులు పెట్టుకొని మిగతాదంతా న్యూడ్ గా, పెద్ద బొట్టు పెట్టుకొని యువరాణి లాకా కిరీటం కూడా పెట్టుకుంది.

Image result for indian marriages

ఆమె శరీరంపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫొటో తీసి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.దీంతో వివాదం చెలరేగింది.కళాత్మకత ఏమో కానీ మతపరమైన సంప్రదాయాలను దెబ్బతీశాడంటూ బెదిరింపులు మొదలయ్యాయి.బెంగాళీ నెటిజన్లు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫొటో బెంగాల్‌ వివాహ వ్యవస్థను, హిందువులను అవమానపరిచేలా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. 24 గంటల్లో ఆ ఫొటోను ఆ ఫేస్‌బుక్‌ పేజీని తొలిగించకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అలాగే అతని తలను తీసుకొచ్చినవారికి బహుమానం కూడా ఇస్తామని పిలుపునిస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గత వారం రోజులుగా వస్తున్న ఈ బెదిరింపులకు భయపడ్డ ప్రీతమ్‌ రక్షణ కల్పించాలని కోల్‌కతా పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఏదో చేద్దామని చేసిన పని ప్రీతమ్‌కు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ప్రీతమ్ తీసిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో వ్యవహారం కూడా రచ్చైంది.చూడాలి మరి ఈ కథ చివరికి ఏమౌతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.అతను తీసిన ఫోటో గురించి దాని వలన అతనికి వచ్చిన సమస్య గురించి అలాగే అతను తీసిన ఫోటోలో మీకు కూడా తప్పు కనిపిస్తుందా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.