ఏనుగును సముద్రంలోకి లాకెళ్లిన రాకాసి అలలు చూస్తే మీకు వణుకురావడం ఖాయం

307

ఏనుగు ఎంత పెద్దగా ఎంత బలంగా ఉంటుందో మన అందరికి తెలిసిందే.దానిని ఎవరైనా ఏమైనా అంటే ఇక వాళ్ళ సంగతి అంతే.దాని ఆకారాన్ని చూసి ఎవరైనా భయపడాల్సిందే.అలాంటి ఒక భారీ ఏనుగును ఒక సముద్ర అల భయపెట్టింది.భయపెట్టడమే కాదు దానితో పాటు సముద్రంలోకి లాక్కెళ్ళింది.సముద్ర అలలకు ఎంతటి ప్రాణి అయినా బలవ్వాల్సిందే అని తెలిపే ఘటన ఇది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for elephants in water

సాధారణంగా ఏనుగులు అడవులకు సమీపంలో లోతు తక్కువగా ఉన్ననదుల్లో సేద తీరుతుంటాయి. కానీ సేద తీరుదామని సముద్ర తీరానికొచ్చిందో గజరాజు. అంతలోనే రాకాసి అల ఒకటి ఆ ఏనుగును సముద్రంలోకి లాక్కుని వెళ్లింది. క్షణాల్లోనే ఆ ఏనుగు నడిసంద్రంలోకి కొట్టుకుపోయింది.ఈస్ట్రన్‌ నావల్‌ కమాండ్‌కు చెందిన నావికా సిబ్బంది రోజు వారి చర్యలో భాగంగా హిందూ మహాసముద్రంలోని తమ తీర రేఖ వెంబడి గస్తీకి వెళుతుండగా కోకిలాయ్‌లోని కొక్కుతుడువాయ్‌ అనే ప్రాంతంలో ఒక పెద్ద అల ఓ ఏనుగును నడిసంద్రంలోకి ఎత్తుకెళుతుండటం గమనించారు. సేద తీరేందుకు వచ్చిన అల్లియా పుల్మోద్దాయ్‌ అనే ఏనుగు సముద్రంలోకి దిగింది.అదే సమయంలో భారీ అల వచ్చి ఈడ్చుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో అటుగా వచ్చిన నేవి సిబ్బంది దీనిని గమనించి స్పందించి అత్యవసర విభాగానికి చెందిన సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వెంటనే ప్రత్యేక స్మిమ్మింగ్‌ సూట్‌లు ధరించి సముద్రంలోకి దిగిన వారు ఏనుగు మెడకు, నడుము భాగానికి తాడును తగిలించి తమ నౌక సహాయంతో ఒడ్డుకు చేర్చారు.నడిసంద్రంలో మునిగిపోతున్న ఏనుగును దాదాపు పన్నెండు గంటలు కష్ట పడి బయటకు లాక్కొచ్చారు.బయటకు తీసుకొచ్చి అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. సైన్యం చేసిన ఈ పనికి పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు.కాబట్టి మీరు కూడా సముద్రం దగ్గర ఆటలు ఆడుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి.ఏనుగునే లాక్కెళ్ళింది అంటే మీరు ఒక లెక్కన చెప్పండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సముద్ర అలల దాటికి కొట్టుకుపోయిన ఈ ఏనుగు గురించి అలాగే సముద్రం దగ్గరకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాకు కామెంట్ రూపంలో రాసి అందరికి తెలిసేలా చెయ్యండి.