50 సంవత్సరాలుగా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం తెలుసా?

1146

పురాణాల్లో మునులు, మహర్షులు ఎవరికి ఎక్కడ ఏ విధంగా శాపాలు ఇస్తారో మళ్ళీ దానికి ఎప్పుడు శాపవిమోచనం ప్రసాదిస్తారో అంతుచిక్కని ప్రశ్నలు…ఏదైతేనేం ఏ రాక్షసుడో వారికి కోపం తెప్పించేల, అలాగే వారి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల శాపాన్ని పొందుతుంటారు కొంతమంది..ఇక విషయానికి వస్తే….ఒకానొక గ్రామలో శతాబ్దాల తరబడి ఒక శాపాన్ని అనుభావిస్తున్నారట….ఇక పూర్తి వివరాలలోకి వెళితే…..

ఈ క్రింది వీడియో చూడండి.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ కి 70కిమీ ల దూరంలో ఈ గ్రామంవుంది. ఇక్కడి గ్రామంలో కేవలం పెద్దవారు, వృద్ధులుమాత్రమే వుంటారు.పిల్లలుఅనేవారు ఒక్కరుకూడా కనిపించరు. ఇక్కడి గ్రామస్థులనమ్మకం ఏంటంటే వారి గ్రామంలో పిల్లలు పుడితే వారు బ్రతకరని వెంటనే తొందరగా చనిపోతారనే అభిప్రాయం గట్టిగా పాతుకునివుంది…

Image result for srikrishna temple

వారి నమ్మకం ప్రకారం అక్కడి పిల్లలు ఒకవేళ పుడితే వికలాంగులుగానే పుడతారని చెపుతుంటారు. గ్రామం యొక్క చరిత్ర స్థానికులకధనం ప్రకారం ఇక్కడ శ్రీకృష్ణుడిగుడి ఒకటి వుండేది. గ్రామంలోని పవిత్రతను నిలిపివుంచటానికి పూజారి గ్రామంలోనే పురుడుపోసుకోవాలని సూచించారట.

Image result for mysore raju vadayar

ఇక అప్పటినుంచి అదే సాంప్రదాయంకొనసాగుతూంది. ఇక్కడ గ్రామపెద్ద వయస్సు 50యేళ్లకి పైమాటే. ఆయన మాట్లాడుతూ గత వందల యేళ్లనుంచి ఇక్కడ పిల్లలు పుట్టడాన్ని కనీవినీఎరగలేదని చెప్పారు. అయితే చాలాయేళ్ల తర్వాత గ్రామస్థులు కొందరు చదువుకున్న వారు ఈ సాంప్రదాయం మార్చటానికి సానుకూలంగా వున్నారు.అందుకని వారు ఒక డెలివరీ కోసం ఒక పురుటిగదిని నిర్మించారు.అందులో స్త్రీలు సురక్షితంగా పిల్లలను కనవచ్చని నిర్ణయించుకున్నారు…అలా వారి శాపాన్ని వారే విమోచనం చేసుకునన్నారు…

Image result for mysore raju vadayar

ఇక ఇది ఇలా ఉంటె సరిగ్గా ఇలాంటి శాపమే మైసూర్ రాజ కుటుంబమైన వడయార్స్‌కు ఉంది…ఇటీవలే 400 ఏళ్ల కిందటి శాపం నుంచి విముక్తి లభించింది. ఆ కుటుంబానికి ఇప్పుడు వారసుడు వచ్చాడు. యదువీర్ క్రిష్ణదత్త చామరాజ వడయార్, ఆయన భార్య త్రిషికా కుమారి దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. గతేడాది జూన్‌లో వీళ్ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. యదువీర్‌ను ఇంతకుముందు రాని ప్రమోదా దేవి రెండేళ్ల కిందట దత్తతకు తీసుకున్నది.

ప్రమోదా దేవి, ఆమె భర్త శ్రీకాంతదత్త నరసింహరాజాకు పిల్లలు లేరు. 1612 నుంచి ఈ రాజ కుటుంబం ఓ శాపాన్ని అనుభవిస్తున్నట్లు చెబుతారు. వీళ్లకు ఇప్పటివరకు సొంత వారసులు లేరు. 1612లో వడయార్స్ రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో అప్పటి శ్రీరంగపట్నం రాజు భార్య ఆలెమాలెమ్మ ఈ కుటుంబాన్ని శపించిందని అంటారు. రాజవంశానికి చెందిన నగలతో ఆమె కావేరీ తీరంలోని తలక్కాడ్ అనే ఊరికి పారిపోతున్న సమయంలో.. రాజా వడయార్‌కు చెందిన సైనికులు ఆమెను చుట్టుముట్టారు.

దీంతో ఆమె కావేరీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమయంలోనే వడయార్ల కుటుంబానికి ఎప్పుడూ వారసులు పుట్టరంటూ శపించింది. ఆమె శపించినట్లే ఈ నాలుగు వందల ఏళ్లలో వడయార్లకు వారసులు పుట్టలేదు. సమీప బంధువులను దత్తతకు తీసుకుంటూ రాజ్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇన్నేళ్లుగా ఆలెమాలెమ్మ అనుగ్రహం పొందడానికి ఈ రాజ కుటుంబం ప్రయత్నిస్తూనే ఉన్నది.

Image result for kaveri river

అప్పట్లోనే రాజా వడయార్ మైసూర్‌లో ఆమె విగ్రహం కూడా ఏర్పాటుచేశారు. కొన్నేళ్ల కిందట అప్పటి రాజు శ్రీకాంతదత్త.. తలక్కాడ్‌లో ఆమెకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మొత్తానికి ఇన్నేళ్లకు వారసుని జననంతో తమకు శాప విముక్తి కలిగిందని మైసూర్ రాజ కుటుంబం భావిస్తున్నది. అదండీ సంగతి మరి ఇలాంటి విచిత్ర శాపాలు ఇంకా ఎని ఉన్నాయో….