ప్ర‌తీ త‌ల్లిదండ్రులు త‌ప్ప‌క‌చూడాల్సిన వీడియో లేక‌పోతే చాలా న‌ష్ట‌పోతారు

376

ఇటీవ‌ల కొంద‌రు మ‌నుషులు త‌న‌లోని జంతు ప్ర‌వృత్తిని మాత్రం వ‌ద‌ల్లేక‌పోతున్నాడు. క్రూర మృగాలు సైతం త‌న సొంత జాతిని చంపేందుకు సిద్ధ‌ప‌డ‌వు. అలాంటిది మ‌నుష్యులు మాత్రం అత్యంత అమానుషంగా, క‌ర్క‌శంగా త‌న తోటి వారి ప్రాణాల‌ను తీస్తున్నారు. హ‌త్య‌లు, అత్యాచారాలు చేస్తూ ఈ భూప్ర‌పంచంలో తానే అత్యంత ప్ర‌మాద‌క‌రమైన జంతువున‌ని ప‌దే ప‌దే రుజువు చేస్తున్నాడు. అన్నింటికంటే కంటే ఘోరం ఏంటంటే ఇటీవ‌లి కాలంలో చిన్న పిల్ల‌ల‌పై అకృత్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. కొంద‌రు మాన‌సిక ఉన్మాదులు ముక్కుపచ్చలారని చిన్నారుల‌పై శారీర‌క‌, లైంగిక దాడులు చేయ‌డం చూస్తుంటే మ‌నం ఎటువంటి స‌మాజంలో జీవిస్తున్నాం అన్న అనుమానం క‌లుగుక‌మాన‌దు.

Image result for childerns

తాజాగా హ‌రియాణాలోని ర్యాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో జ‌రిగిన ఏడేళ్ల చిన్న పిల్ల‌వాడి హ‌త్య మాన‌వతావాదుల గుండెల్ని పిండేసింది. స్కూల్ బాత్రూమ్ లో ఆ చిన్న పిల్ల‌వాడ్ని క‌ర్క‌శంగా గొంతు కోసి హ‌త‌మార్చారు. ఆ స్కూల్ లో ప‌నిచేసే ఓ బ‌స్ కండ‌క్ట‌ర్ లైంగిక దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్టు పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లోనే ఒక పిల్ల‌వాడికి ర‌క్ష‌ణ లేన‌ప్పుడు బ‌య‌ట స‌మాజంలో ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు.

Image result for childerns

గుర్గావ్ లో ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య కలకలం రేపుతోంది. ఇక్క‌డ జ‌రిగిన ఘ‌ట‌న‌తో స్కూలుకు వెళ్లాలంటేనే పిల్లలు భయపడుతున్నారు.గుర్గావ్ లో ఎవ‌రూ ఊహించ‌ని దారుణం జరిగింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని.. స్కూల్ బస్ లో పనిచేసే వ్యక్తి చంపేశాడు. స్కూల్ లో టాయిలెట్ కు వెళ్లిన బాలుడిపై నిందితుడు అశోక్ లైంగికదాడి ప్రయత్నించాడు. బాలుడు అడ్డుకుని అరిచాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో నిందితుడు బాలుడిని కొట్టి కత్తితో గొంతుకోశాడు. సోహ్నా ప్రాంతంలో ఉన్న ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈ దారుణం జరిగింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు.. గంటలోపే నిందితుడు అశోక్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు ఎనిమిది నెలలుగా స్కూల్ లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. మరోవైపు.. స్కూల్ దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. భారీగా బలగాలను మోహరించారు. స్కూల్ మేనేజ్ మెంట్ మాత్రం ఈ ఘటనలో తమ తప్పేం లేదని చెబుతోంది. స్కూల్ లోకి కత్తి ఎలా వచ్చిందనే దానిమీద ఎంక్వైరీ చేస్తున్నారు.రోజూలా అక్క‌తో వ‌చ్చిన త‌మ్ముడ్ని టాయిలెట్ లోకి వెళ్ల‌డం చూసిన బ‌స్ డ్రైవ‌ర్ అత‌నిపై లైంగిక దాడి చేసి చంపేశాడు, ఇదంతా సీసీ టీవీలో రికార్డు అవ్వ‌డంతో గంట‌లోనే ఈ దుర్మార్గ రాక్ష‌సుడు పోలీసుల‌కు చిక్కాడు, చూశారుగా మాన‌వ‌త్వం నుంచి రాక్ష‌స‌త్వంగా కొంద‌రు ఎలా మారుతున్నారో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి. ఇలాంటి వారికి ఎటువంటి శిక్ష విధించాలో కూడా తెలియ‌చేయండి.