ఇద్దరు సెక్స్ మార్పిడి చేయించుకొని పెళ్లి చేసుకున్నారు.. తర్వాత జరిగింది తెలిస్తే షాక్

467

సమాజంలో చాలా మంది కన్నవాళ్లను సమాజాన్ని ఎదురించి పెళ్లి చేసుకున్న వారిని చూసాం.ఒక ఆడ ఒక మగ పెళ్లి చేసుకుంటారని మన అందరికి తెలిసిందే. అయితే నేను మీకు చెప్పబోయే ఒక జంట మాత్రం కొంచెం వెరైటీ.సమాజాన్ని ఎదిరించిన జంట ఇది.ఇలాంటి ఘటనలు ప్రపంచంలోనే అరుదుగా జరుగుతుంటాయి.సెక్స్ మార్పిడి చూపించుకుని తమ జీవితాన్ని కొనసాగించిన వారిని ఎంతోమందిని చూసాం.కానీ ఇక్కడ మాత్రం ఆమె అతడు ఇద్దరు సెక్స్ మార్పిడి చేపించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు.మరి ఆ వింత జంట గురించి పూర్తీగా తెలుసుకుందామా..

1988లో తమిళనాడులో కళ్యాణి పురంలో ప్రీతిషా అనే ఒక అబ్బాయి జన్మించాడు.పుట్టుకతో అతను అబ్బాయి.అయినా అతను అమ్మాయి అనే ఫీలింగ్ అతనికి ఉండేదంట.అమ్మాయిలాగే జీవించాలి అని అనుకున్నాడు ఇతను.17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సెక్స్ మార్పిడి చూపించుకుని ప్రీతిషా అని పేరు మార్చుకున్నాడు.స్కూల్ కు వెళ్లే సమయంలో స్టేజ్ డ్రామాలు చెయ్యాలని ఏంతో ఆశగా ఉండేది.అలా స్కూల్ డేస్ లో కొన్ని డ్రామాలు కూడా వేసేది.అదే ఆమె వృత్తి అయింది ఇప్పుడు.ఇప్పుడు ఆమె ఒక ప్రొపెషనల్ డ్రోమెటిక్.2005 లో పాండిచ్చేరిలోని బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సుధా అనే ఒక ట్రాన్స్ జెండర్ ను కలిసింది.ఆ తర్వాత తమిళనాడుకు చెందిన పలువులు ట్రాన్స్ జెండర్స్ గురించి తెలుసుకుంది.

Image result for transgender

వాళ్ళందరూ మహారాష్ట్రలో ఒక రూమ్ ను అద్దెకు తీసుకుని ఉంటున్నట్టు తెలుసుకుంది.అయితే ఆ ట్రాన్స్ జెండర్స్ లలో చాలా మంది అవసరాల కోసం వ్యభిచారం చేస్తున్నారని తెలుసుకుంది.ఆ పనులు చెయ్యడం ఇష్టం లేని ఆమె ట్రైన్ లలో కీ చైన్స్ మొబైల్ పౌచెస్ అమ్మడం మొదలు పెట్టింది.చాలా మంది ఆమెను వాటిని అమ్మడం మానేయాలని సూచించారు.అయినా ఆమె ఆపలేదు.అయితే కొన్ని రోజులకు రైళ్లలో ఇలాంటివి అమ్మడం నిషేదించారు పోలీసులు.అందువల్ల ఆమె ఒక చిన్న బండి కొట్టు పెట్టుకుంది.రోజుకు 200 నుంచి 300 వరకు సంపాదించేది.17 ఏళ్ల వయసులో ఈ పనులతో వచ్చినా డబ్బులతో లింగమార్పిడి చేపించుకుంది.అయితే 1991 లో ఇక్కడే జన్మించిన ప్రేమ్ కుమారి అమ్మాయి.కానీ తాను మగవాడినని ఎప్పుడు అనుకునేదంట.

అమ్మాయిలాగా జీవించలేకపోయింది. అందుకే సెక్స్ మార్పిడి చేసుకుని అబ్బాయిలాగా మారింది.ప్రేమ్ కుమార్ అని పేరు మార్చుకున్నాడు.తర్వాత వీరిద్దరూ పేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు.సమాజంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను ఒకరికి ఒకరు షేర్ చేసుకున్నారు.దాంతో ఇద్దరి మనుసులు కలిశాయి.ఆ తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.2018 మర్చి 21 న పెళ్లి చేసుకున్నారు.ఇదే ప్రేమ్ కుమార్ ప్రీతిషాల వింత కథ.మరి ఈ ఈ విషయం గురించి మీరేమంటారు.ట్రాన్స్ జెండర్స్ గా పుట్టినా సరే ఎక్కడ ఎవరికీ తలొగ్గకుండా తప్పు చెయ్యకుండా బతికిన వీళ్ళ గురించి అలాగే వీరు పెళ్లి చేసుకున్న విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.