భారత్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన ట్రంప్.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు ఊహించని భారత్

321

భారత వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని చెప్పి కొన్ని గంటలు గడవక ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు వస్తువులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.. కానీ ఇప్పుడు భారత్‌కు ప్రాధాన్యత హోదాను తొలగించే యోచనలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి సుంకాలు లేకుండా భారత్ కొన్ని వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేదే.. రాబోయే రోజుల్లో భారత్‌కు అలాంటి సౌలభ్యం ఉండదని ట్రంప్ తేల్చేశారు. అంతేకాక భారత్‌కు ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను కూడా తొలగించాలని ట్రంప్ ప్రకటించారు. పన్నుల్లేకుండా భారత ఉత్పత్తులు అమెరికాలోకి రావడాన్ని అడ్డుకుంటానని ట్రంప్‌ తెలిపారు. ఈ విషయంపై యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులకు ట్రంప్‌ లేఖ ద్వారా తెలియజేశారు. ట్రంప్ చర్య వల్ల భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ట్రంప్‌ ఆరోపణలపై భారత్ కూడా స్పందించింది.

ఈ క్రింది వీడియో చూడండి 

భారత్‌ డబ్ల్యూటీవో మార్గదర్శకాలకు అనుగుణంగానే దిగుమతి సుంకాలు ఉన్నాయని భారత్ తెలుపుతోంది.ట్రంప్ లేఖలో పేర్కొన్న అంశం ఇదే.. ‘అమెరికా మార్కెట్లలో భారత్‌కు కొన్ని వెసులుబాట్లు కల్పించాం. అదే విదంగా భారత మార్కెట్లలోనూ అమెరికాకు అలాంటి సదుపాయాలు కల్పించాలని కోరాం.. కానీ భారత్‌ దానిపై ఖచ్చితమైన హామీ ఇవ్వలేదు. ఈ కారణం వల్లే భారత్‌కు ప్రాధాన్యత వాణిజ్య హోదాను తొలగించాలని అనుకుంటున్నా’ అని యూఎస్‌ కాంగ్రెస్‌కు రాసిన లేఖ ద్వార తెలిపారు. ఇదే జరిగితే ఇక నుంచి భారత్‌ నుంచి ఎగుమతి చేసే అన్ని వస్తువులపై అమెరికా సుంకాలు విధిస్తుంది. దీని వల్ల దేశానికి భారీ నష్టం చేకూరే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.భారత్‌తో పాటు టర్కీకి కూడా ఈ హోదాను ఉపసంహరించుకోవాలని ట్రంప్‌ భావిస్తున్నారు.అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అధికారి ఒకరు దీనిపై స్పందిస్తూ.. ట్రంప్ నిర్ణయం సాధారణ ప్రాధాన్యతా వ్యవస్థ (GSP-Generalized System of Preferences)లో ఇప్పటికిప్పుడు భారత్‌పై ప్రభావం చూపించదన్నారు. అమెరికన్ కాంగ్రెస్, భారత్ ప్రభుత్వాలకు నోటిఫికేషన్ జారీ చేసిన 60 రోజుల తర్వాతే దాని ప్రభావం ఉంటుందన్నారు.

Image result for trump

అధ్యక్షుడి అధికారిక ప్రకటనతోనే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపారు.ఈ-కామర్స్ విధి విధానాలకు సంబంధించి భారత్ కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురావడం వల్ల భారత్‌లో అమెరికా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. కొత్త నిబంధనల్లో భాగంగా భారత్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వ్యాపారాలపై నియంత్రణ మొదలైంది. అమెరికాలో భారత్ మార్కెట్‌కు సానుకూల అవకాశాలు కల్పిస్తున్నా.. భారత్‌లో తమ మార్కెట్‌కు ప్రాధాన్యత లేకుండా పోయిందని అమెరికా అసంతృప్తితో ఉంది. 2017లో ఇండియాతో తమ దేశ వాణిజ్య లోటు 27.3 బిలియన్ డాలర్లుగా ఉందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్యపరంగా అమెరికాలో భారత్ ప్రాధాన్యత హోదాను తొలగించాలని ట్రంప్ నిర్ణయించారు. కాగా, సాధారణ ప్రాధాన్యతా వ్యవస్థలో భారత్ అతిపెద్ద లబ్దిదారుగా కొనసాగుతోంది. అయితే 2017లో అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్న చర్యల కారణంగా భారత్ భాగస్వామ్యం అంతంతమాత్రంగా మారింది.మరి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమంటారు. దీని వలన భారత్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.