బెంగుళూరు అమ్మాయిలు పక్కలోకి రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు: టాప్ సీరియల్ నటి సంచలన వ్యాఖ్యలు

387

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది అందరికి తెలుసు. అవకాశాలు రావాలంటే పడక సుఖం ఇవ్వాల్సిందే అని చాలా మంది నటీమణులు ఇప్పటికే చెప్పుకొచ్చారు. అయితే వెండితెర మీదనే కాదు బుల్లితెర మీద కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఉంది. ఇప్పటికే చాలా మంది బయటపడగా ఇప్పుడు మరొక నటి ఈ విషయాలను తెలిపారు. గుండమ్మకథ, పుసుపు కుంకుమ, శ్రావణ సమీరాలు లాంటి సీరియల్స్ చేసిన టీవీ నటి చరిష్మా తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ మధ్య కాలంలో తెలుగు సీరియల్స్‌లో కూడా బెంగుళూరు వారిని ఎక్కువగా తీసుకుంటున్నారు. తెలుగు వారిని తక్కువగా తీసుకుంటున్నారు. ఆ విషయంలో చాలా బాధ ఉంది. తెలుగు వారికి క్యారెక్టర్లు ఇస్తున్నారు కానీ మెయిన్ లీడ్ ఇవ్వడం లేదు. అక్క, చెల్లి, ఫ్రెండ్ పాత్రలు మాత్రమే ఇస్తున్నారు. ఒకటి రెండు సీరియల్స్‌లో మాత్రమే తెలుగు వారు చేస్తున్నారు. అందరూ బెంగుళూరు వారే ఉన్నారు.బెంగుళూరు వారిని తీసుకోవడానికి కారణం వారు పక్కలోకి రమ్మంటే వస్తారు… పొమ్మంటే పోతారు. తెలుగు అమ్మాయిలు ఇలాంటివి చేయడానికి ఆలోచిస్తారు. బెంగుళూరి వారి ఫ్యామిలీస్ అక్కడ ఉంటాయి కాబట్టి వారు పెద్దగా ఆలోచించరు. కమిట్మెంట్ ఇచ్చేస్తారు.. బెంగుళూరు వాళ్లు ఇలా చేస్తారని చాలా మంది అనుకుంటుండగా విన్నాను.. కానీ నా కళ్లతో చూడలేదని ఆమె స్పష్టం చేశారు.

Image result for చరిష్మా

తెలుగు వారు ఇలాంటి కమిట్మెంట్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. అలా చేస్తే మన ద్వారా కాకపోయినా పక్కవారి ద్వారా తెలిసినా మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? నా కూతురు ఇలా చేసిందా? నా కూతురు ఇలా అయితేనే వెళుతుందా? అని బాధపడతారు, అందుకే తెలుగు వారు కమిట్మెంట్లకు దూరంగా ఉంటారు.తాను సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఫేస్ చేశాను. సీరియల్ ఇండస్ట్రీలో ఎవరి నుంచి అలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. సినిమా ఇండస్ట్రీలో కోఆర్డినేటర్లు, మేనేజర్ల కమిట్మెంట్స్ అడిగేవారు. ఇచ్చిన వారినే పెట్టుకోండి అని నేను ఆ అవకాశాలను వదులుకునేదానిని. ఇలాంటి కమిట్మెంట్స్ చిన్న సినిమాల విషయంలో ఎక్కువగా ఎదురయ్యేవి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కొత్తగా ఇండస్ట్రీకి ఏదో సాధిద్దామని వచ్చేస్తారు. కానీ వారు సాధించేది ఏమీ ఉండదు కమిట్మెంట్స్ తప్ప.అందుకే వారు అక్కడే ఉండిపోతారు.మెహర్ అనే రైటర్ ద్వారా నేను ఇండస్ట్రీకి వచ్చాను. వారి ద్వారా ఒక సీరియల్‌లో అవకాశం లభించింది. కమిట్మెంట్‌ను నమ్ముకోకుండా నా సొంత టాలెంటుతో ఈ స్థాయికి ఎదిగాను అని చరిష్మా చెప్పుకొచ్చారు.అయితే చరిష్మా చేసిన ఈ వ్యాఖ్యల మీద ఏ ఒక్క బెంగుళూర్ భామ ఇంతవరకు నోరు మెదపలేదు.చూడాలి మరి ఎవరైనా స్పందిస్తారో లేదో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. నటి చరిష్మా చేసిన ఈ వ్యాఖ్యల గురించి అలాగే ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.