అమృత తండ్రికి ఉరిశిక్ష.. సుప్రీం కోర్ట్ సంచలన నిర్ణయం

529

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని అతి కిరాతకంగా చంపించిన మిర్యాలగూడ ఘటన గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడంటే ఇష్టం లేని మారుతీరావు కిరాయి గుండా చేత చంపించాడు.నిన్న ప్రణయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.మారుతీరావు ను అరెస్ట్ చేశారు.చంపినా వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.అయితే ఇప్పుడు వీరికి ఎలాంటి శిక్ష పడబోతోంది.కోర్ట్ ఈ కేసు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for pranay and amrutha

పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అత్యంత హేయమైన, అనాగరికమైన ఈ చర్యలను సమూలంగా నిర్మూలించాలని పేర్కొంది. ‘‘మా అభిప్రాయంలో కారణమేదైనా పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలి. ఇలాంటి కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేయాల్సిందే’’ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఢిల్లీకి చెందిన భగవాన్‌దాస్‌ తన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా మేనమామ కొడుకును పెళ్లి చేసుకొని పరువు తీసిందన్న కోపంతో ఆమెను హతమార్చాడు. ఆ కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పరువు హత్యలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘తమ కొడుకు/కూతురు ప్రవర్తన వల్ల పరువు పోయిందని చాలా మంది భావిస్తుంటారు.తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె/అతడు ఇతర కులస్థులను పెళ్లి చేసుకోవడం లేదా సంబంధాలు పెట్టుకోవడాన్ని అవమానంగా పరిగణిస్తారు.

Image result for pranay and amruthaచట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చంపేయడం, భౌతిక దాడులకు పాల్పడడం చేస్తుంటారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. తమ కుమార్తె లేదా ఇతర వ్యక్తి ప్రవర్తన వల్ల అసంతృప్తిగా ఉంటే అతను/ఆమెతో సామాజిక సంబంధాలను తెంచేసుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. హింసాత్మక చర్యలకు పాల్పడకూడదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఢిల్లీలో షియా వర్గానికి చెందిన యువతి సున్నీ వర్గానికి చెందిన యువకుడిని పెళ్లాడింది. దీంతో యువతి సోదరులు.. ఆ యువకుడి తమ్ముడ్ని హత్య చేశారు. 2008లో జరిగిన ఈ హత్య కేసును విచారించిన ఢిల్లీ కోర్టు దీన్ని అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. యువతి కుటుంబ సభ్యులు ఐదుగురికీ 2011లో ఉరిశిక్ష విధించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అన్ని విచారణ కోర్టులు, హైకోర్టులు పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగానే పరిగణించాలని, దోషులకు ఉరిశిక్ష విధించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు దేశంలోని అన్ని కోర్టులకు ఉత్తర్వులిచ్చింది.ఇప్పుడు ఇదే శిక్ష ప్రణయ్ ను చంపినా వ్యక్తులకు చంపించిన అమృత తండ్రి మారుతీరావు కూడా అలాగే ఈ కేసుకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి పడనుంది.ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడం వీరి వల్ల కాదు ఇప్పుడు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ పరువు హత్య గురించి అలాగే ఆ హత్యకు పాల్పడిన వారికి వేసే శిక్ష గురించి అన్ని కోర్ట్ లకు సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.