హైదరాబాద్ లో బాలిక హత్య..ఆటోలో దొరికిన వాటిని చూసి తలలు పట్టుకుంటున్న పోలీసులు.!

512

సమాజంలో రోజురోజుకు స్త్రీ ని ఒక వస్తువులాగా చూస్తున్నారు.ఎవరికిష్టం వచ్చినట్టు వారు వాడుకుంటున్నారు.అత్యాచారం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చాలా దారుణంగా వారి మీద పడి వారి జీవితం ముగిసిపోయేటట్టు చేస్తున్నారు.మనం ఇప్పటికే ఎంతో మంది అభాగ్యులను చూశాం.ఇప్పుడు మరొక అభాగ్యురాలి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.చిన్న పిల్ల అని కూడా చూడకుండా అతి దారుణంగా చంపేశారు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

బాలాపూర్‌ మండలం, అల్మాస్ గూడలోని రాజీవ్‌ గృహకల్పలో నివసిస్తున్న ప్రభు, అనసూయకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి వివాహం కాగా, చిన్నమ్మాయి వైష్ణవి(14) జిల్లెలగూడలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తండ్రి ప్రభు మద్యానికి బానిసై ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. తల్లి అనసూయ జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. విద్యార్థిని వాకింగ్‌కు వెళ్లింది. ఎంతసేపైనా తిరిగి రాలేదు. కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చర్చి సమీపంలో ఖాళీ స్థలంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న వైష్ణవి కుటుంబసభ్యులు అక్కడికెళ్లి చనిపోయింది మా అమ్మాయేనని గుర్తించి బోరున విలపించారు.

వైష్ణవిది హత్యా.. ఆత్మహత్యా? అనే కోణంలో మీర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి యత్నించి చంపేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం తడిసి ఉండడంతో నీళ్లలో ముంచి ఆ తర్వాత అక్కడ పడేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. రాత్రి వర్షపు జల్లులు పడినందున తడిసి ఉంటుందని, నీళ్లలో ముంచి చంపిన వారు మళ్లీ ఇంత దూరం ఎందుకు తీసుకొస్తారని పోలీసులు పేర్కొంటున్నారు. వైష్ణవిది చిన్న వయస్సే అయినా పెద్దమ్మాయిలాగా కనిపిస్తుంది. ఆమెకు థైరాయిడ్‌ సమస్య ఉంది. స్కూల్‌కు రెగ్యులర్‌గా వెళ్లదని పోలీసుల విచారణలో తేలింది.జూన్‌ నుంచి ఇప్పటి వరకు కేవలం 12 రోజులు మాత్రమే వెళ్లినట్టు ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించగా సమీపంలో ఓ ఆటో వద్దకు వెళ్లి ఆగిపోయింది. ఆటో యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆటోలో వెంట్రుకలు లభించడంతో వాటిని ల్యాబ్‌కు పంపించారు. చర్చిలోని సీసీ కెమెరాను పరిశీలించగా తెల్లవారు జామున ఓ కారు అటు వచ్చి వెళ్లినట్లు రికార్డయింది. మృతదేహం ఉన్న వైపు మాత్రం వెళ్లలేదు. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదిక వస్తే స్పష్టత వస్తుందని ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ చెప్పారు.విన్నారుగా చిన్న పిల్లను ఎంత దారుణంగా చంపెశారో.