హిమాలయాల్లో ఉన్న వింత మనిషి

4396

హిమాలయాలు ఇండియాకు పెట్టని కోట లాంటిది. శత్రువుల నుంచి భారతదేసాన్ని కాపాడుతున్న పర్వతాలు అవి. అయితే, ఈ పర్వతాల గురించి ఎన్నో కథలు కథనాలు ఉన్నాయి. ఈ పర్వతాలలో శివుడు తపస్సు చేసుకుంటాడని, శివపార్వతులు కైలాస పర్వతంపైనే ఉంటారని అంటుంటారు. ఇక ఇదిలా ఉంటె, ఇటీవల కాలంలో ఓ వార్తా అందర్నీ భయబ్రాంతులకు గురి చేస్తున్నది. అదేంటో ఇప్పుడు చూద్దాం

ఈ క్రింది వీడియో చూడండి.

హిమాలయాల్లో ఒంటిమీద దట్టమైన వెంట్రుకలు, వికృతమైన ముఖంతో ఉన్న మనిషి తిరుగుతున్నాడని కథనాలు వస్తున్నాయి. అతను మనిషి ఆకారంలో ఉన్న యతి అనే భయంకరమైన రాక్షసుడని.. చేతిలో రాయి వంటి ఆయుధం పట్టుకొని తిరుగుతున్నాడని అంటున్నారు. తెల్లండి దట్టమైన ఈ యతి మీకు ఎప్పుడైనా కనిపించాడా.. మిమ్మల్ని ఆ యతి చూశాడా. ఇక అంతే సంగతులు మిమ్మల్ని చంపి తినేస్తాడు. అంతేకాదు, ఆ యతి అతని కోరికలు కూడా తీర్చుకుంటాడట. బాప్ రే ఇది నిజమా అని ఆశ్చర్యపోకండి. ముమ్మాటికి ఇది నిజం.
హిమాలయా ప్రాంతంలో నివసించే చాలా మంది ప్రజలకు ఈ యతి కనిపించినట్టు చెప్తుంటారు. ఆ ప్రాంతంలో నివసించిన వారికే కాదు.. టూరిస్టులకు కూడా యతి కనిపించినట్టు పేర్కొంటున్నారు. 1921లో బ్రిటీష్ మౌంట్ ఎవరెస్ట్ రికగ్నిషన్ ఆఫ్ ఎక్ష్పెడిషన్స్ అనే సంస్థ కొంత మంది టీంతో ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి అనువైన మార్గాలు, అక్కడి వింతలు, విశేషాల గురించి రిసర్చ్ చేయడానికి వెళ్ళారు. అలా రీసెర్చ్ చేస్తుండగా, వీరికి లఖ్ ఫలా అనే కొండ మీద పెద్ద పెద్ద పాద ముద్రలు కనిపించాయట. వాటిని చూసి ఏ మంచు ఎలుగుబంటి లాంటి జంతువు పాదముద్రలో అనుకున్నారు. మంచు కరగడం వలన ఆ పాదముద్రలు వ్యాకోచించి పెద్దవిగా కనిపిస్తున్నాయి అనుకున్నారు. కాని, వీరి పరిశోధనలో అనేక నిఘూడమైన నిజాలు బయటకు వచ్చాయి. అవి ఎలుకబంటి పాదముద్రలు కాదని, స్నో మెన్ అనే మనిషికి చెందిన పాదముద్రలు అని వారు తేల్చారు.

Related image

1925లో ఎన్ ఎ టోమ్బాజీ అనే గ్రీకు ఫోటోగ్రాఫర్ జమ్మూ గ్లేజియర్ లో ఒక వింత ఆకారం గల మనిషి కనిపించాడని తన డైరీ లో రాసుకున్నాడు. దానిని 200నుంచి ౩౦౦ గజాల దూరంలో తన బైనాక్యులర్స్ సహాయంతో చూశానని, అది చూడటానికి వింతగా చాలా పెద్దదిగా ఉండి, మెల్లమెల్లగా నడుస్తూ ఉందని తన డైరీలో రాసుకున్నాడు ఎన్ ఎ టోమ్బాజీ. 2011లో రష్యా సైనికుల నుంచి సామాన్యమనుష్యుల వరకు వింత ఆకారం కలిగిన యతిని చూసాం అని చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, యతికి సంబంధించిన వెంట్రుకలు కొన్ని వాటి పాదముద్రలు ఉన్న ప్రాంతంలో దొరికాయి.

Image result for himalaya yathi

వాటిని తీసుకొచ్చి ప్రయోగాలు చేసారు. ఈ ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగు చూశాయి. 2013 లో చేసిన ప్రయోగం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆక్స్ ఫర్డ్, లాజైన్ విశ్వవిద్యాలయాలు ఈ యతి వెంట్రుకలపై పరిశోధనలు చేశాయి. ఆ వింత ఆకారం యతి అని ఆ రెండు విశ్వవిద్యాలయాల పరిశోధనలో తేలింది. ఇక, నార్వేలోని స్వాల్ బర్డ్ అనే సిటీ దగ్గరలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఎలుగుబంటి దవడ ఎముక ఒకటి బయటపడింది.

Related image

దానికి డిఎన్ఏ టెస్ట్ చేయగా ఆ దవడ ఎముక 40 వేల నుంచి లక్షా ఇరవై వేల సంవత్సరాల ముందు నాటిది అని తేలింది. ఇండియాలోని లడక్ ప్రాంతంలో దొరికిన హెయిర్ డిఎన్ఏ కు, నార్వే తవ్వకాల్లో బయటపడ్డ ఎలుగుబంటి దవడ ఎకుక డిఎన్ఏ తో మ్యాచ్ అయింది. పోలార్ ఎలుగుబంటి కి చెందిన కొన్ని జాతులు కాలక్రమేనా పరిణామం చెంది యతిగా మారి ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే కొంతామంది మాత్రం ఆ వెంట్రుకలు ఎలుగుబంటివేనని, యతివి కాదని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ యతి అనే వింత ఆకారం కలిగిన మనిషికి చెందిన మిస్టరి ఇంకా అలాగే ఉండిపోయింది.