46 ల‌క్ష‌ల రూపాయ‌లు పంచిపెట్టేసిన స్కూల్ విద్యార్ది కార‌ణం తెలిస్తే షాక్

506

ఇంట్లో త‌ల్లిదండ్రులు చాలా మంది పిల్ల‌లకు డ‌బ్బులు విలువ తెలియ‌కుండా పెంచుతారు …ఇలా పెంచ‌డం వ‌ల్ల వారికి పెరిగే కొల‌ది డ‌బ్బుల విలువ తెలియ‌కుండా లెక్క‌లేని త‌నంగా ఉంటారు… ముఖ్యంగా డ‌బ్బులు విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చుపెట్టేస్తూ ఉంటారు.. కష్టపడి సంపాదిస్తే వాటి విలువ తెలుస్తుంది. కానీ కొంతమంది కోటీశ్వరుల పిల్లలకు ఆ విషయంలో అవగహన లేక కరెన్సీని ఇష్టా రాజ్యంగా వృధా చేస్తుంటారు. ఇటీవల ఒక పాఠశాల విద్యార్థి డబ్బుని ఎలా ఖర్చు చేశాడో తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇటీవల ఫ్రెండ్షిప్ డే సందర్బంగా ఏకంగా 42 లక్షలను తన స్నేహితులకు ఇచ్చేశాడు. విన‌డాకి మీకు ఆశ్చ‌ర్యం క‌లిగినా ఇది నిజం.

Image result for school children images

కొన్ని జల్సాలకు ఖర్చు చేస్తే మరికొన్ని కండిషన్స్ ప్రకారం తోటి విద్యార్థులకు కూలీ లెక్కన ఇవ్వడం ఇక్క‌డ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం.. ఒక విద్యార్థి అయితే ఏకంగా అతను ఇచ్చిన డబ్బుతో కారు కొనుగోలు చేశాడు… మ‌రో విద్యార్దికి హోమ్ వర్క్ చేస్తే మూడు లక్షలు ఇచ్చాడట. అలాగే కూలి పని చేసే ఒక వ్యక్తి కుమారుడికి 15 లక్షలు ఇచ్చాడు. ఇక ఇంట్లో వారికి ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్ లోని బల్‌పూర్‌ జిల్లాలో పదవతరగతి విద్యార్థి చేసిన ఈ ఘనకార్యం దేశమంతటా వైరల్ అయ్యింది.

Image result for school children images

స్థానిక బిల్డర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి 60 లక్షల రూపాయలను ఇంట్లో దాచాడు. అయితే ఎవరికీ తెలియకుండా కుమారుడు 46 లక్షల రూపాయలను నొక్కేశాడు. ఆ విషయం తెలియక ఇంట్లో వారు దొంగతనం జరిగిందని పోలీసులకు పిర్యాదు చేయడంతో కుమారుడిపై అనుమానం వ్యక్తం చేసి అరా తీశారు. స్కూల్ లో చాలా మంది విద్యార్థులకు అతను డబ్బు ఇవ్వడం గురించి పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే బాలుడి దగ్గరినుంచి డబ్బు తీసుకున్న విద్యార్థులను విచారించారు.. చివ‌ర‌కు ఆపిల్ల‌ల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇప్పటికి 15 లక్షల వరకు రికవర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక విద్యార్థులు మైనర్లు కావడంతో పోలీస్ కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే పిల్ల‌లు అంత‌పెద్ద‌మొత్తంలో ఇంటికి డ‌బ్బులు తీసుకువ‌స్తే పిల్ల‌ల‌ను ప్ర‌శ్నించ‌లేదా అని, పోలీసులు ఆ పిల్లల త‌ల్లిదండ్రుల్ని ప్ర‌శ్నించారు. చూశారుగా పిల్ల‌లు ఎటువంటి ప‌నులు చేస్తారో.. ఆపిల్లాడి తండ్రి క్యాష్ బీరువాలో పెట్ట‌కుండా ఓ ర్యాక్ లో పెట్ట‌డంతో ఈ పిల్లాడు త‌న స్కూల్ బ్యాగ్ లో డ‌బ్బులు తీసుకుని వెళ్లాడ‌ట‌.. ఈబుడ‌త‌డు చేసిన ప‌నిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.