ఇది బొమ్మ కాదు.. శవం.. దీనిని ఎందుకింత అందంగా తయారుచేశారో దీని వెనుకున్న కథ ఏంటో తెలిస్తే షాక్

190

మీరు ఏదైనా షాపింగ్ మాల్ కు వెళ్తే అక్కడ మీకు షోకేజ్ లలో కొన్ని బొమ్మలు కనపడతాయి. ఆ షాప్ లో ఉన్న మంచి మంచి మోడల్స్ గురించి అందరికి తెలియాలని అలా బొమ్మలను ఉంచి వాటికి డ్రెస్ లు వేసి నిలబెడతారు. మీరు అలాంటి బొమ్మను చూసి ఎప్పుడైనా భయపడ్డారా.. మేమెందుకు భయపడతాం. అయినా షోకేజ్ లో ఉన్న బొమ్మను చూసి ఎవరైనా భయపడతాయని అంటారా.. కానీ ఒకచోట భయపడుతున్నారు. షోకేజ్ లో ఉండే బొమ్మను చూసి అందరు భయపడుతున్నారు. మరి ఆ బొమ్మ వెనుక ఉన్న కథ ఏమిటో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for పస్క్యూలిటా

1930లో ఏర్పాటు చేసిన లా పస్క్యులిటా అనే ఈ బొమ్మను చూసి చాలామంది భయాన్ని వ్యక్తం చేసేవారు. అది చూసేందుకు మనిషిలాగానే ఉండేదని, దాని చేతులు సైతం మనిషి చేతుల్లాగా ఉండేవని తెలిపేవారు. అంతేగాక, ఆమె కళ్లు తమనే చూస్తున్నట్లుగా ఉండేవని, ఒక్కసారి ఆమెను చూస్తే రాత్రంతా ఆమె కళ్లు తమని వెంటాడేవని చెప్పేవారు. ఒక్కోసారి ఆ బొమ్మ ఉన్న స్థానంలో కాకుండా అటూ ఇటూ తిరిగేదని తెలిపేవారు. ఆ దుకాణంలో పనిచేసిన సోనియా బురుసిగ చెప్పిన మాటలు వింటే ఒళ్లు గగూర్పాటు కలుగుతుంది. ‘‘ఆ బొమ్మకు నేను దుస్తులు మార్చేదాన్ని. ఆ బొమ్మ వద్దకు ఎప్పుడు వెళ్లినా నా చేతులు చెమటతో తడిపోయేవి. ఆమె చేతులు నిజమైన చేతుల్లా ఉండేవి. ఆమె కాళ్లపై నరాలు ఉబ్బి ఉండేవి. ఆమె బొమ్మ కాదు, నిజమైన మనిషే అని నేను నమ్మేదాన్ని’’ అని తెలిపింది. అయితే, రూమర్లను దుకాణ యజమాని పస్కులా కొట్టిపడేసేవాడు.. ప్రజలు అనుకున్నట్లు అది తమ కుమార్తె శవం కాదని వెల్లడించాడు.

Image result for పస్క్యూలిటా

వెడ్డింగ్ గౌన్లు విక్రయించే పస్కులా కుమార్తె ఓ రోజు బ్లాక్ విడో అనే సాలీడు కుట్టడంతో చనిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ బొమ్మ ఆ దుకాణంలో ప్రత్యక్షమైంది. ఆ బొమ్మను లా పస్క్యూలిటా అని ముద్దుగా పిలిచేవారు. వధువు వస్త్రాల్లో కనిపించే ఆ బొమ్మను చూసి.. చాలా మంది నిజమైన మనిషే అక్కడ నిలుచుందని భావించేవారు. దీంతో షాపు యజమాని తన కుమార్తె శవాన్ని రసాయనాల్లో ఉంచి బొమ్మగా తయారు చేసి షోకేసులో పెట్టాడని అంతా అనుకొనేవారు. ఆ బొమ్మ చేతి వేళ్లను పరిశీలిస్తే మనిషి తరహాలనే ఉండేవి. వాటిపై చిన్న చిన్న వెంటుకలు కూడా ఉండేవి. ఆ రోజుల్లో వ్యాక్స్ బొమ్మలను తయారు చేసేవారు కూడా ఉండేవారు కాదు. దీంతో అది బొమ్మా? లేదా దుకాణ యజమాని కుమార్తె శవమా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ బొమ్మ ఇప్పటికీ ఆ షాపులోనే ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి

మరి, దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటనేది ఆ దుకాణ యజమానికి, అందులో పనిచేసే వ్యక్తులకు మాత్రమే తెలియాలి. మరి, అనుమానాలు ఉన్నప్పుడు పోలీసులైనా దాన్ని పరిశీలించాలి కదా అనే ప్రశ్నకు కూడా ఎక్కడా బదులు లేదు. అయితే, మెక్సికోలో మాత్రం ‘లా పస్క్యూలిటా’ పేరు వింటే చాలు అంతా ఈ బొమ్మ(?) గురించే చెబుతుంటారు. మరి ఈ బొమ్మ ఫొటోలను చూస్తుంటే మీకేమనిపిస్తోంది?అది బొమ్మనా లేక శవమా..ఈ మొత్తం వ్యవహారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.