దుమ్ముపట్టిన కారులో డబ్బులే డబ్బులు షాకైన పోలీసులు

512

ఈ మ‌ధ్య ఎన్నిక‌ల స‌మ‌యంలో పోలీసులు అనుమానం వ‌చ్చిన ప్ర‌తీ వెహిక‌ల్ సోదాలు చేయ‌డం, అలాగే నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ‌టం చూసే ఉంటాం.ఇక ఎన్నిక‌లు అయిపోయిన త‌ర్వాత కూడా సాధార‌ణ చెకింగ్ లో భాగంగా కొన్ని అనుమానం వ‌చ్చిన వెహిక‌ల్స్ ని పోలీసులు సోదాలు చేస్తారు మ‌రి అలాంటి వెహిక‌ల్ లో ఏందోరికిందో చూస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం మ‌న‌వంతు అవుతుంది.బాగా దుమ్ము కొట్టుకుపోయిన ఓ కారు వేగంగా చెన్నై వైపు దూసుకెళుతోంది. ఆ మార్గంలో విధుల్లో ఉన్న ఓ ఎస్‌ఐకి అనుమానం వచ్చి.. ఆ కారును చేజ్‌ చేసి ఆపారు. కారులోకి తొంగిచూసిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు కళ్లు మిరిమిట్లు గొలిపేలా కరెన్సీ కట్టలు కనిపించాయి. ఆ కారులో ఉన్న సుమారు రూ. 6కోట్ల 40ల‌క్ష‌ల రూపాయ‌ల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఓ బంగారం దుకాణం నుంచి ఈ నగదును చెన్నైకు తీసుకెళుతున్నట్టు తెలిసింది. ఓ రాజకీయ నేత సూచనతోనే తాము తరలిస్తున్నట్టు కారులోని వ్యక్తులు చెప్పారు.

Image result for old cars

కలకలం రేపిన ఈ ఘటన నెల్లూరు జిల్లా తడ సమీపంలో జరిగింది. . బుధవారం మధ్యాహ్నం ఎస్‌ఐ దాసరి వెంకటేశ్వరరావు సూళ్లూరుపేట నుంచి వస్తుండగా.. చేనిగుంట జాతీయ రహదారి వద్ద దుమ్ము కొట్టుకుపోయి వేగంగా వస్తున్న కారును గమనించారు. డ్రైవర్‌ సహా లోపలున్న ఇద్దరు కంగారుగా కనిపించడంతో కారును స్వాధీనం చేసుకొని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఒకవైపు వారిని ప్రశ్నిస్తూనే, కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారు సీట్ల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో నగదు మూటలు గమనించారు. ఆదాయపు పన్ను అధికారులకు ఎస్‌ఐ సమాచారం అందించారు. ఆ అధికారుల సమక్షంలో నగదును లెక్కించారు. అన్నీ రెండు వేలు, 500 నోట్ల కట్టలే ఉన్నాయి.

Image result for old cars

వాటిని లెక్కించగా, ఆరుకోట్ల రూపాయలుగా గుర్తించారు. అలాగే, తైైవాన్‌ సహా ఐదు దేశాలకు చెందిన సుమారు రూ.19,ల‌క్ష‌ల విలువైన విదేశీ కరెన్సీ ఉంది అలాగే , ఓ కవరులో 55 గ్రాముల బంగారు ముద్ద కనిపించాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం విదేశీ కరెన్సీ, బంగారంతో కలిపి పట్టుబడ్డ నగదు మొత్తం ఆరు కోట్ల 40 ల‌క్ష‌ల రూపాయలుగా అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. పట్టుబడ్డ నగదు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఓ బంగారు దుకాణం యజమానిదిగా నిందితులు పోలీసులకు చెప్పార‌ట‌. ఆ దుకాణంలో గుమస్తాలుగా వీరు ఇద్ద‌రు ప‌ని చేస్తున్నారు. వారిని నరసాపురం మండలం రుస్తుంబాద్‌ గ్రామానికి చెందిన మాచినేని కనక సురేశ్‌, చేమపూరి హరిబాబుగా పోలీసులు గుర్తించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పోలీసు తనిఖీల్లో నగదు ఎక్కడ పట్టుబడినా, నరసాపురంతోనే లింక్‌ ఉండటం పోలీసు వర్గాలను ఆలోచింపజేస్తోంది. రెండు నెలల క్రితం తెలంగాణ ఎన్నికల సమయంలో వరంగల్‌ జిల్లాలో పోలీసుల తనిఖీలో ఓ కారులో ఐదు కోట్లు దొరికాయి. ఆ నగదును పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి తరలించినట్టు అప్పట్లో గుర్తించారు. తాజాగా తడ వద్ద పట్టుబడిన నగదుతో కూడిన కారు యజమానీ, అందులోని వ్యక్తులూ నరసాపురం వారే కావడం తో ఇక్క‌డ ఏమైనా ఆర్దిక లావాదేవీలు భారీగా జ‌రుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.