ఆ ఫొటోగ్రాఫర్‌ జీతం 75 లక్షలు… అతడు ఏం ఫొటోలు తీయాలో తెలిస్తే నోరు వెళ్లబెడతారు

307

పిండికొల‌ది రొట్టె అంటారు ఇది ముమ్మాటికి నిజం అనిపిస్తుంది, కొన్ని కొన్ని ఘ‌ట‌న‌లుసంఘ‌ట‌న‌లు వింటూ ఉంటే,కొందరు పొట్ట కూటి కోసం రోజుకు 10 గంటలు కష్టపడగా 300 నుండి 500 వరకు వస్తాయి. చెమటోడ్చి కష్టపడితే ఇది సాధ్యం. కాని కొందరికి అదృష్టం బాగుంటే పెద్దగా కష్ట పడకుండానే లక్షల్లో సంపాదన వస్తూ ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఏ స్థాయిలో సంపాదిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీతాలు తీసుకునే వారిలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు అత్యధిక జీతాలు తీసుకునే వారిలో ముందు ఉంటారు అనేది, ప్రతి ఒక్కరి అభిప్రాయం. కాని లండన్‌ లో ఒక ఫొటోగ్రాఫర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు సైతం షాక్‌ ఇచ్చాడు.

Image result for photographer

యూకేలో ఒక ఫొటోగ్రాఫర్‌కు తాజాగా ఉద్యోగం వచ్చింది. అందుకోసం అతడికి సంవత్సరానికి 72 లక్షల జీతం కూడా ఇచ్చేందుకు ఆయన్ను ఎంపిక చేసుకున్న వారు ఒప్పందం చేసుకున్నారు. సదరు ఫొటోగ్రాఫర్‌ కేవలం ఫొటోలు తీయడం వల్ల అది కూడా వారంలో అయిదు రోజులు ఫొటోలు తీయడం వల్లే ఇంత భారీ మొత్తంలో సంపాదించబోతున్నాడు. యూకేలోని టాప్‌ బిలియనీర్‌ ఫ్యామిలీ వారు ఈ ఫొటోగ్రాఫర్‌ను ఫ్యామిలీ ఫొటోగ్రాఫర్‌గా నియమించుకోవడం జరిగింది.సదరు ఫ్యామిలీకి సంబంధించిన సభ్యులు ఎవరు ఎప్పుడు ఎలాంటి వినోదాది కార్యక్రమాల్లో హాజరు అయినా, వారు హాలీడే ట్రిప్‌ వెళ్లిన ప్రతి ఒక్క విషయాన్ని ఈ ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించాల్సి ఉంటుంది. పెద్దగా కష్టం ఏమీ లేకుండా రోజుకు నాలుగు గంటల పని మాత్రమే, సంవత్సరంలో అదనపు 30 రోజుల సెలవులు కూడా ఈయనకు కుటుంబ సభ్యులు ఇవ్వనున్నారు.

ఆ బిలియనీర్‌ ఫ్యామిలీ తమకు ఫొటోగ్రాఫర్‌ కావాలంటూ ఒక వెబ్‌ సైట్‌ ద్వారా ప్రకటించగా ఈయన ఎంపిక పక్రియకు వెళ్లాడు. ఆ సమయంలో వందలాది మంది కూడా ఇంటర్వ్యూలకు వచ్చారు. పోటీ ఎక్కువ ఉన్నా కూడా తన ప్రతిభతో ఈయన ఆ ఛాన్స్‌ను దక్కించుకుని ప్రపంచంలోనే అత్యదిక జీతం అందుకుంటున్న ఫొటోగ్రాఫర్‌గా పేరు దక్కించుకున్నాడు.ఆ ఫొటోగ్రాఫర్‌ గురించి ఆలోచించి మీరు నా జీతం ఇంతేనా, నా సంపాదన ఇంతేనా అని దిగులు చెందవద్దు. ఎవరికి ఎంత రాసిపెట్టి ఉంటే అంతే.. అతడి ప్రతిభకు అది గుర్తింపు, ఎవరి స్థాయికి, ప్రతిభకు తగ్గట్లుగా వారి జీతం వ‌స్తుంది మ‌రి కాదు అన‌లేని స‌త్యం, మ‌రి ఇత‌ని అదృష్టం పై మీరు ఏమ‌నుకుంటున్నారు మీ అభిప్రాయం కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి.