సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తికి హెల్మెట్ లేదని ఫైన్ వేసిన పోలీసులకు దిమతిరిగే షాకిచ్చిన సామాన్యుడు

352

మనం సిటీలలో మోటార్ సైకిల్ మీద వెళ్లాలంటే భయపడతాం.ఎందుకంటే ఎక్కడ పోలీసులు పట్టుకుని చాలాన్స్ రాస్తారేమో అని భయం.అన్నీ పేపర్స్ ఉన్నా కానీ ఏదో కారణం చెప్పి పైసల్ లాగుతారని మన భయం.అయితే బైక్స్ మీద వెళ్లేవారు కాదు ఇకపైనా సైకిల్ మీద కూడా వెళ్లాలంటే మీరు భయపడాలి.ఎందుకంటే హెల్మెట్ లేకుండా సైకిల్ మీద వెళ్ళిన ఫైన్ వేస్తున్నారు.ఇప్పుడు ఒక వ్యక్తికి అలాగే వేశారు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for cycle riding

మీకు సైకిల్ ఉందా ..? అయితే జాగ్రత్త గెల్మెట్ లేకుండా బయటకి వెళ్లారో ట్రాఫిక్ పోలీసులు చలానా కాగితం చేతిలో పెట్టి కట్టమంటారు .! అదేంటి ఇదేమైనా బండా పెనాల్టీ కట్టడానికి అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇది నిజమండి బాబు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కసీమ్ అనే యువకుడు బ్రతుకు దెరువు రీత్యా కేరళకు వలస వచ్చి ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తూ రోజుకు రూ.400 సంపాదించే కూలి. అయితే కసీమ్ ఇటీవల కంబాలా ప్రాంతంలో జాతీయ రహదారి గుండా తాను పనిచేసే చోటుకు వెళుతుండగా పోలీసులు అతన్ని ఆపి వేగంగా వెళుతున్నావు.. దానికి తోడు హెల్మెట్ కూడా ధరించలేదని రూ.2000 జరిమానా కట్టాలని చలానా విధించారు.

Image result for cycle riding india

ఎందుకు జరిమానా కట్టాలి నేను రోజుకూలిని అని పోలీసులను బ్రతిమిలాడగా రూ.500 చలాన్ విధించి అది కట్టాలని సూచించి సైకిల్ టైర్ లోనుంచి గాలి కూడా తీసేసారు.పైగా అతని మీద చిన్న కేసు కూడా నమోదు చేశారు.అతనిని స్టేషన్ కు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.ఈ విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు స్నేహితులు స్టేషన్ కు వెళ్తే అతను జరిగిందంతా చెప్పాడు.స్టేషన్ ముందు బంధువులు ఆందోళన చేశారు.దాంతో పోలీసులు వారిని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు.

అప్పుడే అక్కడికి మీడియా రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.మీడియా అతనిని అడిగితే జరిగిందంతా చెప్పాడు.ఇక ఆ చలాన్ పేపర్ గమనిస్తే అందులో ఓ మహిళకు సంబందించిన ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్ నెంబరు ఉందని తెలిసింది.అది కాస్తా వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని బంధువులు అంటున్నారు.వాళ్ళను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్టు ఉన్నతాధికారి చెప్పాడు.చూశారుగా సైకిల్ మీద వెళ్తే కూడా చలాన్ రాసిన ఈ పోలీసుల వ్యవహారం గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సైకిల్ కు చలాన్ రాయడం గురించి అలాగే అతని పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసుల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.