అమ్మ ఫోన్ తీయ్యటం లేదని అమెరికా నుండి వచ్చిన కొడుకుకి ఇంట్లో ఎదురైన దృశ్యం.. చూసి షాక్!

631

ఉద్యోగ రీత్యా లేదా చదువు కోసమో తల్లిదండ్రులను వదిలి వేరే ప్రదేశంలో ఉండాల్సి వస్తుంది.ఈ మధ్య కాలంలో అయితే మనుషులు డబ్బు సంపాదన కోసం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం.డబ్బుకు ఉన్నంత విలువ దేనికి లేదు.డబ్బు లేని మనిషికి అస్సలు విలువ ఇవ్వడం లేదు చుట్టూ ఉన్న ప్రపంచం.దాంతో సంపాదించాలని,ఎంత సంపాదించినా సరిపోవడం లేదని మరింత సంపాదించాలని డబ్బు వెనుక పిచ్చి పట్టినట్టు పరుగెడుతున్నవారు ఎందరో ఉన్నారు.అయితే ఈ ప్రయాణములో మనం చాలా అనుబంధాలను కోల్పోవాల్సి ఉంటుంది.ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన అలాంటిదే.మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for indian talking phone

పిల్లవాడు బాగా చదువుతున్నాడని భావించి వారికి ఇష్టమైన రంగంలో చదివించాలని భావించి తండ్రి లేకపోయినా కష్టపడి చదివించింది తల్లి.ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో విదేశాలకు వెళ్లాలని భావించి తల్లికి విషయం చెప్పాడు.ఆమె ముందు వెనుక ఆలోచించకుండా కొడుకు సంతోషమే తన సంతోషంగా భావించి వెళ్లిరమ్మని చెప్పడంతో అతను అమెరికాకు వెళ్ళిపోయాడు.అమెరికా వెళ్లిన కొడుకు ప్రతిరోజు ఫోన్ చేసేవాడు.అయితే రానురాను అది వారానికి ఒకసారి ఫోన్ చేయడం అయ్యింది.ఆ తర్వాత నెలకు ఒకసారి చెయ్యడం జరిగింది.ఇలా మెల్లగా ఫోన్స్ చేసుకోవడం తగ్గిపోయింది.ఆరోగ్యం క్షీణించిన కొడుకుతో చెప్పాలని అనిపించలేదు ఆమెకు.దాంతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది.ఎప్పటిలాగే తల్లికి ఫోన్ చేశాడు కొడుకు.తల్లి ఫోన్ ఎత్తలేదు.అలా సంవత్సరం ప్రయత్నించి అమ్మను చూడటం కోసం ఇండియా వచ్చాడు.అమ్మను చాలా రోజుల తర్వాత చూస్తున్నా అన్న ఆనందం అతనిలో ఉంది.ఇంతలో ఇంటికి చేరుకున్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇంటి తలుపు తట్టగా తలుపు తీయలేదు అమ్మ.దాంతో గట్టిగా తలుపు తీయాలని చూశాడు.కానీ తలుపు రాలేదు.లోపల గడియ వేసి ఉంది.దాంతో చేసేదేమి లేక తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడ తల్లి కనిపించలేదు.కానీ ఒక సోఫాలో ఒక అస్థిపంజరం కనిపించింది.దాంతో పోలీసులకు విషయాన్నీ చెప్పాడు కొడుకు.దీంతో ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆ అస్థిపంజరాన్ని చెక్ చేసి అది అతని తల్లిదే అని ఆమె చనిపోయి దాదాపు సంవత్సరం అవుతుందని రిపోర్ట్ ఇచ్చారు.ఈ విషయం మొత్తాన్ని పోలీసులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.దాంతో ఆమె కొడుకును అందరు నానా మాటలు అంటున్నారు.ఇప్పుడు మనం ఉన్నా ఈ పోటీ ప్రపంచంలో డబ్బు చాలా ముఖ్యమైనది.డబ్బు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Related image

మన జీవితంలో డబ్బు అనేది ఒక భాగం అవ్వాలి.అంతేకానీ డబ్బే జీవితం అవ్వకూడదు.అలా అయితే ఇలాగే ఉంటుంది.మనం ఇలా ఉన్నామంటే కారణం మన తల్లిదండ్రులు.అసలు వాళ్ళు ఎలా ఉన్నారు,ఏం చేస్తున్నారు ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.అలా చెయ్యలేని వాళ్ళు తమ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చడం తప్ప దేనికి పనికిరారు.కనీసం తల్లిదండ్రులను కడసారి చేసుకోలేని జీవితం ఉంటె ఎంత లేకుంటే ఎంత.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తల్లి గురించి పట్టించుకోకుండా అమెరికా వెళ్లి తల్లి కడసారి చూపులకు కూడా నోచుకోలేని ఈ సుపుత్రుడి గురించి అలాగే తల్లిదండ్రుల గురించి వారి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేసి వారి సంతోషం గురించి మాత్రమే చూసుకునే పిల్లల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.