నెల జీతం 10 వేలు కాని ఇప్పుడు 100 కోట్లు సంపాదించాడు.. ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు

337

కొంద‌రుప్ర‌భుత్వ ఉద్యోగులు ఉద్యోగంలో చేరిన త‌ర్వాత లంచావ‌తారులుగా మారిపోతారు.. అందుకే ఎట్టి ప‌రిస్దితుల్లోవీరి ఆస్దులు పెరిగినా క‌చ్చితంగా ఎలా ఇంత ఆస్తి పెరిగింది అనేది తెలుసుకుంటారు ఏసీబీ అధికారులు, స‌మాజం నుంచి చిన్న టిప్ అందితే ఏసీబీ కూడా వీరిపై నిఘాపెడుతుంది.. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏసీబీ అధికారులు మరో అవినీతి చేపను పట్టుకున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం జూనియర్ అసిస్టెంట్‌ నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలో బయటపడ్డ ఆస్తులు ఆస్తులు చూసి అధికారులే షాక్ తిన్నారు. అతడు ఐదేళ్లలోనే రూ.100 కోట్లు విలువైన ఆస్తులు కూడబెట్టడం చూసి అవాక్కయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామం రామకృష్ణనగర్‌లోని గ్రామీణ నీటి సరఫరా విభాగం జూనియర్‌ అసిస్టెంట్‌ రాంపల్లి దివాకర్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు.

Image result for money

ఏసీబీ అదనపు ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో దివాకర్ ఇంటితోపాటు బంధువుల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ దాడుల గురించి ఎస్పీ రమాదేవి వివరించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లా కార్యాలయంలో రాంపల్లి దివాకర్‌ జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. ఆయన కేవలం ఐదేళ్లలోనే రూ.100 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టాడని వెల్లడించారు. 2012 నుంచి 2017 లోనే ఈ మొత్తాన్ని సంపాదించినట్టు పేర్కొన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆస్తులను కొనుగోలు చేసినప్పుడు లావాదేవీలను బ్యాంకు ద్వారా కాకుండా నగదు మార్పిడి ద్వారానే చేసినట్లు గుర్తించామని ఆమె తెలియజేశారు. తణుకు మండలం వేల్పూరు, టీచర్స్‌ కాలనీ, రావులపాలెం ప్రాంతాల్లోదివాకర్ పేరుతో బిల్డింగులు ఉన్నట్టు సోదాల్లో బయటపడిందన్నారు. అలాగే గోపాలపురం మండలంతోపాటు వివిధ ప్రాంతాల్లోని పొలాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. దివాకర్‌ పేరు మీద 85 ఎకరాల భూమి, 19 ఇళ్ల స్థలాలు, 4 కార్లు, 50 కాసుల బంగారం, రెండు కిలోల వెండి సామాన్లు ఉన్నట్లు సోదాల్లో గుర్తించామని ఆమె చెప్పారు. ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, నగదు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఆమె వెల్లడించారు. ఇక కొంద‌రు స్నేహితుల పేర్లు మీద బంధువుల పేర్లు మీద ఇంకా ఆస్తులు ఉన్నాయి అనే కోణంలో కూడా విచార‌ణ చేస్తున్నారు లాక‌ర్లు విష‌యంలో కూడా మ‌రింత లోతుగా విచార‌ణ చేస్తామ‌న్నారు. మొత్తానికి ప్ర‌జ‌ల‌కు అందాల్సిన సోమ్ము ఈ 100 కోట్లు కాని ఎలా తినేశాడొ చూశారుగా మ‌రి ఇలాంటి వారికి ప్ర‌భుత్వం ఎటువంటి శిక్ష విధించాలో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.