వైద్య చరిత్రలోనే అధ్బుతం: ఒకే గర్భం నుండి పుట్టిన తల్లి బిడ్డ

555

టెక్నాల‌జీ సైన్స్ అభివృద్ది చెందుతూ నూత‌న ఒర‌వ‌డిని చూపిస్తున్నాయి ప్ర‌పంచంలో… ఇలా అభివృద్దితో స‌మాజంలో మ‌రింత ముందుకు వెళుతున్నాం.. ఇక వైద్య చ‌రిత్ర‌లో కొన్ని ప‌రిణామాలు వైద్యులు తిర‌గ‌రాస్తున్నారు అనే చెప్పాలి..వైద్య చరిత్రలో మరో అద్భుతం జరిగింది. ఇది విన్న స‌మాజంలో చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అలాగే డాక్ట‌ర్లు సైతం ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నారు. ఇంత‌కీ ఏమిటి ఈ విచిత్రం ఏమిటి ఓ గొప్ప ప‌రిణామం అని అనుకుంటున్నారా మ‌రి అస‌లు విష‌యం తెలుసుకుంటే మీరు కాస్త షాక్ అవుతారు.

Image result for pregnant womens

తాను జన్మించిన గర్భసంచి నుంచే తన బిడ్డకు జన్మనిచ్చిందో మహిళ. ఈ అరుదైన ఘటన పుణెలోని గేలాక్సీ కేర్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఇది ఏదో కాస్త అర్దం కాని విషయంగా ఉందా.మరి ఒక‌సారి ఆ విష‌యం ఏమిటి అనేది తెలుసుకుందాం.గుజరాత్‌కు చెందిన మీనాక్షి అనే మహిళకు 22 సంవ‌త్స‌రాలు, ఆమెకు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుట్టింది మీనాక్షి. దాంతో పిల్లలకు జన్మనిచ్చే అవకాశం లేకుండా పోయింది.. అయితే సరోగసికి అవకాశం ఉన్నా.. ఎందుకో అంతగా ఆసక్తి కనబరచలేదు. ఈ క్రమంలో గతేడాది మే 19న పూణే గేలాక్సీ కేర్ ఆస్పత్రి వైద్యులు.. 9 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి.. తన తల్లి గర్భాశయాన్ని మీనాక్షికి అమర్చారు. దాంతో ఈ ఏడాది మార్చిలో మీనాక్షి గర్భం దాల్చింది.

త‌ర్వాత గేలాక్సీ కేర్ ఆస్పత్రి డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ నేతృత్వంలో ఆమెను ఎప్పటికప్పుడూ పరీక్షిస్తూ.. సరిగ్గా 32 వారాల 5 రోజులకు సీజేరియన్ ఆపరేషన్ చేసి పండంటి బిడ్డకు పురుడు పోశారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. బిడ్డను కన్నందుకు మీనాక్షి ఎంతో సంతోషించింది. గర్భసంచి మార్పిడి.. అది కూడా.. తల్లి జన్మించిన గర్భసంచి నుంచే బిడ్డ కూడా జన్మించడం ఆసియాలోనే తొలిసారి అని వైద్యులు ప్రకటించారు. మ‌రి విన‌డానిక ఆశ్చ‌ర్యం అనిపించినా ఆసియాలో ఆఫ్యామిలీ రికార్డు సృష్టించింది. ఇది ఓ చ‌రిత్ర‌గా లిఖిస్తామ‌ని ఆ డాక్ట‌ర్లు చెబుతున్నారు.. ఎన్నో అరుదైన స‌ర్జ‌రీల్లో ఇది ఓ అరుదైన స‌ర్జ‌రీ అని చెబుతున్నారు. మ‌రి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.