మంత్రిగారి పాడు పని:సిగ్గులేకుండా రోడ్డు పక్కనే ఏం చేస్తున్నాడో చూడండి

310

సినిమా సెలెబ్రిటీలు అయినా రాజకీయ సెలెబ్రిటీలు అయినా నలుగురికి ఆదర్శంగా ఉండాలి.వాళ్ళు చేసిన ఒక సెన్సేషన్ అవుతుంది.వాళ్ళు తప్పు చేస్తే ప్రజలు కూడా తప్పు చేస్తారు.అంత పెద్ద వాళ్ళే చేసినప్పుడు మనం చేస్తే తప్పేంటి అని అనుకునే పిచ్చి జనాలు చాలా మంది ఉన్నారు.ఇప్పుడు ఒక రాజకీయ ప్రముఖుడు పైగా మంత్రి అయ్యుండి చేసిన ఒక పని హాట్ టాపిక్ అయ్యింది.ఒకవైపు ప్రధాన మంత్రి స్వచ్ఛభారత్ అంటుంటే కొందరేమో అది మనకు కాదులే అని ప్రవర్తిస్తుంటారు.దేశ ప్రధాని పెట్టిన స్వచ్ఛ భారత్ ను స్వయంగా ఒక మంత్రే ఎటకారం చేశాడు.ఇంతకు ఆ మంత్రి ఎవరు ఏం చేశాడో తెలుసుకుందామా.

Image result for road side toilet

మంత్రినైతే ఏంటి నేనూ మామూలు మనిషినే. అర్జంట్ బాత్రూమ్ వస్తే ఏంచేయాలి. ఆటైమ్‌‌లో స్వచ్ఛ భారత్ ఎలా గుర్తుకు వస్తుంది. ఇచ్చట మూత్రం పోయరాదు వంటి లక్షణమైన అక్షరాలు ఏమి కనిపించవు అని అంటున్నాడు రాజస్థాన్ మంత్రి శంభు సింగ్ ఖేటసర్. ఈయన బహిరంగ మూత్ర విసర్జన చేసి నవ్వులపాలయ్యారు. ఆయన మూత్రం పోస్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరింత వివాదమవడానికి కారణం ముఖ్యమంత్రి వసుంధర రాజే పోస్టర్ పక్కన తన పని కానిస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.అక్కడ ఎవరూ చూడట్లేదనుకుని చాటుగా కానిద్దామనుకున్నారు. కానీ అడ్డంగా దొరికిపోయారు. సరే.. పోనీ చేసిన పనికి పశ్చాత్తాప పడ్డారా అంటే అదీ లేదు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ ఉద్దేశం బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ, మూత్ర విసర్జన కాదని చెప్పుకొచ్చారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వ్యాధులు వచ్చేది బహిరంగ మల విసర్జన ద్వారానే కానీ మూత్ర విసర్జన వల్ల ఎలాంటి సమస్యా ఉండదంటూ తన పనిని సమర్ధించుకున్నారు.ఉదయం నుంచి చాలా బిజీగా ఉన్నాను. అర్జంట్ వచ్చినా ఆపుకున్నాను. దగ్గర్లో ఎక్కడా టాయ్‌లెట్లు లేవు. ఇంక నా వల్ల కాలేదు. అందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చారు.ఎంత అర్జెంట్ అయితే ఏంటి సర్..చుట్టుపక్కల ఇల్లులే లేవా..ఎవరి ఇంటి లోపలికి వెళ్లైనా పని కానివ్వాలి కానీ ఇలా బహిరంగంగా చేస్తే ఎలా చెప్పండి.మరి మంత్రిగారికి ఏం పనిష్మెంట్ ఇస్తారో చూడాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ప్రధాని మోడీ పెట్టిన స్వచ్ఛ భారత్ గురించి దానిని తుంగలో తొక్కి బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన ఈ మంత్రి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.