మీడియా ముందుకు ప్రణయ్ కేసు నిందితులను ప్రవేశపెట్టిన పోలీసులు

427

మిర్యాలగూడాలో జరిగిన పరువుహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్‌ను దారుణంగా చంపించాడు అమృతవర్షిణి నాన్న మారుతీరావు. అయితే ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేశారువీరిని మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.ఆ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడాడు.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రణయ్ హత్య కోసం మూడుసార్లు యత్నించిన నిందితులు చివరి ప్రయత్నంలో అతణ్ని నరికి చంపారని నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో అనేక కోణాలను వెల్లడించారు. కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Image result for pranay and amrutha

నిందితులను మంగళవారం (సెప్టెంబర్ 18) సాయంత్రం మీడియా ఎదుట హాజరుపరిచారు.A1 మారుతీరావు,A2సుభాష్ శర్మ,A3 అస్గర్ అలీ,A4 మహ్మద్ బారీ,A5 అబ్దుల్ కరీం,A6 శ్రవణ్,A7 శివ లను మీడియా ముందు పెట్టారు.వీరిలో A2 సుభాష్ శర్మ హత్య చేశాడు.సిసి టీవీ ఫుటేజిలో ఉన్నదీ సుభాష్ శర్మ అని ఎస్పీ తెలిపారు.అతను ఇక్కడ లేడు.చంపేసి బీహార్ వెళ్ళాడు.అక్కడి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారని చెప్పారు.ప్రణయ్ హత్య కోసం నిందితులు ఆగస్టు 9 నుంచి రెక్కీ నిర్వహించారని ఎస్పీ తెలిపారు. ఆగస్టు 14న తొలిసారి హత్యకు ప్రయత్నించారని చెప్పారు.‘ఆగస్టు 15కు ముందు రోజు అమృత బ్యూటీ పార్లర్‌‌కు వచ్చింది. ఆ విషయం ముందుగానే గ్రహించిన మారుతీరావు ప్రణయ్‌ను చంపేందుకు నిందుతులను పురమాయించాడు. అయితే.. ప్రణయ్, అమృతతో పాటు ప్రణయ్‌ సోదరుడు అజయ్ కూడా ఉండటంతో నిందితులు కన్ఫ్యూజన్‌కు గురై ఆగిపోయారు’ అని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. సెప్టెంబరు మొదటి వారంలో మరోసారి హత్య ప్రయత్నం జరిగిందని ఎస్పీ చెప్పారు.

Partners in crime: Nalgonda Superintendent of Police A.V. Ranganath producing the accused in the Pranay murder case before the media on Tuesday.

ఆ సమయంలో అమ్మాయిని కిడ్నాప్‌ చేసి ప్రణయ్‌ను చంపాలని భావించారని, ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి కొందరిని తీసుకొచ్చారని తెలిపారు. కానీ, అప్పుడు కూడా విఫలమయ్యారని చెప్పారు. మూడో ప్రయత్నంలో సెప్టెంబరు 14న జ్యోతి ఆస్పత్రి వద్ద ప్రణయ్‌ను కత్తితో నరికి చంపారని తెలిపారు.ఈ కేసులో అమృత తల్లి పాత్ర ఏమీలేదని, మారుతీ రావు ఆమె ద్వారా కేవలం సమాచారం మాత్రమే తెలుసుకుని హత్యకు కుట్ర పన్నాడని ఎస్పీ తెలిపారు. ఓ వైపు హత్యకు పథక రచన చేస్తూనే మారుతీ రావు తన కూతురు అమృతకు గర్భస్రావం చేయించేందుకు అనేక విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చాడని చెప్పారు. ఆమె బిడ్డను కంటే తన పరువు మరింత పోతుందని ఇలా చేసినట్లు వివరించారు.ప్రణయ్ కుటుంబం వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జరిపించడం మారుతీరావుకు మరింత ఆగ్రహాన్ని తెప్పించిందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఆ తర్వాత హత్యకు మరింత కసిగా ప్రయత్నించినట్లు చెప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ కేసులో నిందితులంతా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నారని, అయితే.. హత్యలో రాజకీయ కోణం మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. నయీం ముఠా ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలనూ కొట్టిపడేశారు.‘ఇది వ్యక్తిగత వ్యవహారమే తప్ప రాజకీయాలకు సంబంధం లేదు. ఇదంతా డబ్బులతో చేశారు. కేసులో నయీం ముఠా హస్తం ఉన్నట్లు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదు. జిల్లాలో నయీం ముఠా లేదు. కేసుకు సంబంధించి అసత్య సమాచారంతో మీడియాలో అనేక కథనాలు రాస్తున్నారు. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. క్రిమినల్స్‌ను ఎక్కువ చేసి చూపితే.. వారు దాన్ని బలంగా ఉపయోగించుకొని మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది’ అని ఎస్పీ అన్నారు.చూశారుగా ఈ హత్యకు ఎవరెవరు కుట్ర పన్నారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హత్యకు కారణమైన వాళ్ళ గురించి అలాగే ఈ హత్యకు మారుతీరావు పన్నిన కుట్ర గురించి జిలా ఎస్పీ చెప్పిన విషయాల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.