విమానాన్నే దొంగతనం చేసిన మెకానిక్.. చివరికి ఏమైందో తెలిస్తే షాక్!

489

ఆత్మహత్య చేసుకోవడం మంచి నిర్ణయం కాదని మన అందరికి తెలిసినదే.అయిన సరే ఎవరికున్న సమస్యల వలన వారు ఆత్మహత్య చేసుకుంటారు.అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఏదైనా విషం తాగుతారు.లేదా ఏదైనా బిల్డింగ్ ఎక్కి దూకడం లేదా రైలు కింద పడి చావడమో లేదా ఏదైనా నీళ్ళు ఉన్న ప్రదేశంలో దూకి చనిపోతారు.ఇప్పటివరకు మనం ఇలా ఆత్మహత్య చేసుకున్న వారినే చూశాం కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోడానికి ఏకంగా విమానాన్నే దొంగాలించాడు.ఆసూసైడ్ చేసుకోవడానికి విమానాన్ని దొంగతనం చేశాడు.. చివరికి ఏమైంది..శ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం.మరి ఆ వ్యక్తి ఎవరు ఆత్మహత్య చేసుకోడానికి విమానాన్నే ఎందుకు ఎంచుకున్నాడు.ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

అలాస్కా ఎయిర్‌‌లైన్స్‌లో ఓ దొంగ ప్రవేశించాడు.ఆ దొంగ ఏ డబ్బునో బంగారాన్నో దొంగతనం చెయ్యలేదు.ఏకంగా ఓ విమానాన్నే ఎత్తుకెళ్ళాడు.ఆ దొంగ ఎవరో కాదు, సాక్షాత్తూ హొరైజన్ ఎయిర్ ఉద్యోగే.అతని పేరు పియర్స్.వయసు 29 ఏళ్ళు.అయితే విమానాన్ని దొంగతనం చేసి ఏమి చేసుకుంటాడు అని అనుకుంటున్నారా.పియర్స్ అసలు లక్ష్యం ఆ విమానాన్ని దొంగతనం చేయడం కాదని తెలుస్తోంది.ఆ విమానాన్ని దొంగతనం చెయ్యడం వెనుక ఒక కథ ఉంది.అదేమిటి అంటే..అతను దీనిని దొంగతనం చెయ్యడానికి కారణం అసలు కారణం ఆ విమానం సహాయంతో ఆత్మహత్య చేసుకుందామని. ఆత్మహత్య చేసుకోవడం కోసం ఈ పని చేశాడని అధికారులు కూడా చెప్తున్నారు.సీటెల్ – టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఓ ట్వీట్‌ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం హొరైజాన్ ఎయిర్ క్యూ400ను శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అలాస్కా ఎయిర్‌లైన్స్ మెకానిక్ ఎత్తుకెళ్ళాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ విమానాన్ని ఆ విమానాశ్రయం నుంచి అనధికారికంగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నించాడు, ఆ విమానం కొద్ది దూరంలోనే సౌత్ ప్యూజెట్ సౌండ్ వద్ద కూలిపోయింది.ఈ విమానంలో ప్రయాణికులు లేరు. విమానాశ్రయం సాధారణ కార్యకలాపాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దొంగతనానికి గురైన విమానాన్ని స్వాధీనం చేసుకునేందుకు రెండు ఎఫ్-15 సైనిక విమానాలు వేగంగా వెళ్ళాయి. అయితే దొంగతనానికి గురైన విమానం కూలిపోవడంలో ఈ సైనిక విమానాల పాత్ర ఏమీ లేదని పియర్స్ కౌంటీ (వాషింగ్టన్) షెరీఫ్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఈ విమానం సుమారు 30 మైళ్ళు ప్రయాణించి, కెట్రాన్ ద్వీపంలో కూలిపోయినట్లు తెలిపింది.అతను చనిపోయాడు అని ప్రకటించారు.అయితే అతను ఎందుకు చనిపోవాలనుకున్నాడో మాత్రం తెలియలేదు.విన్నారుగా విమానం ద్వారా ఆత్మహత్య చేసుకున్న ఈ వ్యక్తి గురించి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఆత్మహత్య కోసం విమానాన్ని ఎంచుకున్న ఈ వ్యక్తి గురించి అలాగే ఆత్మహత్య చేసుకునే వారి మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.