భారీగా తగ్గిన బంగారం ధర క్యూ కడుతున్న జనం

432

వరుసగా రెండు రోజులు దిగొచ్చి గురువారం పెరిగిన బంగారం ధర శుక్రవారం మళ్లీ పతనమైంది. అంతర్జాతీయంగా రూపాయి బలపడటంతో పాటు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గటంతో బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 15న) 10 గ్రాముల బంగారం ధర 235 రూపాయల మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,250 నుంచి 32,015కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,100 నుంచి 31,865గా నమోదైంది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,800 వద్దే కొనసాగుతోంది.

Image result for gold

ఇక గురువారం పుంజుకున్న వెండిధర శుక్రవారం సైతం కొనసాగింది. పరిశ్రమల నుంచి డిమాండ్ ఉండటంతో నేటి ట్రేడింగ్‌లో కేజీ వెండి ధర 37,900 వద్ద స్థిరంగా ఉంది. ఇక వారాంతపు డెలివరీ వెండి ధర రూ.147 పెరిగింది. కేజీ ధర 36,671 నుంచి 36,818కి చేరింది. 100 వెండి నాణేల ధర గత రెండు రోజుల మాదిరిగానే శుక్రవారం సైతం కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్ద కొనసాగుతోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,150 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,600 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర రూ.41,250 వద్ద కొనసాగుతున్నాయి. డిసెంబ‌రు నెల‌ఖ‌రు వ‌ర‌కూ ఇలాగే
రేట్లు పెరుగుదల ఉంటుంది అని తెలియ‌చేశారు వ్యాపారులు మొత్తానికి కిలో వెండి ధ‌ర 41 వేల రూపాయ‌ల‌కు చేర‌డంతో వెండి కొనుగోళ్లు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి ఇక పెళ్లిళ్ల సీజ‌న్ అయ్యేస‌రికి ఈరేట్లు మ‌రింత పెరుగుద‌ల ఉంటుంది అని చెబుతున్నారు వ్యాపారులు డిసెంబ‌రు వ‌ర‌కూ ఇలానే రేట్లు పెరుగుద‌ల ఉంటుంది అని చెబుతున్నాయి బులియ‌న్ మార్కెట్ వ‌ర్గాలు. మ‌రి చూశారుగా ఈ రేట్ల పెరుగుద‌ల‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.