24 గంటల్లో భారీ విధ్వంసం.. ఏం జరగబోతుందో చెప్పిన శాస్త్రవేత్తలు

413

తిత్లి తుపాను ఎఫెక్ట్ తో ఇప్ప‌టికే పెద్ద ఎత్తున న‌ష్టం ఏర్ప‌డింది ఏపీకి..తుపాను దృష్ట్యా వ‌చ్చిన ఈ వ‌ర్షాల‌తో కోట్ల‌రూపాయ‌ల న‌ష్టం కూడా సంభ‌వించింది. ఇక ఇప్పుడు మ‌రో తుపాను ఏపిని అత‌లాకుతలం చేస్తోంది..కోస్తా జిల్లాలపై పంజా విసిరేందుకు పెను తుఫాన్‌ ‘పెథాయ్‌’ సిద్ధమైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి గురువారం వాయుగుండంగా మారింది. ఇది గంటకు 11కి.మీ. వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ మచిలీపట్నానికి 1,250కి.మీ. తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది..దీని ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి., ఇది శనివారానికి తుఫాన్‌గా మారనుంది. తీరం దిశగా వచ్చేక్రమంలో తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Image result for cyclone

సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు రావాలని సూచించింది. శుక్రవారం నుంచి కోస్తాలో తీరంవెంబడి గంటకు 45నుంచి 50కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. 15నుంచి గాలుల తీవ్రత పెరిగి, 16కల్లా 100కి.మీ.కు చేరుతుందని తెలిపింది. తుఫాన్‌ మధ్య కోస్తాలో 16రాత్రి లేదా 17న ఉదయం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. కోస్తాలో అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. తుఫాన్‌ నేపథ్యంలో ఈనెల 15నుంచి కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయి. 16నుంచి రెండు రోజుల పాటు కోస్తాలో విస్తారంగా, పలుచోట్ల భారీగా, అక్కడక్కడా 20సెం.మీ. కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాగా, తుఫాన్‌ అంచనాల నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్‌ జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పునరావాస కేంద్రాలు, గ్రామీణ నీటి సరఫరాలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తుఫాన్‌ ముంచుకొస్తున్నందున ఇంధన శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించాలని మంత్రి కిమిడి కళావెంకటరావు సూచించారు… తుఫాన్‌ సమయంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బంది లేకుండా తగిన నిల్వలను సిద్ధంచేసి, వాటిని సురక్షిత గిడ్డంగుల్లో ఉంచాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ కోస్తా జిల్లాలపై ప్రభావం చూపుతుందని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. ఇప్ప‌టికే దినీ ప్ర‌భావంతో ప‌శ్చిమ‌గోదావ‌రి తూర్పుగోదావ‌రి జిల్లాల్లో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. పెద్దఎత్తున పెనుగాలులు వ‌స్తున్నాయి, దీంతో చెట్లు నేల‌కుఒరిగాయి జ‌నం ఈ భారీ వ‌ర్షానికి ఇంటి నుంచి బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. మ‌రి మీ ప్రాంతంలో తుపాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి.