గ్రామంలోకి వస్తే చంపేస్తాం అంటున్న పెద్దలు .. అడవిలో తలదాచుకుంటున్న ప్రేమజంట, ఇంతకీ ఏమైందంటే …?

379

ఇటీవల ప్రేమికులపై తీవ్రమైన దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న కారణంగా యువకుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు మారుతీరావు అనే వ్యాపారి. ఈ ఉదంతం మరవకముందే.. హైదరాబాద్ లో కన్నతండ్రే కూతురిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.తాజాగా మరొక ప్రేమజంట వ్యవహారం బయటపడింది.ప్రేమించుకున్నందుకు ఊరి నుంచి వెలివేశారు.ఊర్లోకి వస్తే చంపేస్తాం అని అంటున్నారు.మరి ఆ ప్రేమికులు పడుతున్న బాధ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

జనగామ జిల్లా గుండాల మండలం మరిపడగ గ్రామంలో నివసించే ఇద్దరి ప్రేమికులకు చాల కష్టం వచ్చింది.మారిపగడ గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి అలాగే జనగామ గ్రామానికి చెందిన సంద్యారెడ్డి రెడ్డిలు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నట్టు తెలుస్తుంది.వీరి ప్రేమ వ్యవహారం ఈ మధ్యనే ఇంట్లో తెలిసింది.దాంతో కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకిరించలేదు.పైగా ఇద్దరినీ మందలించారు.దాంతో వారం క్రితం హైదరాబాద్ వెళ్లి పెళ్లి చేసుకున్నారు.అయితే మిర్యాలగూడలో జరిగిన ఘటనకు ఈ జంట భయపడి ఒంగోలు వెళ్లారు.కావలిలో ఒక లాడ్జిలో తలదాల్చుకున్నారు.అయితే వీరి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వీరి కోసం వెతకగా ఆ లాడ్జిలో వీరు పట్టుబడ్డారు.ఇద్దరు మెజర్స్ అని తేలడంతో ఇరువురి పేరెంట్స్ ను పోలీసులు పిలిపించారు.ఇద్దరు మెజర్స్ కాబట్టి పెళ్లి చేసుకునే హక్కు వాళ్లకు ఉందని,ఆ ప్రేమికులకు ఎలాంటి హాని కలగజేయకూడదని ఇరువురి పేరెంట్స్ తో డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకుని ఇళ్లకు పంపించారు పోలీసులు.అందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు.అబ్బాయితోనే ఉంటా అని అమ్మాయి చెప్పడంతో ఆమెను వదిలేసి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్లిపోయారు.అయితే వీరి ప్రేమను మారిపగడ గ్రామా ప్రజలు ఒప్పుకోవడం లేదు.ఊరిలోకి వస్తే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గ్రామంలోకి రావొద్దని.. వస్తే చంపేస్తామనడంతో దిక్కుతోచని స్థితిలో ఆ జంట అడవిలో తలదాచుకుంది.ఇలా గ్రామస్థులు ఎందుకు చెప్పారంటే ఆ అబ్బయి ఇంతకముందు కూడా ఇలాగే ఒక అమ్మాయిని తీసుకొచ్చారు.ఆ కేసు కంప్లీట్ అయ్యింది.ఇప్పుడు మరొక అమ్మాయిని తీసుకొచ్చాడు.ఇలాంటి వాడు ఊరిలో ఉంటె చాలా డేంజర్ అని గ్రామస్థులు ఇలా చెప్పినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఆ ప్రేమికులు ఇంకా అడవిలోనే ఉన్నారు.మరి ఈ ప్రేమికుల కథ చివరికి ఏమవుతుందో చూడాలి.విన్నారుగా ఈ ప్రేమికులకు వచ్చిన కష్టం గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.