తెలంగాణలో గజం భూమి 100 రూపాయలు మాత్రమే.. వెంటనే కొనుక్కోండి

603

తెలంగాణ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతోంది.. అలాగే తెలంగాణ స‌ర్కారు తీసుకునే చాలా నిర్ణ‌యాలు ప్ర‌జామోద‌యోగ్యంగా ఉంటున్నాయి.. దీంతో తెలుగు ప్ర‌జ‌లు తెలంగాణ‌లో స‌ర్కారు నిర్ణ‌యాల‌కు జై కొడుతున్నారు… ఇక ఇప్ప‌టికే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు.. ఇక ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా క‌ఠిన‌త‌రం చేశారు.. తాజాగా తెలంగాణ స‌ర్కారు ఓ ఆఫ‌ర్ ఇచ్చింది అయితే ఆఫ‌ర్ ప్ర‌జ‌ల‌కు కాదు.. రాజ‌కీయ పార్టీల‌కు.. దీంతో ఆ ఆఫ‌ర్ విన్న‌వారు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ ఆఫ‌ర్ మాకు ఇచ్చినా బాగుండేది అంటున్నారు.. ఇంత‌కీ ఆఫ‌ర్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for kcr

తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీలు రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు కట్టుకుంటారా అని స‌ర్కారు అడుగుతోంది.. ఒక‌వేళ ఇలా కార్యాల‌యాలు క‌ట్టుకుంటే ఆ పార్టీల‌కు గజం .100రూపాయ‌ల‌కే భూములిస్తాం అంటూ తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది….ఇలా రాజకీయ పార్టీలకు బంపర్‌ ఆఫర్‌ ఇవ్వనుంది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో భూములు కేటాయించడానికి వీలుగా విధానాన్ని సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూముల కేటాయింపుపై విధాన నిర్ణయం తీసుకున్నారు… ఈ నేపథ్యంలో విధివిధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వం.. అది పూర్తవగానే లేఖలు రాయనుంది.

Image result for kcr

టీఆర్‌ఎస్‌ కార్యాలయాల కోసం ఇప్పటికే 28 చోట్ల ఎకరానికి మించకుండా భూములు ఇవ్వడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది… కేవలం టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకే భూములిస్తే విమ‌ర్శ‌లు వస్తాయని గుర్తించిన ప్రభుత్వం.. ఇతర పార్టీలకూ ఇవ్వడానికి వీలుగా నూతన విధానాన్ని రూపొందిస్తోంది… ఇప్పటిదాకా పార్టీ కార్యాలయాలకు ట్రస్టుల పేరుతోనే భూములు కేటాయించగా.. ఇకపై పార్టీలకే భూములు ఇవ్వనున్నారు. ఏపీలో కూడా ఇటీవలే రాజకీయ పార్టీలకు చట్టసభల్లో బలం ఆధారంగా భూములను లీజుకు ఇవ్వడానికి పాలసీ తెచ్చారు. అలా కాకుండా నామమాత్రపు విలువతో పార్టీలకు భూములివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది… ఈ మేరకు త్వరలోనే పార్టీలకు లేఖలు రాయనుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక త్వ‌ర‌గా రాజ‌కీయ పార్టీలు భూములు కొనుక్కోవ‌డానికి రెడీ అవుతున్నాయి … ఇక నియోజ‌క‌వ‌ర్గాల స్ధాయి నుంచి జిల్లా స్ధాయి రాష్ట్ర స్దాయి కార్యాల‌యాలకు, కేవ‌లం గ‌జం వంద రూపాయ‌ల‌కు నామ‌మాత్ర‌పు విలువ‌కుభూములు వ‌స్తున్నాయి అంటే ఎవ‌రు వద్దు అంటారు చెప్పండి?.. స‌ర్కారు తీసుకున్న ఈనిర్ణ‌యం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.