లేడీస్ హాస్టల్ మొత్తం వాళ్ళకి తెలీకుండా సిసి కెమెరాలు పెట్టాడు.. చివరికి ఏమైందో చూడండి

399

ఇప్పుడు మ‌హిళ‌లు త‌మ భ‌ద్ర‌త కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ కు వెళ్లిన స‌మ‌యంలో డ్ర‌స్ చేంజ్ చేసుకునే చోట వారిని సీక్రెట్ కెమెరాలు బంధిస్తున్నాయి.. అందుకే వారు చాలా జాగ్ర‌త్తలు ప‌డుతున్నారు. ఇక హాస్ట‌ల్స్ లో కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న వారు కొంద‌రు ఇటీవ‌ల పోలీసుల‌కు ప‌ట్టుబ‌డుతున్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. ఓ భవనంలో రహస్య కెమెరాలు పెట్టి.. మహిళా హాస్టల్ నడుపుతున్న వ్యవహారం చెన్నైలో వెలుగులోకి వచ్చింది…ఆదంబాక్కంలోని ఓ మహిళా హాస్టల్లో పలు రహస్య కెమెరాలు బయటపడ్డాయి.

Image result for cc camera in ladies hostel

సంపత్ కుమార్ అలియాస్ సంజయ్ కొన్ని ఇళ్లను అద్దెకు తీసుకుని మహిళా హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఈ హాస్టల్లో చాలా మంది ఉద్యోగిణులు ఉంటున్నారు.. ఈ స‌మ‌యంలో ఇత‌ను చేసిన బాగోతం బ‌య‌ట‌ప‌డింది…సోమవారం ఓ మహిళ హెయిర్ డ్రయ్యర్ వినియోగించుకోవాలని చూసి.. దాన్ని కరెంట్ ప్లగ్‌కు తగిలించారు. కాసేపటికి ఆ ప్లగ్ సాకెట్ ఊడిపోయింది. అప్పుడు ఆ సాకెట్ వెనుకాల బ్యాటరీ సాయంతో నడిచే ఓ పరికరం ఉన్నట్లు ఆ మహిళ గుర్తించారు.

Related image

తర్వాత అది రహస్య కెమెరా అని తేలడంతో ఆమె షాక్‌కు గురై వెంటనే ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది…పోలీసులు వచ్చి ఆ హాస్టల్ భవనంలో తనిఖీలు జరుపగా.. పలు రహస్య కెమెరాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు హాస్టల్ యజమాని సంపత్ కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఓ మహిళ హెయిర్ డ్రయ్యర్ వినియోగిస్తుండగా పవర్ సాకెట్ వెనుక రహస్య కెమెరా గుర్తించారు. తర్వాత ఇతర స్విచ్ బాక్సులను తనిఖీ చేయగా.. అక్కడా కొన్ని కెమెరాలు బయటపడ్డాయి. దీంతో ఆ మహిళల ఫిర్యాదు చేశారు అని పోలీసులు చెప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇప్పటి వరకూ తాము ఆరు కెమెరాలను గుర్తించామని ఈ హాస్టల్ 15 రోజుల కిందటనే ప్రారంభమైందని తెలిపారు…సంపత్ బహుళ అంతస్థు భవనాన్ని అద్దెకు తీసుకుని ఇలా చేశారని పోలీసులు వివరించారు. సంపత్‌పై ఐటీ చట్టం, మహిళలపై వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తమ వద్ద చాలా వివరాలున్నాయని.. మహిళలు భయపడుతున్నందున వాటిని వెల్లడించలేమని చెప్పారు. అయితే ఇలా సీక్రెట్ గా కెమెరాల ద్వారా తీసిన వీడియోలు ఫోటోలు బ‌య‌ట సైట్స్ కు, కొంద‌రు యువ‌కుల‌కు అత‌ను అమ్ముతున్న‌ట్లు తెలుసుకున్నారు పోలీసులు… ఇవి ఎవరు అయితే కొంటున్నారో వారి గురించి తెలుసుకుంటున్నారు పోలీసులు. సుమారు 20 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ ఇలా అమ్మాయిల ఫోటోలు వీడియోలు అమ్మి డ‌బ్బులు సంపాదించాడు అని పోలీసులు విచార‌ణ‌లో తేలింది అని తెలుస్తోంది. చూశారుగా ఇలాంటి కేటుగాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.