భర్తకి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులకు కక్కుర్తి పడి..ఇంటి డ్రైవర్ తో కలసి ఈ మహాతల్లి ఏం చేసిందో తెలిస్తే నరికేస్తారు

7066

రోజురోజుకు ఆడవాళ్ళూ ఎంత భయంకరంగా తయారవుతున్నారంటే డబ్బు కోసం అక్రమ సంబంధాల కోసం కట్టుకున్న భర్తలనే అతి కిరాతకంగా చంపేందుకు సిద్దపడుతున్నారు.తాళి కట్టిన భర్త అన్న కనికరం లేకుండా చాలా దారుణంగా వారిని చంపేస్తున్నారు.ఇప్పుడు మరొక ఇల్లాలు బరితెగించింది. కిరాయి హంతకులతో కలిసి కట్టుకున్నోడిని ఖతం చేసింది. భర్త చస్తే ఉద్యోగం, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఆశపడింది.హత్యకు తనే ప్లాన్ గీసి ఇచ్చింది.కానీ కథ అడ్డం తిరిగింది.అసలేం జరిగింది.భర్తనే చంపాలనుకుంది అంటే వారి మధ్య ఏం జరిగింది.పూర్తీగా చెబుతా వినండి.

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడా గ్రామంలో కేశవ నాయక్‌ అనే వ్యక్తి జీవిస్తున్నాడు. . పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న కేశవ నాయక్‌ కు 20 ఏళ్ల క్రితం కేతవత్ పద్మతో పెళ్లయింది.అయితే కొన్నేళ్ళకు వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కోర్టుకు వెళ్లారు. మరోవైపు శైలజను రెండో పెళ్లి చేసుకున్నాడు కేశవ నాయక్. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తనను పట్టించుకోవడం లేదని పద్మ ఆగ్రహంతో రగిలిపోయింది. ఎలాగైనా భర్తను చంపితే అతడి ఉద్యోగం, అతడి పేరున ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని భావించింది. భర్తను చంపడానికి అతడి దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వినోద్‌కు సుపారీ ఇచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల్లో 10 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అడ్వాన్స్‌గా 15 వేలు ఇచ్చింది. భర్తను ఎలా మర్డర్ చేయాలో కూడా పద్మనే వినోద్‌కు వివరించింది. అనుకున్నట్లే ఈ నెల ఒకటిన కేశవ నాయక్‌ను మర్డర్ చేశాడు వినోద్. ఆ తర్వాత యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు.

కారులోనే హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఇంజపూర్ కామన్ దగ్గర ఉన్న హై టెన్షన్ స్తంభానికి కారును ఢీకొట్టి యాక్సిడెంట్‌ చేశాడు వినోద్. దాన్ని ప్రమాదంగా చిత్రించి తప్పించుకునే ప్రయత్నం చేశారు.కానీ డెడ్‌ బాడీని హాస్పిటల్‌కు తరలించేటప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది. చివరికి వాళ్ల డౌట్ నిజమైంది. ఇది యాక్సిడెంట్ కాదు హత్యే అని తేల్చారు.అంతేకాదు తన భర్త కారు యాక్సిడెంట్‌లో చనిపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పద్మ. కేసును తప్పుదోవ పట్టించాలనుకుంది. కానీ కేశవ నాయక్‌ మెడపై ఉన్న గుర్తులను బట్టి ఇది మర్డర్ అని తేల్చారు పోలీసులు. ఏ1గా వినోద్, ఏ2గా పద్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.విన్నారుగా డబ్బు కోసం భర్తను ఎలా హతమార్చిందో.ఇలాంటి భార్య కనుక అందరికి ఉంటె వారి సంగతి ఇక అంతే సంగతి కదా.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు