పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్.. 300 మంది పాక్‌‌ ఉగ్రవాదులను హతం చేసిన భారత సైన్యం

401

పుల్వామా ఉగ్రదాడికి సరైన గుణపాఠం చెప్పాలని కృత‌నిశ్చయంతో ఉన్న సైన్యం మరోసారి సర్జికల్ దాడులు చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులతో విరుచుకుపడింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలతో ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌ పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్‌లోని పంఖ్తుఖ్వా ప్రావిన్సుల్లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా సర్జికల్ దాడులు చేసింది. నియంత్రణ రేఖకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంపై మిరాజ్ 2000 విమానాలతో విరుచుకుపడింది. భారత వాయుసేన దాడుల్లో దాదాపు 200 నుంచి 300 వరకు మరణించినట్లు సమాచారం.

Image result for pulawama

వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు బాలకోట్, చకోటి, ముజఫరాబాద్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌కు చెందిన అల్ఫా-3 కంట్రోల్ రూమ్‌లు ధ్వంసమయ్యాయని తెలిపాయి. ఈ దాడులను ధ్రువీకరిస్తూ పాకిస్థాన్ సైన్యం ట్వీట్ చేసింది. భారత యుద్ధ విమానాలు పేలోడ్‌కు పాల్పడినట్టు ఫోటోలను పాక్ ఆర్మీకి చెందిన మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఉరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి తర్వాత 2016 సెప్టెంబరు 28న భారత్ సర్జికల్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ క్రింది వీడియో చూడండి 

‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం ముజఫరాబాద్ సెక్టార్ నుంచి చొచ్చుకొచ్చిందని, దీనిపై అప్రమత్తమైన తమ వైమానిక దళం భారత విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించింది. అయితే, అది త్రుటిలో తప్పించుకుందని, తాము ప్రయోగించిన బాంబు బాలాకోట్ సమీపంలో కూలింది. ఇందులో ఎవరూ గాయపడలేదు’ అంటూ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. నియంత్రణ రేఖను అతక్రమించిన భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి వచ్చాయి… పాకిస్థాన్ వైమానిక దళం తక్షణమే స్పందించడంతో అది వెనుదిరిగింది అంటూ మరో ట్వీట్ చేశాడు. చూడాలి మరి ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుంధో. ప్రపంచ దేశాలు దీని మీద ఏమంటాయో. మరి మీరేమంటారు. భారత్ ప్రతీకార చర్య గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.