భర్త దుబాయ్ కు వెళ్ళిపోయాడు. కొడుకు ఆరోగ్యం చెడిపోయింది.. ఈ మహిళ కష్టం తెలిస్తే కన్నీళ్లాగవు…

238

ప్రస్తుత కాలంలో అంతా రోగాల మయమే. రోజుకొక వ్యాధి పుట్టుకొస్తుంది. ఎక్కడి నుంచి ఏ వ్యాధి వస్తుందో కూడా కనిపెట్టడం కష్టమవుతుంది. అంతలా విచిత్ర వ్యాధులు వస్తున్నాయి. వాటి గురించి వింటేనే ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. అలాంటి ఒక వ్యాధి పెద్దవాళ్లకు వస్తేనే తట్టుకోలేరు ఇక చిన్న పిల్లలు ఎలా తట్టుకుంటారో ఆలోచించండి. ఇప్పుడు ఒక చిన్నారికి అలాంటి వ్యాధే ఒకటి వచ్చింది.

Related image

కూలీ నాలీ చేసుకుని పూట గడిస్తే చాలు అనే పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబంలో అంతులేని సమస్య ఏర్పడింది. తల్లిదండ్రులు ఆహోరాత్రులు చిన్నారిని పట్టుకుని ఆస్ప త్రుల చుట్టూ తిరుగుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడికి అరుదైన వ్యాధి సోకడంతో ఆ నిరుపేద కుటుబం లబోదిబోమంటున్నారు. వివరాలలోకి వెళ్తే.. జగిత్యాల మం డలం హస్నాబాద్‌కు చెందిన నిరుపేద కుటుంబమైన వావిలాల సంతోష్‌-రాధ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు వావిలాల ఆదిత్య (6) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. తండ్రి సంతోష్‌ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లగా అక్కడ పని సరిగ్గా లేక అప్పుల పాలయ్యాడు. తల్లి బీడీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నివాసం ఉంటున్న ఇల్లు తప్ప, వేరే ఆస్తులు లేకపోవడంతో వారి కుటుంబ పరిస్థితి చాలా ధీన స్థితిలో ఉంది.

గత కొంత కాలంగా ఆదిత్య అప్లాస్టిక్‌ అనీమియా వ్యాధితో బాధ పడుతున్నాడు. దీంతో పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ‘బోన్‌ మ్యారో’ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ (ఎముకనుజ్జు మార్పు) ఆపరేషన్‌ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చికిత్స కోసం రూ.15 లక్షల వరకు గ్రామంలో అప్పులు చేసి వెచ్చించగా ఆపరేషన్‌ చేయడానికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు కు టుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆదిత్యకు ఆపరేషన్‌ చేయించే స్థోమత లేని దంపతులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు ఖాతా నెంబర్‌ 52208885549 (ఐఎఫ్‌సీకోడ్‌ ఎస్‌బీఐవై 0021439లో డబ్బులు జమచేయాలని, 8374571169, 87907 39300 సెల్‌ నెంబర్లలో సంప్రదించాలని వారు కోరుతున్నారు.ఆ పిల్లాడికి ఏమి కాకుడదని కోరుకుందాం. అలాగే మీకు తోచినంత ఆ చిన్నారికి ఇచ్చి హెల్ప్ చెయ్యండి అని మా ఛానల్ తరుపున కోరుతున్నాం.