ఫేస్ బుక్ లో భార్య ఫోటో పెట్టి భర్త పోస్ట్… మొత్తం వీడియో చూస్తే ఏడుపు ఆగదు

376

ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప బంధం ఏమిటంటే భార్యాభర్తల బంధం. ఒకరికి ఒకరు సంబంధం ఉండదు. కానీ పెళ్లి అనే దానితో ఒకరికి ఒకరుగా మారుతారు. పెళ్లి చేసుకున్న క్షణం నుంచి వాళ్ళే మన లోకం. అయితే అలా తొండుండాల్సిన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళు మనల్ని వదిలివెళ్లడానికి కారణం మనమే అయితే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక భర్తకు అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చెప్పబోయే విషయం భార్యను కోల్పోయిన ఓ భర్త ఆవేద‌న‌, 14 రోజుల న‌ర‌క‌యాత‌న‌. అసలేం జరిగిందో అత‌డి మాటల్లోనే విందాం.

ఈ క్రింది వీడియో చూడండి

“జ‌న‌వ‌రి 7 వ‌తేది సాయంత్రం 6 గంట‌ల ప్రాంతంలో నా బైక్ మీద నేను , నా భార్య వెళుతున్నాము, త‌మిళ‌నాడు లోని అన్నాన‌గ‌ర్ ద‌గ్గ‌ర నా భార్య బండి మీదినుండి కింద‌ప‌డి స్పృహ త‌ప్పిపోయింది. వెంట‌నే ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లా, సిటీ స్కాన్ చేసిన డాక్ట‌ర్లు మెద‌డు ఎడ‌మ‌వైపు ఉబ్బుతుంది, బ‌త‌క‌డం క‌ష్టం అని చెప్పారు. వెంట‌నే అక్క‌డి నుండి ఓ కార్పోరేట్ హాస్పిట‌ల్ లో చేర్పించా.స‌ర్జ‌రీ చేసిన త‌ర్వాత‌ ఆమె మెద‌డు క్ర‌మంగా స్పందించ‌డ‌మే మానేసింది, అదే స‌మ‌యంలో నా భార్య 5 నెల‌ల గ‌ర్బావ‌తి. త‌ల్లి కోమాలో, పిండం క‌డుపులో ఇద్ద‌రూ బ‌త‌కడం కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ అయిదు రోజుల త‌ర్వాత నా భార్య క‌డుపులోని నా కొడుకు చ‌నిపోయాడు. క‌న్ను తెరిచి లోకాన్ని కూడా చూడ‌కుండా వాడు అనంత‌లోకాలకు వెల్లిపోయాడు. నీ భార్య‌ది బ్రెయిన్ డెడ్ అని ధృవీక‌రించారు డాక్ట‌ర్లు.

Image result for ఫేస్ బుక్ లో భార్య ఫోటో పెట్టి భర్త పోస్ట్..

అవ‌య‌వ‌ధానం గురించి గ‌తంలోనే మేమిద్ద‌రం మాట్లాడుకున్నాం. ఏడుస్తూనే ఆర్గాన్ డొనేష‌న్ పేప‌ర్ పై సంత‌కం చేశా… జ‌న‌వ‌రి 13 న నా భార్య న‌న్ను విడిచిపోయింది. ఇది జ‌న‌వరి 1న నా భార్య తో క‌లిసి దిగిన చివ‌రి సెల్పీ. ఇంత బాధ‌లో కూడా ఈ విషయం మీకెందుకు చెబుతున్నానంటే..బైక్ న‌డిపేట‌ప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నాను, కానీ నా భార్య పెట్టుకోలేదు. నా భార్య‌కు కూడా ఓ హెల్మెట్ ఇప్పించి ఉంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఉమ‌( నా భార్య‌) ను నేను కోల్పోయేవాడిని కాదు. అందుకే భ‌ద్ర‌త ముఖ్యం. ఒక్క చిన్న అజాగ్ర‌త్త నా జీవితాన్నే నా నుండి దూరం చేసింది. ఉమ I Miss You Raaa, I Miss You.ఇదండీ భార్యను కోల్పోయిన ఒక భర్త భాదపడుతూ పెట్టిన పోస్ట్. వింటుంటేనే చాలా భాదగా ఉంది కదా. కాబట్టి మీరు కూడా బైక్ మీద ర్యాష్ గా డ్రైవ్ చెయ్యకండి. అతివేగం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. మరి ఫేస్ బుక్ లో ఈ భర్త పెట్టిన పోస్ట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.