భ‌ర్త ప్రియుడి ద‌గ్గ‌ర 2 కోట్లు కొట్టేసిన భార్య‌

370

డ‌బ్బు మ‌నిషికి స్నేహ‌న్ని ఇస్తుంది మ‌నిషిని దూరం కూడా చేస్తుంది.. అందుకే మనిషికి మ‌హా చెడ్డ‌ది డ‌బ్బు అని చెబుతారు.. మ‌రి ఈ డ‌బ్బు ఎలాంటి ప‌ని అయినా చేయిస్తుంది అనేది, నాటి నుంచి నేటి వ‌ర‌కూ మ‌న పెద్ద‌లుచెబుతూనే ఉంటారు. డబ్బుపై ఉన్న వ్యామోహం మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. బ్రెయిర్ ‌క్యాన్సర్‌ పేరుతో ఓ యువతి సొంత కుటుంబాన్నే మోసం చేసింది. క్యాన్సర్ ఉందని చికిత్స చేయించుకోవాలంటూ ఒకటి కాదు రెండు కాదు 2,50,000 పౌండ్లు దోచుకుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.2 కోట్ల పైమాటే. భారత్‌కు చెందిన జాస్మిన్‌ మిస్త్రీ అనే యువతి తన భర్త విజయ్‌తో కలిసి యూకేలో ఉంటోంది. అప్పటికే జాస్మిన్‌కు మరో వ్యక్తితో వివాహమై విడిపోయింది.

Image result for WIFE AND HUSBAND

ఈ నేపథ్యంలో 2013లో విజయ్‌కు ఓ నెంబర్‌ నుంచి వాట్సాప్‌నకు మెసేజ్‌ వచ్చింది. అందులో జాస్మిన్‌కు బ్రెయిన్‌ క్యాన్సర్‌ ఉందని, చికిత్సకు డబ్బు కావాలని రాసుంది. ఆ మెసేజ్‌ చేసింది జాస్మిన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుడేమో అనుకుని విజయ్‌ అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాడు. అంతటితో ఆగకుండా 2014లో జాస్మిన్‌ మరో సిమ్‌ నుంచి తన మాజీ భర్తకు మెసేజ్‌ చేసింది. తనకు క్యాన్సర్‌ వ్యాధి ముదిరిందని, మెరుగైన చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లాలని 50,000 పౌండ్లు ఖర్చవుతుందని పేర్కొంది. తన బ్రెయిన్‌ స్కానింగ్‌ ఫొటోను కూడా పంపించింది. మాజీ భార్యే అయినప్పటికీ అతను సాయం చేయడానికి వెనుకాడలేదు.

కానీ జాస్మిన్‌ మోసం గతేడాది బయటపడింది. జాస్మిన్‌ అనారోగ్య పరిస్థితి గురించి ఆమె మాజీ భర్త వైద్యురాలైన తన స్నేహితురాలికి చెప్పాడు. జాస్మిన్‌ తనకు పంపిన ఫొటోను స్కానింగ్‌ ఫొటో కూడా పంపించాడు. అయితే ఆ బ్రెయిన్‌ స్కాన్‌ ఫొటోను గూగుల్‌లో చూశానని సదరు వైద్యురాలు చెప్పడంతో అతను కంగుతిన్నాడు. వెంటనే జాస్మిన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా సిమ్‌ కార్డులు మారుస్తూ కుటుంబీకులకు, స్నేహితులకు క్యాన్సర్‌ పేరు చెప్పి దాదాపు రూ.2 కోట్ల వరకు డబ్బు దోచుకున్నట్లు తేలింది. ఈ కేసు విషయపై తాజాగా యూకే న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ నిందితురాలికి నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఇంత‌కీ ఆమె ఈ డ‌బ్బుని త‌న విలాసాల కోసం వాడుకుంది అని తేల్చారు పోలీసులు, మ‌రి చూశారుగా ఈమెచేసిన ప‌నికి ఎలాంటి శిక్ష ప‌డిందో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.