150 రూపాయల కోసం కక్కుర్తి పడి 800 కోట్లు పోగొట్టుకున్నాడు.ఎలాగో తెలిస్తే వీడేమి మనిషిరా అంటారు.

1343

ఎవడైనా 150 రూపాయలకు కక్కుర్తి పడి 800 కోట్ల రూపాయాలు పోగొట్టుకుంటాడా..కానీ ఒక వ్యక్తి 150 రూపాయలకు కక్కుర్తి పడి 800 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు.ఎవరికైనా ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకుడదు.ఒక వ్యక్తి ఎలాంటి ఇన్కంటాక్స్ కట్టకుండా దగ్గర దగ్గర 800 కోట్లు జమ చేసిండు.కానీ అతను చేసిన ఒక చిన్న పనికి మొత్తం ఊడ్చుకుపోయింది.150 రూపాయల కోసం అన్ని కోట్లు ఎలా పోగొట్టుకున్నాడు అని ఆలోచిస్తున్నారా.ఇతని కథ కొంత గమ్మత్తుగా ఉంటుంది.మరి ఎలా పోగొట్టుకున్నాడో చూద్దామా.

Image result for 100 and 50 rupee note

అదోక క్లబ్బు… పేరు ది బౌరింగ్‌ క్లబ్‌. అక్కడ ‌ బ్యాడ్మింటన్ కోర్టు ఉంది. అందులో చాలా లాకర్లు ఉన్నాయి. వాటిని అక్రమార్జనకు అడ్డాగా మర్చుకున్నాడో కుబేరుడు.ఆ కుభేరుడి పేరు అవినాశ్ అమల్‌లాల్ కుక్రేజా.ఇతని దగ్గర దగ్గర దగ్గర 800 కోట్ల రూపాయల ఆస్తి ఉంది.ఇతను ఎంత పిసినారి అంటే చెప్పడానికి కూడా మాటలు రానంత పిసినారి.అంత సంపాదించినా కూడా ఇన్కంటాక్స్ కట్టడు.మొత్తం దొంగాసోమ్మే.అయితే క్లబ్బులో అతనికి మూడు లాకర్లు ఉన్నాయి. ఒక్కో లాకరుకు నెలకు రూ. 50 కడుతున్నాడు.వాటిలో అతని దగ్గర ఉన్న వజ్రాలు, క్యాష్ గట్రా దాచుకున్నాడు. అయితే నెలనెలా లాకర్లకు అద్దెలు ఎందుకు కట్టాలి? వాటి తాళాలు తన వద్దే ఉన్నాయి కనుక సొమ్ము భద్రంగా ఉంటుందని అద్దె ఎగ్గొట్టాడు.ఇతని పిసితనం గురించి తెలియజేయ్యడానికి ఇదొక ఉదాహరణ.

అయితే అద్దె చెల్లించాలని క్లబ్బు యాజమాన్యం అతన్ని పలుసార్లు కోరింది. అయినా పట్టించుకోలేదు. విసుగెత్తిన క్లబ్బు సిబ్బంది.. కుక్రేజా లాకర్లను వేరే వారికి కేటాయించేందుకు ఈ నెల 21న వాటిని బద్దలుకొట్టారు. లోపల కనిపించిన కనక, వజ్ర, క్యాష్, దస్తావేజుల మహాలక్ష్ములను చూసి నోరెళ్లబెట్టారు ఆ క్లబ్ యాజమాన్యం.తన లాకర్ పగలగొట్టారన్న విషయం కుబేరుడికి చేరింది. హుటాహుటిన వచ్చేశాడు. నగదు తీసుకుని, ఆస్తి పత్రాలను తనకివ్వాలని, ఒక్కో డాక్యుమెంటుకు రూ. 5 కోట్లు ఇస్తానని బేరంపెట్టాడు. విషయం ఐటీ అధికారులకు చేరింది. రూ.3.96 కోట్ల నగదు, రూ. 8 కోట్లు విలువైన వజ్రాలు, రూ. 800 కోట్లు విలువైన ఆస్తిపత్రాలు, బ్లాంక్‌ చెక్కులు బయటపడ్డాయి. అతనిపై కేసు పెట్టి రేపోమాపో జైల్లోకి నెట్టనున్నారు.చూశారుగా అతని అత్యాశే అతని కొంపను ఎలా మూసివేసిందో.అతని పిసితనమే అతని జీవితాన్ని ఎలా నాశనం చేసిందో.కాబట్టి పిసితనం అత్యాశ లాంటివి అస్సలు ఉంచుకోకండి.మరి ఈ వ్యక్తి గురించి ఇతను ఇన్కంటాక్స్ ను మోసం చేసి కూడబెట్టిన డబ్బు చివరికి దొరికిన విధానం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

తమ్ముడా..కాంగ్రెస్సా..చిరు దారెటు..?