ఆ అమ్మాయిల హ‌స్ట‌ల్ ద‌గ్గ‌ర‌కు ల‌గ్జ‌రీ కార్లు వ‌స్తాయి ఆ త‌ర్వాత జ‌రిగేది చూస్తే మతిపోవ‌డం ఖాయం

968

యూపీలో జ‌రిగిన దారుణమైన ఘ‌ట‌న ఇంకా అక్క‌డ ప్ర‌జ‌ల‌ను యావ‌త్ దేశాన్ని ఆశ్చ‌ర్యం నుంచి తేరుకోకుండానే మార్చింది.. బాలిక‌ల పై ఇంత క‌ర్క‌సంగా వ్య‌వ‌హ‌రిస్తారా అని అంద‌రూ క‌న్నీరు పెట్టుకున్నారు…ఉత్తర్ ప్రదేశ్‌లో దేవరియా జిల్లాలోని బాలికల సంరక్షణ గృహంలో బాలికలపై లైంగిక వేధింపుల అంశం దేశాన్ని క‌లిచివేసింది అనే చెప్పాలి….బాలికలపై లైంగిక వేధింపులు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. జిల్లా మేజిస్ట్రేట్‌ను ఇప్ప‌టికే ఈ కేసు విష‌యంలో తొలగించింది.. అలాగే బాలికల సంరక్షణ గృహం నడుపుతున్న ఇద్దరిని అరెస్టు కూడా చేశారు.

Related imageకానీ చట్టవిరుద్ధంగా నడుపుతున్న ఈ సంరక్షణ గృహంలో పోలీసులే స్వయంగా బాలికలను తీసుకొచ్చి ఎందుకు వదిలేవారు అనేదానిపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి..ఈ సంరక్షణ గృహం, దేవరియా రైల్వే స్టేషన్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఒక పాత భవనం మొదటి అంతస్తులో ఉంది. దీనిని ప్రస్తుతం అధికారులు సీల్ చేశారు. అక్కడ ఉన్న వారు పారిపోయారు లేదా పారిపోయేలా చేశారా అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు.ఈ వింధ్యావాసిని బాలికా సంరక్షణ గృహం భవనం ప‌క్క‌వారు ఇక్క‌డ అమ్మాయిల ఏడుపులు ఏ నాడు వినిపించేవి కావ‌ని వారు బాగానే ఉండేవార‌ని తెలియ‌చేస్తున్నారు.. ఎటువంటి అనుమానం రాకుండా వారు ఇలాచేశారా అని కూడా ఆలోచిస్తున్నారు.. పిల్ల‌లు స్కూళ్ కి కూడా వెళ్లేవార‌ని ప‌క్క ఇంటి స‌భ్యులు చెబుతున్నారు.

Image result for ladies hostel hyd

ఇక్క‌డ పిల్ల‌ల‌తో వాళ్లంతా పిక్నిక్‌కి వెళ్లడం కూడా మేం చూశాం అని స్దానికులు చెబుతున్నారు.గిరీజా త్రిపాఠి, ఆమె భర్త బాలికల హాస్టలుతోపాటు కుటుంబ సలహాల కేంద్రం కూడా నడిపేవారని, వాటి ద్వారా వాళ్లు చాలా కుటుంబాలను కలుస్తూ ఉండేవారని,అక్క‌డ వారు తెలియ‌చేశారు…చక్కెర మిల్లులో మామూలు ఉద్యోగం చేసే గిరిజా త్రిపాఠి భర్త ఇప్పుడు కోట్లు సంపాదించారని మణిశంకర్ మిశ్రా చెప్పారు. ఆయన ఇలాంటి ఎన్నో సంస్థలు నడుపుతున్నారని తెలిపారు.వాళ్లు పిల్లలను దత్తత ఇస్తారు, తమ దగ్గర ఉన్నవారికి పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇప్ప‌టికే కేంద్రంలో కనిపించడం లేదని చెబుతున్న 18 మంది బాలికలను వాళ్లు అలా ఎక్కడికైనా పంపించి ఉండచ్చు అని చెబుతున్నారు వాళ్లు వారిని అమ్మేశారా లేదా పెళ్లిచేశారా అనేదానిపై విచార‌ణ‌ జ‌రుగుతోంది.. మ‌రో దారుణ‌మైన విష‌యం ఇక్క‌డ‌కు ల‌గ్జీరీ కార్ల‌పై యువ‌కులు పెద్ద‌వారు న‌డివ‌య‌సు మ‌గ‌వారు వ‌చ్చేవార‌ని, వారు ఎందుకు వ‌చ్చేవారో తెలియ‌ద‌ని రోజూ చాలా మంది వ‌చ్చేవార‌ని చెబుతున్నారు స్థానికులు. అయితే ఇక్క‌డ అటువంటి అనైతిక కార్య‌క్ర‌మాలు ఆ పిల్ల‌ల‌తో చేశారా అనేది కూడా తెలుసుకోనున్నారు… మొత్తానికి ఇలా అనాధ బాలిక‌ల‌పై అకృత్యాలు వెలుగులోకి రావ‌డంతో ఇలాంటి గృహాల‌ను న‌మ్మాలా వ‌ద్దా అనే ఆలోచన కూడా స‌మాజంలో పెరిగిపోయింది…. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.