పాఠశాల టాయిలెట్ లోనే ప్రసవించిన బాలిక.. కడుపు చేసింది ఎవరో తెలిస్తే షాక్..

367

అన్నా, చెల్లి.. అక్కా, తమ్ముడు.. ఇవన్నీ పవిత్రమైన మానవ సంబంధాలు. తోడబుట్టిన వారికి జీవితాంతం తోడుగా ఉండాలి. రక్తం పంచుకు పుట్టిన వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ప్రాణానికి ప్రాణంలా చూసుకోవాల్సిన కనుపాపే కాటేస్తోంది. తమ అవసరాల కోసం విలాసాల కోసం కాసుల కక్కుర్తితో మనిషి మనిషినే వాడేసుకుంటున్న రోజులువి. ఇలాంటి దారుణ ఘటన ఒకటి హైటెక్ సిటీగా చెప్పుకుంటున్న హైదరాబాద్ లో జరిగింది. మానవ సంబంధాలకే మాయని మచ్చ తెచ్చింది. మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా..

Image result for pregnancy

మాదాపూర్ లోని హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక(14).. స్కూల్ లోనే ప్రసవించడం కలకలం రేపుతోంది. రోజూలానే స్కూల్ కు వచ్చి క్లాస్ రూమ్ లో కూర్చున్న ఆ బాలిక..కడుపు నొప్పి రావడంతో పర్మిషన్ తీసుకుని టాయిలెట్ కు వెళ్లింది. అక్కడ ఓ బిడ్డను ప్రసవించింది. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, టీచర్లు షాక్ తిన్నారు. వారు అంతగా షాక్ తినడానికి కారణం ఏంటంటే..ఆ బాలిక గర్భం దాల్చిన విషయమే వారికి తెలియదట.స్కూల్ లో మైనర్ ప్రసవం చర్చకు దారి తీసింది. విషయం పెద్దది కావడంతో విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. నేరుగా ఆ స్కూల్ కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం టీచర్ల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ… హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడిని, శేరిలింగంపల్లి MEO బసవలింగంను సస్పెండ్ చేశారు. దాంతో పాటు 10మంది స్కూల్ టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. బాలిక గర్భం దాల్చిన విషయాన్ని ఇంతమంది మహిళా టీచర్లు ఉన్నా కనిపెట్టలేకపోవడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టీచర్ల వాదన మరోలా ఉంది. చాలా సన్నగా ఉండే ఆ బాలిక ప్రతి రోజూ దుపట్టా లేదా బ్యాగును తన కడుపుకు అడ్డంగా ఉంచుకునేదని, అందుకే తమకు ఎలాంటి అనుమానాలు కలగలేదని చెబుతున్నారు. బాధితురాలు మాదాపూర్ లోని చంద్రనాయక్ తండాలో నివాసం ఉంటోంది.

మరోవైపు బాలిక ప్రసవించిన ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఈ దారుణానికి బాలిక అక్క అరుణ కారణమని పోలీసులు తేల్చారు. ఆమెపై చీటింగ్ కేసు పెట్టారు. చెడు వ్యసనాలకు బానిస అయిన అరుణ.. డబ్బు కోసం తన చెల్లితో ఇలాంటి తప్పుడు పనులను చేయించినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. అరుణ ఇచ్చిన అలుసుతోనే ధనుష్ అనే వ్యక్తి బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.బడిలోనే పాపకు జన్మనిచ్చిన ఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూమోటోగా కేసు స్వీకరించింది. ఈ ఘటనపై 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి నోటీసులు జారీ చేసింది.సొంత అక్క చేసిన ఆ పాడు పని పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆడపిల్లలకు వీధుల్లోనే కాదు ఇంట్లోనూ రక్షణ కరువైందంటున్నారు. ఆ దుర్మార్గురాలిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏదిఏమైనా మైనర్లపై అత్యాచారాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.మరి ఈ బాలిక ఘటన గురించి అలాగే మైనర్ ఏజ్ లోనే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.