ట్రైన్ కింద పడ్డ అమ్మాయి..అయినా కానీ బతికింది.. వీడియో చూస్తే ఖంగుతింటారు

253

ఇటీవలి కాలంలో ఫోన్ల వల్ల జరుగుతున్న ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు.. కొందరు ఫోటోలు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. ఇంకొందరు ఫోన్లలో మాట్లాడుతూ చుట్టుపక్కల ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోకుండా వెళుతున్నప్పుడు జరగరాని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ముంబై లో చోటుచేసుకుంది. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుదామని ప్రయత్నించినా ఒక యువతిని రైలు గుద్దేసింది. అయినా కానీ ఆ అమ్మాయి బతికింది. మరి ఈ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

ముంబయికి చెందిన పందొమ్మిదేళ్ల ప్రతిక్ష నతేకర్ అనే యువతి కుర్లాలోని రైల్వే స్టేషన్ లో ఫోన్ లో మాట్లాడుతూ పట్టాలు దాటబోయింది. అయితే ట్రాక్ లో ట్రైన్ వస్తున్న సంగతి మరచిపోయింది. అయితే ఆ అమ్మాయిని చూసిన తోటి ప్రయాణీకులు గట్టిగా అరిచారు. అప్పుడు అమ్మాయి అలర్ట్ అయ్యి ప్లాట్ ఫామ్ దగ్గరికి వచ్చింది. కానీ ఎక్కలేకపోతానేమో అనుకుని ట్రాక్ ను దాటేద్దామని అనుకుంది. అప్పటికే సమయం దాటిపోయింది. కానీ ఎటు వెళ్ళాలో తెలియక అటూ ఇటూ పరిగెత్తేలోపే రైలోచ్చేసింది. అప్పటికే ఇది గమనించిన డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ ఆ రైలు ఆ అమ్మాయిని గుద్దేసి ఆమె మీదు గా కొంత దూరం వెళ్ళిపోయి ఆగింది. ఆమె ట్రైన్ కు గుద్దుకుని పట్టాలపై పడిపోయింది. ఆమె మీదుగా రెండు మూడు బోగీలు ప్రయాణించాయి కూడా. చూస్తున్న జనాలంతా హాహాకారాలు చేసారు. అయ్యో పాపం అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది అనుకుకున్నారు. కాని అంత పెద్ద ప్రమాదం జరిగిన కూడా ఆమె చిన్నపాటి గాయాలతో చావు నుంచి బయటపడింది. ఆ అమ్మాయికి, ఎడమ కంటికి చిన్న గాయం తప్పించి ఏమీ కాకపోవటంతో ఈ యాక్సిడెంట్ ఒక అద్భుతంగా మారింది. ఇదంతా రైల్వే స్టేషన్ లోని సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఆసుపత్రిలో చికిత్స చేయించిన రైల్వే పోలీసులు ఆ అమ్మాయిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ అమ్మాయి పట్టాలు దాటే సమయంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణీకులు అన్నారు. ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయింది కానీ ఎదురుగా ట్రైన్ వస్తున్న సంగతి కూడా గమనించలేదని వారు అంటున్నారు. రాసి పెట్టి ఉంటే ఎంత పెద్ద యాక్సిడెంటు నుంచైనా గట్టెక్కుతాం అనే సామెతకు నిలువెత్తు ఉదాహరణ ఈ వార్త. . అమ్మాయికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టే బతికి బట్ట గట్టింది అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. అమ్మాయి అదృష్టమే బాగుందో.. ఆయుశ్శే మిగిలుందో… కానీ, ఇంత పెద్ద ప్రమాదం నుంచి బతికి బయట పడడం మాత్రం నిజంగా అద్భుతం. ప్రతి ఒక్కరూ ఆమె లాగే అదృష్టవంతులు ఉండరు. కాబట్టి ఫోన్ ను పక్కనపెట్టి కాస్త జాగ్రత్తగా మసులుకుంటే బాగుంటుంది. ఒక రైలు పట్టాలపైనే కాదు, రోడ్డు పైన నడిచేటప్పుడు కూడా చాల జాగ్రత్తగా ఉండండి ముంచుకొచ్చే ప్రమాదాన్ని గమనించండి.