వామ్మో మామూలు ఆడది కాదు.. కావాలనే డాక్టర్ చేత నడుముపై చేయి వేయించుకుంది.. తరువాత

224

డాక్టర్ అనేది పవిత్ర ఉద్యోగం. దేవుడి తరువాత మరొక దేవుడిలాంటి వాడు డాక్టర్. డాక్టర్స్ కూడా పేషేంట్స్ ను తప్పుడు ఉద్దేశంతో చూడరు. హెల్త్ బాగొక హాస్పటల్ కి వెళ్లినప్పుడు డాక్టర్లు నోరు తెరవమని, నాలుక బైటికి తీయమని చెప్తుంటారు.అలాగే బాడీలో ఏమైనా పెయిన్స్ ఉంటె ఆయా భాగాలలో వాటిని ముట్టుకుంటారు పట్టుకుంటారు కూడా. అయితే అదంతా వారి డ్యూటీలో భాగమే కానీ తప్పుడు ఉద్దేశం ఉండదు. కానీ ఒక మహిళ డాక్టర్ తనను చెకప్ చేస్తూ నా నడుమును గిల్లాడు అని రచ్చ రచ్చ చేసింది.

Image result for doctor and lady patient

వరంగల్ లో ఆస్పత్రికి నడుం నొప్పి అని వెళ్ళిన ఓ మహిళా డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ రచ్చ రచ్చ చేసింది. తమ బంధువుల పేరుతో కొందరిని తీసుకొచ్చి ఆస్పత్రి పై దాడి చేయించింది. మీడియా ను పిలిపించి నానా హంగామా చేసింది. ఆపై లైంగికంగా వేధించటం మాత్రమే కాదు కులం పేరుతో తిట్టారని ఆ డాక్టర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. అయితే ఈ కేసులో సీసీ కెమెరా ఫుటేజ్ ఆ మహిళ చేసిన పనిని కళ్ళకు కట్టినట్టు చూపింది. దీని వెనుక పెద్ద కుట్ర ఉండనే విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. సుపారీ రీ తీసుకుని ఓ డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆ హాస్పటల్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించింది ఓ కిలాడీ లేడీ . చికిత్స కోసం వచ్చిన తన పట్ల డాక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడని 15 రోజుల క్రితం సంధ్య అనే మహిళ సృష్టించిన వివాదం వరంగల్ లో కలకలం రేపింది . వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్‌ ప్రతిష్టకు భంగం కలిగించాలనే లక్ష్యంతో పధకం పన్నినట్టు తేలింది. వరంగల్‌ బ్యాంకు కాలనీకి చెందిన కె.నాగేశ్వర్‌రావు, అతని మిత్రుడికి బాలాజీ ఆస్పత్రి డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ తో వ్యక్తిగత కక్షలు ఉన్న నేపధ్యంలోనే ఆయన ఈ ప్లాన్ వేసి సుదీర్ కుమార్ పరువు తియ్యాలని అనుకున్నాడు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ క్రమంలో ఆస్పత్రి ప్రతిష్టతో పాటు, డాక్టర్‌ పరువును దెబ్బతీసేందుకు, అతన్నితప్పు డు కేసులో ఇరికించడానికి ప్లాన్‌ వేసిన నాగేశ్వర్ రావు లక్షా 50 వేలకు డీల్‌ కుదుర్చుకున్నాడు. డాక్టర్‌ సుధీర్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైతే మరో రూ.5లక్షలు ఇస్తామని రాంబాబుతో నాగేశ్వర్‌రావు ఒప్పందం చేసుకున్నాడు. ఇక ఆ డీల్ లో భాగంగా 10 మంది పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. ప్లాన్‌ అమలులో భాగంగా ఈ నెల 12న హైదరాబాద్‌కు చెందిన రేవోజు సంధ్య అనే మహిళ వరంగల్‌ ఎస్వీఎన్‌ రోడ్డులోని బాలాజీ ఆస్పత్రికి వచ్చింది. డాక్టర్‌ కె.సుధీర్‌కుమార్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుంది. డాక్టర్‌ చాంబర్‌లోకి వెళ్లిన తర్వాత తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని తెలిపింది. దీంతో డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ ఆమెను పరీక్షించడానికి ప్రయ త్నిస్తుండగా… ఆమె ఎదురుతిరిగి కేకలు వేసింది. బయటకు వచ్చి డాక్టర్‌ తన పట్ల అసభ్యం గా ప్రవర్తించాడని నానా హంగామా సృష్టించింది . మీడియాను పిలిచి హడావిడి చేసింది. అదే సమయంలో ఆమె సంబంధీకులు ఆస్పత్రికి వచ్చి గొడవకు దిగారు.

Image result for doctor and lady patient

డాక్టర్‌పై దాడికి యత్నించారు. ఇదంతా కూడా ప్లాన్ లో భాగమే . పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో మట్టెవాడ పోలీసులు కేసు విచారణ ప్రారంభించగా ఆసక్తికర విషయాలు బయటకువచ్చాయి. డాక్టర్‌ చాంబర్‌లో ఇతర వైద్యసిబ్బంది ఉండటం, సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావడంతో సంధ్య తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కూడా ఆ దిశగా విచారణ చేయడంతో కుట్ర కోణంతో పాటు తెరవెనుక పాత్రధారులు బయటకువచ్చారు. అసభ్యంగా ప్రవర్తించాడని డాక్టర్‌పై చేసిన ఫిర్యాదు అంతా బూటకం అని తేలింది. ఇక ఎంతో ప్లాన్ తో సుధీర్ కుమార్ పరువు తియ్యాలనుకున్న వారి కథ అడ్డం తిరిగింది. దీంతో వారు అడ్డంగా బుక్కయ్యారు . ప్రధాన నిందితుడైన నాగేశ్వర్‌రావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక ఆయనను పట్టుకుంటే అసలేం జరిగింది. ఎందుకు ఇదంతా చేశాడు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. చూశారుగా ఈ మహిళా ఎంత పని చేసిందో. డాక్టర్ ను బుక్కు చేద్దామనుకుని ఆమెనే అడ్డంగా బుక్కైంది. మరి డాక్టర్ కు ఈ మహిళకు మధ్య జరిగిన ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.