ఇంత ఘోరం జ‌రుగుతుంద‌ని పాపం ఆ అమ్మాయి అస్స‌లు అనుకోలేదు

397

స‌ర‌దాగా ఫ్రెండ్స్ తో విహార‌యాత్ర‌ల‌కు వెళితే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.. కొన్ని స‌మ‌యాల‌లో ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా ఆద‌మ‌రిచాము అంటే అంతే సంగ‌తులు, అయితే ఫ్రెండ్స్ తో కొండ ప్రాంతాలు అడ‌వులు న‌దుల్లో స్నానాలు బీచ్ లో స్నానాలు చేయ‌డానికి వెళ్లిన స‌మయంలో ఎలాంటి వింత చేష్ట‌లు చేయ‌కూడ‌దు.. చివ‌ర‌కు అవి ప్రాణాలు పోయే ప‌రిస్దితికి కార‌ణం అవుతాయి.. ఓ వ్య‌క్తిని న‌లుగురు క‌లిసి చెరువులో ముంచారు. చివ‌రికి అత‌ను ఊపిరి ఆడ‌క ఆ నీటిలో మునిగి చ‌నిపోయాడు.. కాని త‌మ‌కు ఏమీ తెలియ‌న‌ట్టు అత‌ను ఈత‌రాక మునిగిపోయాడు అని చెప్పారు.. త‌ర్వాత ఒక‌రి నుంచి మ‌రొక‌రికి ఈ విష‌యం గొడ‌వ‌లు వ‌చ్చిన స‌మ‌యంలో తెలిసింది.

ఇక మ‌రో దారుణ‌మైన సంఘ‌ట‌న ఇటీవ‌ల వాషింగ్ట‌న్ లో జ‌రిగింది, స‌రదాగా కాలేజ్ కి సెల‌వు ఇవ్వ‌డంతో, తన ఫ్రెండ్స్ తో క‌లిసి జోర్డాన్ అనే అమ్మాయి విహార‌యాత్ర‌కు వెళ్లింది.. ఈ స‌మ‌యంలో ఆమె బికిని ధ‌రించి ఓ వాట‌ర్ ఫాల్స్ ద‌గ్గ‌ర నిల‌బ‌డింది.. అయితే ఈ స‌మ‌యంలో అక్క‌డ వాట‌ర్ ఫాల్స్ ద‌గ్గ‌ర పెద్ద ఎత్తున జ‌నం కూడా ఉన్నారు.. కేరింత‌లు కొడుతున్నారు. ఇక ప‌క్క‌న ఉన్నా మ‌రో కొండ ద‌గ్గ‌రకు వెళ్లి జంప్ చేయాలని అనుకున్నారు. కాని ఆమెకు ఈత‌రాదు. అంతేకాదు భ‌యం అని చెప్పింది .కాని కొంద‌రు మాత్రం నువ్వు జంప్ చేయ‌కు పైనుంచి చూడు అని చెప్పారు.. వారి మాట విని ఆమె పైకి వెళ్లింది. అయితే వారు ఎనిమిది మంది వచ్చారు. అప్ప‌టికే ఆరుగురు పైనుంచి కింద‌కి జంప్ చేశారు. ఇక మిగిలింది జోర్డాన్ లెస్సీ అయితే లెస్సీ నెక్ట్ జంప్ చేస్తుంది అని అనుకుంటే ఒక్క‌సారిగా లెస్సీ జోర్డాన్ ని కింద‌కి తోసేసింది.

Image result for girls jumping in hills

దీంతో ఆమె పైనుంచి కింద‌కి ప‌డింది. అనుకోని ఈ ఘ‌ట‌న‌తో ఆమెకి క‌ళ్లుతిరిగాయి అలాగే పైనుంచి కింద ప‌డ‌టంతో ఆమెకు ప‌క్క‌టెముక‌లు విరిగాయి. ఇక సృహ‌కోల్పోవ‌డంతో ఆమెని ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు… అయితే ఇది కావాల‌ని చేసింది కాదు అని ఫ్రెండ్స్ తో ఉన్న స‌మ‌యంలో ఇలా చేశాము అని లెస్సీ తెలిపింది.. మొత్తానికి ఆమె చికిత్స పొందుతోంది, అయితే త‌మ‌కు లెస్సీ ఇలా చేస్తాను అని చెప్పింది అని స్నేహితులు చెబుతున్నారు. నిజంగా ఇలా జోర్డాన్ ని ఏమైనా చంపే ప్ర‌య‌త్నం చేశారా అనే కోణంలో పోలీసులు ముందు కేసు న‌మోదుచేసుకున్నా, త‌ర్వాత పోలీసుల విచార‌ణ‌లో ఆమె సాధార‌ణంగా ఇలాంటి ఘ‌ట‌న‌కు దిగింది అని తెలుసుకుని ఈ కేసు కొట్టివేశారు, చూశారుగా కొన్ని సార్లు అనుకోని సంఘ‌ట‌న‌లు ఎలాంటి ప‌రిస్దితుల‌కు దారితీస్తాయో.