అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇచ్చాడు… బైక్ దిగాకా “థాంక్స్” చెప్తుంది అనుకుంటే అతనికి పెద్ద షాక్ ఇచ్చింది.ఏం చేసిందో తెలిస్తే షాక్..

585

రోడ్డు మీద అమ్మాయి కనపడితే చాలు అబ్బాయిల చూపులు ఆ అమ్మాయి వైపే వెళ్తాయి. ఆ అందమైన అమ్మాయి నా బైక్ ఎక్కితే బాగుంటుంది అని అనుకునే మగాళ్లు ఎందరో. అయితే అనుకోకుండా ఆ అందమైన అమ్మాయే లిఫ్ట్ కావాలని మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుంది. గాల్లో తేలినట్టుంది అనే సాంగ్ ను ఊహల్లో వేసుకుంటారు కదా. అయితే అలా అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగిందని లిఫ్ట్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు జాగ్రత్త పడతారనే అనుకుంటున్నా.. మరి ఆ విషయం ఏమిటో తెలుసుకుందామా.

Image result for girls asking lift

ఆ యువకుడిది హైదరాబాద్. మాసాబ్ ట్యాంక్ దగ్గర నివాసముంటున్నాడు. పని ఉందని మాసాబ్ ట్యాంక్ నుండి హిమాయత్ నగర్ వైపు బయలుదేరాడు తన బైక్ మీద. అది మిట్ట మధ్యాహ్నం. మార్గ మధ్యలో ఓ యువతి లిఫ్ట్ అడిగింది.మధ్యాహ్నం వేళ బస్సులు కూడా సరిగా రావట్లేదని అర్జెంట్ గా వెళ్లాలేమో అని అమ్మాయికి సాయం చేద్దామని లిప్ట్ ఇచ్చాడు. బైక్ మీద వెళ్తూ వెళ్తూ ఇద్దరు మాటలు కలిపారు. ఆ అమ్మాయి ఎంతో ముద్దుగా మాట్లాడింది. ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకున్నారు. మీరు చాలా మంచివారులా ఉన్నారని ఆ అమ్మాయి చెప్తే మనోడి లోపల ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.అలా మాటల్లోనే హిమాయత్ నగర్ చేరుకున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

హిమాయత్ నగర్ బస్సు స్టాప్ కంటే ముందే కొద్ది దూరంలోనే ఆ అమ్మాయిని దించాడు.ఆ అమ్మాయి బైక్ దిగింది. ఆ యువతి యువకుడికి థ్యాంక్స్ చెబుతుందేమో అని అనుకున్నాడు. కానీ బైక్ దిగగానే అమ్మాయి డబ్బులివ్వమంటూ డిమాండ్ చేసింది. దీంతో ఆ యువకుడు షాక్ తిన్నాడు. ఆ అమ్మాయి ఏమన్నదో అనే డౌట్ వచ్చి ఏంటి అని అడిగాడు. నీ జేబులో ఉన్న డబ్బును తీసి నాకు ఇవ్వు అని అడిగాడు. ఏం మాట్లాడుతున్నావ్? నేనెందుకు డబ్బులు ఇవ్వాలి అన్నాడు ఆ యువకుడు. డబ్బులు ఇవ్వకుంటే అరిచి గోల చేస్తా అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ మాటకు అతనికి నోటి నుంచి మాట రాలేదు.అయితే ఆ యువతీ యువకుడు ఇద్దరు ఒకే బైక్ మీద రావడం గమనించిన స్థానికులు అక్కడకు వెళ్లారు. వీళ్లను గుర్తించిన కిలాడి లేడీ అసలుకే మోసం వస్తుందని తెలుసుకొని నెమ్మదిగా జారుకుంది. తర్వాత ఆ యువకుడు జరిగింది స్థానికులకు చెబితే ఆశ్చర్యపోవడం వారి వంతు అయ్యింది. చూశారుగా ఈ యువతీ ఎలా మోసం చేద్దామనుకుందో. అందుకే అందంగా ఉందని అమ్మాయిలు లిఫ్ట్ అడిగితే ఇవ్వకండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అబ్బాయిని బెదిరించి డబ్బులు లాగాలని చుసిన ఈ అమ్మాయి ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.