హీరో హోండా కంపెనీ కే షాకిచ్చిన రైతు.. ఏం చేసాడో చూడండి

468

నెస్సెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని మన పెద్దలు అన్నారు..అంటే అవసరం అనేది కొత్త వాటిని కనిపెట్టడానికి ఉపయోగపడుతుందని అర్థం.నిజమే అవసరాలు అనేవి ఎన్నో ఆవిష్కరణలకు నాంది.ఏదైనా అవసరం ఉంటె మనకు ఎన్నడూ రాని కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి.కొత్త కొత్త ఆవిష్కరణలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న శాస్త్రవేత్తలే చేస్తారనుకుంటే పొరపాటు..మన పల్లెలకు వెళ్లి చూస్తే ఎన్నో పనులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.రైతు పని చేసుకునే రైతులు ఎన్నో ఆవిష్కరణలు చేశారు కూడా.అలా ఒక రైతు చేసిన ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for andhra pradesh farmers on bikes

మనం పల్లెటూరు లకు వెళ్ళినప్పుడు మనకు రోడ్ల మీద వరి,జొన్నలను ఎండపెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు మన రైతులు.అలా ఎందుకు చేస్తారు అంటే..అలా చెయ్యడం వల్ల ఒకవైపు ఎండకి ఎండిపోతాయి. మరోవైపు వెహికిల్స్ వెళ్లడంతో వాటి పొట్టు ఊడిపోతుంది..రెండు పనులు జరిగిపోతాయి. దాంతో వాళ్లకు చాలా పని తగ్గుతుంది.చాలా ఊర్లలో ఇది మనం చూసే ఉంటాం.ఇలాంటి ఐడియాలు అది మన రూరల్ ఇంజినీర్స్ కే వస్తాయి..ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే. ఇప్పుడు మరొక రూరల్ ఇంజనీర్ ఒక కొత్త విషయాన్నీ కనిపెట్టాడు.దాని గురించి తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇతనిది ఏం తెలివిరా బాబు అని అనుకుంటున్నారు.

 

అంత ఆశ్చర్యపోయేది ఏమి కనుగొన్నారు అనుకుంటున్నారా.చెబుతా వినండి.హీరో హొండా బైక్ మీ చేతికి ఇస్తే ఏం చేస్తారు..ఎంచక్కా అటు ఇటు చక్కర్లు కొడతారు.గర్ల్ ఫ్రెండ్ ను వేసుకుని షికారు కు వెళ్తారు కదా.కానీ హీరో హోండా బైక్ తో వేరుశెనగ మొక్క నుండి వేరుశెనగను వేరు చేస్తున్నాడు ఒక రైతు.బైక్ చక్రాన్ని తిప్పి ఆ చక్రం మధ్యలో వేరుశెనగ మొక్కను పెడుతున్నాడు.ఆ చక్రం తిరుగుతూ మొక్క నుంచి వేరుశెనగను వేరు చేస్తుంది.ఒక బైక్ ను ఇలా కూడా వాడుకోవచ్చా అని ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బహుశా బైక్ తో ఇలా చెయ్యొచ్చనే ఆలోచన ఆ హోండా బైక్ కంపెని వాడికి వచ్చుండదు. చాలా ఈజీగా బైక్ ని ఉపయోగించి ఫటాఫట్ తన పని చేసుకుంటున్న ఈ రైతుని చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు.వింటుంటే మీ పరిస్థితి కూడా అలాగే ఉంది కాదు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.బైక్ తో ఈ రైతు చేస్తున్న ఈ పని గురించి అలాగే ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేసే వాళ్ళ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.