దేశచరిత్రలో మొట్టమొదటిసారి అతిపెద్ద నిర్ణయం..

267

దేశం మొత్తం మీద ఇప్పుడు ఒకదాని గురించే చర్చ జరుగుతుంది. అదే పుల్వామాలో ఉగ్రదాడి. ఒకరు కాదు ఇద్దరు కాదు 44 మందిని పొట్టనపెట్టుకుంది ఈ ఉగ్రదాడి. ఈ దాడి తరువాత ఇండియన్ ఆర్మీ చాలా ఆవేశంగా ఉంది. సమయం లేదు సైనికా ఇక యుద్ధం చెయ్యాల్సిందే అని ఇండియన్ ఆర్మీ అంటుంది. పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.తోక జాడిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చేప్పల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది.సుందర కాశ్మీర్ మల్లీ ఆందోళనతో భగ్గుమంటుంది. దేశమంతా ఏకధాటిగా నిలిచి ఉగ్రవాదాని తరిమేయాలని పిడికిలి బిగిస్తుంది.అయితే మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని దేశం మొత్తం ఎదురుచూస్తుంది.

Image result for pulwama

ఇప్పుడు మోడీ ముందు రెండు అప్షన్స్ ఉన్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టిన పాక్ ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ ఆక్రమిత భారత్ లో 2016 సెప్టెంబర్ 29 న చేసినట్టుగా సర్జికల్ స్ట్రైక్ చెయ్యడం లేదా చర్చలు జరపడం చెయ్యాలి. ముందుగా చర్చలు జరిపితే ఏమైనా ప్రయోజనము ఉంటుందా పాకిస్తాన్ లో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య సత్సంబాలు లేవు. తాజా ఘటనతో పాక్ మీద ఎన్నడూ లేనంత ఆగ్రహం మీద ఉంది భారత్. దీంతో భారత్ అమెరికాను ఆశ్రయించే అవకాశం ఉంది. ఒకప్పుడు మిత్రులుగా ఉన్నా కూడా ఇప్పుడు లేదు. పాక్ కు ఆర్థిక సాయం కూడా ఆపేసింది అమెరికా. మేము ఉగ్రవాదాన్ని మానేస్తున్నామని అప్పట్లో పాక్ అమెరికాకు చెప్పి మార్కులు కొట్టేసింది. అయితే ఇప్పుడు మళ్ళి ఉగ్రవాదం మొదలుపెట్టింది కాబట్టి పాక్ మీద అమెరికా సీరియస్ గా ఉంది. ఇక పాక్ కు సపోర్ట్ చేసే చైనా విషయానికి వస్తే పాక్ కు కొన్నేళ్లుగా చైనా అండగా నిలుస్తుంది. ఐక్యరాజ్య సమితి కూడా పాక్ ఉగ్రవాది అయినా మసూద్ ను ఉగ్రవాది అంటే చైనా మాత్రం మంచోడు అని అంది.

Image result for pulwama

మోడీ చైనాతో చర్చలు జరిపిన తరువాత కూడా మసూద్ మంచోడు అనే అంది చైనా. 2001 లో జై షీ మహ్మద్ సంస్థను నిలిపివేయడం జరిగింది. అలాగే మసూద్ ను కూడా నిషేదించాలని భారత్ పట్టుబట్టింది.మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించాలని అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ దేశాలు పట్టుబట్టాయి .అయితే కొన్ని గుడ్డి సాకులు చెప్పి ఒక నిర్ణయం తీసుకోడానికి మరికొంత సమయం కావాలని గత ఏడాది ఆగస్టు లో వెల్లడించింది. అయితే సెప్టెంబర్ లో ఐక్యరాజ్య సమితిలో జరిగిన మీటింగ్ లో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించాలని అంటే చైనా ఒక్కతే దానిని కొట్టిపారేసింది. అతను ఉగ్రదాడి చేశాడనే దానికి సాక్షాలు చూపించాలని అన్నది. ఒకవైపు ఉగ్రవాదానికి వ్యతిరేకం అంటూనే మరొకవైపు చైనా పాక్ కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఆఫ్గనిస్తాన్ తీవ్రవాదులతో పోరాడి పాక్ చాలా కోల్పోయిందని కితాబు కూడా ఇచ్చింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇక ఈ మధ్య జరిగిన భారత్ చైనా చర్చలలో అన్ని విషయాలలో భారత్ కు చైనాకు ఓకే అయినా కానీ మసూద్ విషయంలో మాత్రం సహకరించడం లేదు. ఇక భారత్ ముందున్న రెండవ అప్షన్ సర్జికల్ స్ట్రైక్. గతంలో చాలాసార్లు సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ దళాలను మట్టిలో కలిపేశారు భారత్ దళాలు. అయితే నిరంతర రేఖ దగ్గర ఉన్న స్థావరాలను ధ్వంసం చెయ్యలేదు. దీంతో సర్జికల్ స్ట్రైక్ అసలు జరగలేదని పాక్ ప్రపంచాన్ని నమ్మించి ప్రయత్నించి కొంతవరకు సఫలం అయ్యింది. అంతేకాకుండా సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాక్ భారత్ మీద యుద్దానికి దిగకపోవడంతో భారత్ చెప్పిన సర్జికల్ స్ట్రైక్ జరగలేదని పాక్ అన్ని ప్రపంచ దేశాలకు చెప్పింది.అయితే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తారా లేదా ముచ్చట్లు పెట్టి సమస్యను ముగిస్తారో చూడాలి. మరి మోడీ ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదని మీరు అనుకుంటున్నారు. సర్జికల్ స్ట్రైక్ మంచి నిర్ణయమా. .లేక చర్చలు జరపడం మంచిదా. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.